ధర రూ.7లక్షల లోపే.. 33 కిమీ మైలేజ్, 5 స్టార్ సేఫ్టీ.. నెలకు 11,000 మంది కొంటున్నారు..

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి బ్రాండుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, కమర్షియల్ వెహికల్స్ రంగంలో ఈ కంపెనీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం దేశంలోనే నంబర్-1 సెడాన్ కారుగా నిలిచిన మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

గత కొన్ని నెలలుగా ఈ కారు సేల్స్ పరంగా మిగతా అన్ని బ్రాండ్ల కార్ల మీద భారీగా పై చేయి సాధిస్తోంది. డిజైర్ సాధిస్తున్న ఈ అద్భుతమైన విజయానికి ప్రధాన కారణం అందులోని సిఎన్‌జి (CNG) వేరియంట్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఫైనాన్షియల్ ఇయర్ 2026 లోనే ఈ డిజైర్ సిఎన్‌జి వేరియంట్ ఏకంగా 1,35,330 యూనిట్లు అమ్ముడైంది. అంటే దేశవ్యాప్తంగా నెలకు సగటున 11,277 మంది కస్టమర్లు ఈ కారును ఎగబడి కొనుగోలు చేస్తుండటం విశేషం.

Maruti Dzire CNG Dominates Indian Market 33Km Mileage 5-Star Safety Rating Unmatched Affordability

మారుతి డిజైర్ కారుకు సాధారణ కస్టమర్లతో పాటు కమర్షియల్ వెహికల్ అంటే టాక్సీ, క్యాబ్ సెగ్మెంట్లలో తిరుగులేని డిమాండ్ ఉంది. ప్రయాణ ఖర్చులను భారీగా తగ్గించుకోవాలని చూసే ప్రతి ఒక్కరికీ ఈ కారు ఫస్ట్ ఛాయిస్‎గా మారుతోంది. దీనికి ప్రధాన కారణం ఈ కారు ఇచ్చే మైలేజ్. డిజైర్ సిఎన్‌జి వేరియంట్ ఒక కేజీ గ్యాస్‌కు ఏకంగా 33.73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల తరుణంలో ఇంతటి బంపర్ మైలేజ్ ఇవ్వడం వల్లే వాహనదారులు దీనికి జై కొడుతున్నారు. ధర విషయానికి వస్తే, మారుతి డిజైర్ బేస్ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6,25,600 గా ఉంది. కాగా, మైలేజ్ పరంగా టాప్‌లో ఉండే సిఎన్‌జి వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.8,03,100 గా నిర్ణయించారు.

Maruti Dzire CNG Dominates Indian Market 33Km Mileage 5-Star Safety Rating Unmatched Affordability

కొత్త తరం మారుతి డిజైర్ కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా లుక్స్ పరంగానూ ఎంతో స్టైలిష్‌గా అప్‌గ్రేడ్ అయింది. ఈ కారు ముందు భాగంలో అగ్రెసివ్ బంపర్, హారిజాంటల్ డిఆర్‌ఎల్స్ (DRLs)తో కూడిన సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఆకర్షణీయమైన వైడ్ గ్రిల్, రీడిజైన్ చేసిన ఫాగ్ లాంప్ హౌసింగ్ వంటి మార్పులు చేశారు. సైడ్ ప్రొఫైల్‌లో షోల్డర్ లైన్ ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

వీటితో పాటు షార్క్ ఫిన్ యాంటెన్నా, బూట్ లిడ్ స్పాయిలర్, వెనుక వైపు క్రోమ్ స్ట్రిప్‌తో అనుసంధానించబడిన Y-షేప్ ఎల్‌ఈడీ టైల్‌లైట్లు ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. మార్కెట్లో ఈ కారు ఎల్‌ఎక్స్‌ఐ (LXi), విఎక్స్‌ఐ (VXi), జెడ్‌ఎక్స్‌ఐ (ZXi), జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ (ZXi Plus) అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఈ కారులో 1.2-లీటర్, త్రీ-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 80 బ్రేక్ హార్స్‌పవర్ (bhp) శక్తిని, 112 న్యూటన్ మీటర్ల (Nm) గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టీ (AMT) ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇంటీరియర్ విషయానికి వస్తే, కారు లోపల బేజ్, బ్లాక్ కలర్ థీమ్‌తో కూడిన డ్యాష్‌బోర్డ్‌పై ఫాక్స్ వుడ్ ఫినిషింగ్ ఇచ్చారు.

Maruti Dzire CNG Dominates Indian Market 33Km Mileage 5-Star Safety Rating Unmatched Affordability

ఇది కారుకు లగ్జరీ ఫీల్‌ను తెస్తుంది. అలాగే అనలాగ్ డ్రైవర్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ ఏసీ వెంట్స్, ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా సింగిల్-పేన్ సన్‌రూఫ్ వంటి అధునాతన ఫీచర్లను కూడా అందించారు.

ఒకప్పుడు మారుతి కార్లలో సేఫ్టీ తక్కువగా ఉంటుందనే విమర్శలు ఉండేవి. కానీ, ఈ సరికొత్త రివైజ్డ్ కాంపాక్ట్ సెడాన్ కారుతో మారుతి సుజుకి ఆ అపవాదును పూర్తిగా చెరిపేసింది. భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెనుక పార్కింగ్ సెన్సార్లు, అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా 360-డిగ్రీ కెమెరా వంటి బలమైన సేఫ్టీ ఫీచర్లను జోడించింది.

అందుకే ప్రముఖ క్రాష్ టెస్టింగ్ సంస్థలైన గ్లోబల్ ఎన్‌క్యాప్ (GNCAP), భారత్ ఎన్‌క్యాప్ (BNCAP) పరీక్షల్లో ఈ కారు ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ రేటింగ్స్ కారణంగానే ఇప్పుడు ఫ్యామిలీ కస్టమర్లు కూడా ఎలాంటి భయం లేకుండా మారుతి డిజైన్‌ను కొనుగోలు చేస్తున్నారు.

Article Published On: Sunday, May 24, 2026, 9:10 [IST]
English summary
Maruti dzire cng dominates indian market 33km mileage 5 star safety rating unmatched affordability
Read more on: #maruti suzuki #cng #dzire
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+