నెలకు రూ.7,300తో కారు సొంతం.. చిన్న ఉద్యోగస్తులకు వరం! సెలెరియో ధర & EMI ప్లాన్ వివరాలు!
మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) భారత హ్యాచ్‌బ్యాక్ విభాగంలో చాలా కాలంగా తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది. నగర రోడ్లలో సులభంగా నడిపించగలిగే కాంపాక్ట్ డిజైన్, రోజువారీ వినియోగానికి అనువైన ప్రాక్టికల్ ఫీచర్లు ఈ కారును ఎంతో ఉపయోగకరంగా మారుస్తాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి నమ్మకమైన కారు కావాలనుకునే కుటుంబాలు, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారు, మొదటి కారుగా కొనాలనుకునే కస్టమర్లకు సెలెరియో ఎప్పుడూ ఒక బెటర్ ఆప్షన్‌గా నిలుస్తుంది. మారుతి సుజుకి బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం కూడా ఈ మోడల్‌కు మరింత బలాన్ని ఇస్తూ, దీన్ని మార్కెట్లో స్థిరమైన ఎంపికగా నిలబెడుతోంది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.4.70 లక్షలు నుంచి రూ.6.73 లక్షలు (ఎక్స్-షోరూమ్). EMI ఆప్షన్‌లో ఈ కారును కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఈ కథణంలో నెలవారీగా EMI డేటా మీ కోసం
మొదటగా, LXI (పెట్రోల్) వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.5.53 లక్షలు. ఇందులో రూ.2 లక్షల డౌన్‌పేమెంట్ ఇవ్వడంతో మిగిలిన రూ.3.53 లక్షలకు రుణం తీసుకోవాల్సి వస్తుంది. బ్యాంకులు సాధారణంగా ఇవ్వే 9% వడ్డీ రేటు ఆధారంగా 5 సంవత్సరాల రుణం తీసుకున్నట్లయితే, నెలవారీ EMI సుమారు రూ. 7,329 వరకు ఉంటుంది. ఈ వేరియంట్ సింపుల్, అఫోర్డబుల్ ప్యాకేజ్. తక్కువ ధరలో కారు కావాలనుకునే వారికి బెస్ట్.

తదుపరి, ఎక్కువ మంది కొనుగోలు చేసే VXI (పెట్రోల్) వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.6.11 లక్షలు. మీరు రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ.4.11 లక్షలకు రుణం పొందవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల రుణం తీసుకుంటే, నెలవారీ EMI సుమారు రూ.8,500 వరకు వస్తుంది. ఈ వేరియంట్‌లో ఫీచర్లు LXI మోడల్‌తో పోలిస్తే మరింతగా లభిస్తాయి.
ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కోరుకునే డ్రైవర్లకు VXI AMT వేరియంట్ ప్రాచుర్యం పొందిన ఆప్షన్. దీని ఆన్‌రోడ్ ధర రూ.6.64 లక్షలు ఉండగా, రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించిన తర్వాత మిగిలిన రూ.4.64 లక్షలకు రుణం తీసుకోవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల రుణం తీసుకున్నట్లయితే, నెలవారీ EMI సుమారు రూ.9,600 వరకు వస్తుంది. రోజూ ఆఫీస్ ట్రావెల్ చేసే వారికి, ఎక్కువసేపు డ్రైవ్ చేసే వారికి బెస్ట్.

మరింత ఫీచర్లు కోరుకునే కస్టమర్ల కోసం ZXI(పెట్రోల్) వేరియంట్ సెలెరియోలో బెస్ట్-విల్యూ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. దీని ఆన్‌రోడ్ ధర రూ.6.75 లక్షలు. ఇదే విధంగా కొనుగోలు సమయంలో రూ.2 లక్షల అడ్వాన్స్ చెల్లిస్తే, మిగిలిన రూ.4.75 లక్షలకు రుణం తీసుకోవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల టెన్‌రుతో చూడగా, నెలవారీ EMI సుమారు రూ.9,800 చెల్లించాల్సి వస్తుంది. ఇందులో లభించే ఫీచర్లు కారును మరింత ప్రీమియంగా అనిపించేట్టు చేస్తాయి.
CNG కోరుకునే కస్టమర్లలో హాట్ ఫేవరెట్‌గా నిలిచింది VXI CNG వేరియంట్. దీని ఆన్‌రోడ్ ధర రూ.7.07 లక్షలు. కొనుగోలులో రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ.5.07 లక్షలకు రుణం పొందవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి చూస్తే, నెలవారీ EMI సుమారు రూ.10,500 వరకు ఉంటుంది. ఈ వేరియంట్‌ను ఎక్కువ మంది ఎందుకు ఎంచుకుంటారంటే, ఇందులో లభించే అద్భుతమైన మైలేజ్ ప్రధాన కారణం.



Click it and Unblock the Notifications