కేవలం రూ.6.25 లక్షలకే బైకులాగా మైలేజీ ఇచ్చే కారు.. ఇది దేశంలోనే నంబర్ వన్ భయ్యా
భారత ఆటోమొబైల్ రంగంలో గత నెల మార్చి 2026 విక్రయాలు చూస్తుంటే కారు కొనాలనుకునే వారి అభిరుచులు మారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కేవలం చిన్న కార్లకే పరిమితమైన జనం, ఇప్పుడు సెడాన్, ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. గత నెలలో జరిగిన కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన ఈ కారు ఏకంగా 21,224 యూనిట్ల అమ్మకాలతో నంబర్ వన్ సీటును దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఈ కారు విక్రయాల్లో 37 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం.
సాధారణంగా భారతీయ మార్కెట్‌లో వ్యాగన్ఆర్ లేదా ఆల్టో వంటి హ్యాచ్‌బ్యాక్ కార్లు టాప్ లో ఉంటాయి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. మారుతి డిజైర్ తన పాత రికార్డులను చెరిపివేసి మొదటి స్థానానికి చేరుకుంది. దీనికి ప్రధాన కారణం ఈ కారు అందిస్తున్న సేఫ్టీ, మైలేజ్. క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ సాధించిన ఈ కారు, సురక్షితమైన ప్రయాణానికి హామీ ఇస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.6.25 లక్షల నుంచి ప్రారంభం కావడం సామాన్యులకు పెద్ద ప్లస్ పాయింట్. వీటన్నింటికీ మించి లీటరుకు ఏకంగా 33 కిలోమీటర్ల మైలేజీని (సీఎన్‌జీ వేరియంట్) ఆఫర్ చేస్తుండటంతో పెట్రోల్ ధరల భారం నుండి తప్పించుకోవాలనుకునే వారు ఈ కారును ఎగబడి కొంటున్నారు.

అమ్మకాల జాబితాలో రెండో స్థానాన్ని టాటా పంచ్ దక్కించుకుంది. ఈ మైక్రో ఎస్‌యూవీ గత నెలలో 20,977 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 18 శాతం వృద్ధిని కనబరిచింది. ఇక మూడో స్థానంలో టాటా నెక్సాన్ 19,810 యూనిట్లతో తన సత్తా చాటింది. ఈ రెండు కార్లు కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉండటం విశేషం. హ్యుందాయ్ క్రెటా నాలుగో స్థానంలో నిలవగా, 17,838 యూనిట్ల విక్రయాలను సాధించింది. అయితే క్రెటా విక్రయాల్లో ఒక శాతం స్వల్ప తగ్గుదల కనిపించడం గమనార్హం.
ఐదో స్థానంలో మారుతి సుజుకి అరీనా మోడల్ ఎర్టిగా నిలిచింది. ఫ్యామిలీ అంతా కలిసి ప్రయాణించేందుకు ఇష్టపడే వారు ఎర్టిగాను ఎంచుకోవడంతో ఇది 17,072 యూనిట్ల అమ్మకాలను పొందింది. ఆరో స్థానంలో మారుతి వ్యాగన్ఆర్ 17,025 యూనిట్లతో నిలిచింది. మారుతి బాలెనో ఏడో స్థానంలో 16,392 యూనిట్ల విక్రయాలతో 33 శాతం భారీ వృద్ధిని సాధించింది. మరోవైపు మారుతి బ్రెజ్జా అమ్మకాలు 3 శాతం తగ్గి 16,130 యూనిట్లతో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. మారుతి ఫ్రాంక్స్ తొమ్మిదో స్థానంలో 15,540 యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోతోంది.

టాప్-10 జాబితాలో మహీంద్రా స్కార్పియో పదో స్థానంలో నిలిచింది. పవర్‌ఫుల్ ఎస్‌యూవీగా పేరున్న స్కార్పియో 14,578 యూనిట్ల అమ్మకాలను సాధించింది. పదకొండో స్థానంలో మారుతి స్విఫ్ట్ 14,545 యూనిట్లతో ఉండగా, కియా సోనెట్ 12,012 యూనిట్లతో 12వ స్థానంలో ఉంది. ఒకప్పుడు టాప్ లో ఉండే మారుతి ఆల్టో ఇప్పుడు 11,515 యూనిట్లతో 13వ స్థానానికి పడిపోయింది. మారుతి ఈకో వ్యాన్ 11,333 యూనిట్లు, హ్యుందాయ్ వెన్యూ 11,147 యూనిట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మారుతి విక్టోరిస్ కూడా 11,062 యూనిట్లతో తన ఉనికిని చాటుకుంది.
టాప్-25 అమ్మకాల జాబితాలో మరికొన్ని ప్రముఖ కార్లు కూడా ఉన్నాయి. కియా సెల్టోస్ 11,041 యూనిట్లు, మహీంద్రా థార్ 10,872 యూనిట్లు, టయోటా హైరైడర్ 10,206 యూనిట్లతో మార్కెట్లో మంచి పోటీని ఇస్తున్నాయి. టయోటా ఇన్నోవా 10,156 యూనిట్లతో ఫ్యామిలీ సెగ్మెంట్‌లో తన హవా కొనసాగిస్తోంది. మహీంద్రా బొలెరో 9,788 యూనిట్లు, ఎక్స్‌యూవీ 7XO మోడల్ 9,210 యూనిట్లు, ఎక్స్‌యూవీ 3XO మోడల్ 9,199 యూనిట్లు అమ్ముడయ్యాయి. టాటా సియెర్రా 9,003 యూనిట్లతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోగా, చివరగా టాటా టియాగో 7,119 యూనిట్లతో 25వ స్థానంలో నిలిచింది.

మొత్తంగా చూస్తే, మార్చి 2026 నాటికి భారతీయ వినియోగదారులు కారు కొనేటప్పుడు కేవలం ధరనే కాకుండా, సేఫ్టీ ప్రమాణాలు (Safety Ratings), మైలేజీని కూడా ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. అందుకే మారుతి డిజైర్, టాటా పంచ్ వంటి కార్లు మార్కెట్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు కూడా పెరుగుతున్నప్పటికీ, ఇప్పటికీ పెట్రోల్, సీఎన్‌జీ వాహనాలదే పైచేయిగా ఉంది.


Click it and Unblock the Notifications








