దేశంలో నంబర్-1 కారు.. 100లో 50 మందికి ఇదే కావాలి! టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు చూసేయండి!

జూన్ నెల ప్రారంభం కావడంతో మే 2026 కార్ల అమ్మకాల గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఏ మోడల్‌కు ఎక్కువ డిమాండ్ ఉందో ఈ సంఖ్యలు స్పష్టంగా చూపించాయి. అమ్మకాల పరంగా మారుతి సుజుకి డిజైర్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ అత్యధిక అమ్మకాలు నమోదు చేసింది. ఒకప్పుడు టాప్‌లో కొనసాగిన టాటా పంచ్ వంటి ప్రముఖ మోడళ్లను కూడా వెనక్కి నెట్టి డిజైర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మిగతా మోడళ్ల వారీగా కూడా చూసినట్లయితే కొన్ని తమ స్థానాలను కోల్పోగా, మరికొన్ని తమ పాత స్థానాల కంటే మరింత మెరుగ్గా ముందుకు దూసుకువచ్చాయి. మరి గత నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

మే 2026లో భారత కార్ల మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్ మరోసారి తన సత్తా చాటింది. మొత్తం 24,546 యూనిట్ల అమ్మకాలతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. గత ఏడాది మేలో నమోదైన 18,084 యూనిట్లతో పోలిస్తే డిజైర్ 36 శాతం వృద్ధిని నమోదు చేసింది. రెండో స్థానాన్ని మారుతి ఫ్రాంక్స్ దక్కించుకుంది. టాటా పంచ్‌ను వెనక్కి నెట్టి ఈ ప్రీమియం క్రాస్ఓవర్ 20,686 యూనిట్ల అమ్మకాలు సాధించింది.

Maruti Dzire Becomes Best Selling Car In May 2026 Creta Finishes Last In Top 10

గత ఏడాది ఇదే నెలలో 13,584 యూనిట్లు విక్రయించబడగా, ఈసారి ఫ్రాంక్స్ 52 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది. మూడో స్థానంలో మారుతి ఎర్టిగా నిలిచింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన MPVగా కొనసాగుతున్న ఈ 7-సీటర్ వాహనం మే నెలలో 20,350 యూనిట్ల అమ్మకాలు సాధించింది. గత ఏడాది 16,140 యూనిట్లతో పోలిస్తే 26 శాతం వృద్ధి కనిపించింది.

నాలుగో స్థానంలో టాటా పంచ్ నిలిచింది. ర్యాంక్ కొద్దిగా దిగివచ్చినా డిమాండ్ మాత్రం బలంగానే కొనసాగుతోంది. మే నెలలో 20,208 యూనిట్లు అమ్ముడవగా, గత ఏడాది ఇదే సమయంలో విక్రయమైన 13,133 యూనిట్లతో పోలిస్తే 54 శాతం వృద్ధి నమోదు చేసింది. ఐదో స్థానాన్ని నెక్సాన్ సొంతం చేసుకుంది. మే 2026లో 19,100 యూనిట్లు విక్రయించబడగా, 2025 మేలో నమోదైన 13,096 యూనిట్లతో పోలిస్తే 46 శాతం పెరుగుదల కనిపించింది.

Maruti Dzire Becomes Best Selling Car In May 2026 Creta Finishes Last In Top 10

ఆరవ స్థానంలో మారుతి బాలెనో నిలిచింది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గత నెలలో 18,396 యూనిట్లు విక్రయించి, 2025 మేలోని 11,618 యూనిట్లతో పోలిస్తే 58 శాతం భారీ వృద్ధిని సాధించింది. ఏడో స్థానంలో మారుతి వాగన్ఆర్ నిలిచింది. భారత కుటుంబాలకు ఎంతో ఇష్టమైన ఈ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ 18,076 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. గత ఏడాది 13,949 యూనిట్లతో పోలిస్తే 30 శాతం వృద్ధి సాధించింది.

ఎనిమిదో స్థానంలో మారుతి స్విఫ్ట్ ఉంది. మే నెలలో 17,519 యూనిట్లు విక్రయించబడగా, గత ఏడాది ఇదే నెలలో నమోదైన 14,135 యూనిట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి కనిపించింది. తొమ్మిదో స్థానంలో మహీంద్రా స్కార్పియో నిలిచింది. ఎస్‌యూవీ ప్రియులలో ఇప్పటికీ బలమైన ఆదరణను కొనసాగిస్తున్న ఈ మోడల్ మే 2026లో 15,774 యూనిట్లు విక్రయించింది. గత ఏడాది 14,041 యూనిట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి నమోదు చేసింది.

Maruti Dzire Becomes Best Selling Car In May 2026 Creta Finishes Last In Top 10

టాప్-10 జాబితాలో పదో స్థానాన్ని హ్యుందాయ్ క్రెటా దక్కించుకుంది. మే నెలలో 15,235 యూనిట్లు అమ్ముడవగా, 2025 మేలో నమోదైన 14,860 యూనిట్లతో పోలిస్తే 3 శాతం స్వల్ప వృద్ధి మాత్రమే కనిపించింది. అయినప్పటికీ, మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మొత్తంగా చూస్తే, మే 2026లో మారుతి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాప్-10 జాబితాలో ఆరు మోడళ్లతో తన బలాన్ని చాటుకోగా, టాటా, మహీంద్రా కూడా బలంగా నిలిచాయి.

Article Published On: Friday, June 5, 2026, 11:10 [IST]
English summary
Maruti dzire becomes best selling car in may 2026 creta finishes last in top 10
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+