లక్ష ఎక్కువైనా ఫర్వాలేదు కానీ రేంజ్ అదిరింది..ఇ-విటారా vs విండ్సర్ ఈవీ.. ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?

దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో సరికొత్త పోరు మొదలైంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి మారుతి సుజుకి తన తొలి గ్లోబల్ ఈవీ ఇ విటారా(Maruti Suzuki e-Vitara)ను ప్రవేశపెట్టి ఎంజీ (MG) మోటార్స్‌కు గట్టి సవాల్ విసిరింది. ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV) ఇప్పటికే తన వినూత్నమైన BaaS (Battery-as-a-Service) విధానంతో దూసుకుపోతుండగా ప్రస్తుతం మారుతి కూడా అదే దారిని ఎంచుకుంది. లక్ష రూపాయల ఎక్స్ ట్రా ధరతో వస్తున్నా, మారుతి నమ్మకం, ఫీచర్ల పరంగా విండ్సర్‌కు సరైన ప్రత్యర్థిగానే అనిపిస్తోంది.

బాస్ (BaaS) మోడల్‌లో ఏది బెస్ట్?
ఎలక్ట్రిక్ కారు కొనేటప్పుడు బ్యాటరీని కారుతో పాటు కొనకుండా, కేవలం కారును తక్కువ ధరకు కొని బ్యాటరీకి వాడిన కిలోమీటర్లను బట్టి అద్దె కట్టే విధానమే ఈ BaaS.

ఎంజీ విండ్సర్ ఈవీ: దీని బేస్ వేరియంట్ (Excite) బాస్ మోడల్‌లో కేవలం రూ.9.99 లక్షలకే లభిస్తోంది. ఒకవేళ మీరు బ్యాటరీతో సహా కొనాలనుకుంటే దీని ధర రూ.13.50 లక్షల నుంచి రూ.14 లక్షల మధ్య ఉంటుంది.

Maruti e-Vitara vs MG Windsor EV Which Electric Car Offers Better Range and VFM

మారుతి ఇ విటారా: దీని బేస్ వేరియంట్ (Delta) బాస్ మోడల్‌లో రూ.10.99 లక్షల వద్ద ప్రారంభమవుతోంది. అంటే ఎంజీ కంటే సరిగ్గా లక్ష రూపాయలు ఎక్కువ. స్టాండర్డ్ మోడల్ (బ్యాటరీతో కలిపి) ధర రూ.17 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ వేరియంట్ రూ.22.50 లక్షల వరకు ఉంది.

కిలోమీటరుకు ఎంత ఖర్చవుతుంది?
బ్యాటరీ అద్దె విషయానికి వస్తే ఎంజీ విండ్సర్ ఈవీ కిలోమీటరుకు రూ.3.50 వసూలు చేస్తుండగా, మారుతి ఇ విటారా సుమారు రూ.3.99 వసూలు చేస్తోంది. మెయింటెనెన్స్ ఖర్చు పరంగా విండ్సర్ స్వల్పంగా ముందంజలో ఉన్నా, మారుతికి ఉన్న భారీ సర్వీస్ నెట్‌వర్క్ కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది.

రేంజ్, పర్ఫార్మెన్స్
ఎలక్ట్రిక్ కార్లలో ముఖ్యమైనది రేంజ్. ఇక్కడ మారుతి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.
రేంజ్: ఇ విటారాలోని 61.1 kWh బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 543 కి.మీ రేంజ్‌ను అందిస్తోంది. అదే విండ్సర్ ఈవీ 38, 52.9 kWh బ్యాటరీ ఆప్షన్లతో 331 నుంచి 449 కి.మీ రేంజ్‌ను మాత్రమే ఇస్తుంది.

పవర్: ఇ విటారా 142 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తే, విండ్సర్ ఈవీ గరిష్టంగా 134 bhp ని అందిస్తుంది. అంటే పర్ఫార్మెన్స్, లాంగ్ డ్రైవ్స్ కోసం ఇ-విటారా బెటర్ ఛాయిస్.

Maruti e-Vitara vs MG Windsor EV Which Electric Car Offers Better Range and VFM

ఫీచర్లు, కంఫర్ట్
డిజైన్: విండ్సర్ ఈవీ ఒక క్రాస్ఓవర్ డిజైన్‌తో వస్తుంది. దీని లోపల స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వెనుక సీట్లు 135 డిగ్రీల వరకు వాలుతాయి (GrandView Seats). దీని బూట్ స్పేస్ 604 లీటర్లు.
ఎస్‌యూవీ లుక్: ఇ-విటారా పూర్తిస్థాయి ఎస్‌యూవీ డిజైన్‌ను కలిగి ఉంది. దీనికి 185 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. లోపల డ్యూయల్ స్క్రీన్ సెటప్ (10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ + 10.1 ఇంచ్ డిజిటల్ క్లస్టర్) చాలా మోడ్రన్‌గా ఉంటుంది.

సేఫ్టీ: రెండు కార్లలోనూ 6 ఎయిర్ బ్యాగులు, లెవల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరాలు వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. అయితే మారుతి ఇ-విటారా భారత్ NCAP లో 5-స్టార్ రేటింగ్ సాధించడం విశేషం.

ఏ కారు ఎవరి కోసం?
మీరు తక్కువ ధరలో ఎక్కువ స్పేస్, విలాసవంతమైన వెనుక సీట్లు, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ (15.6 ఇంచ్) కావాలనుకుంటే ఎంజీ విండ్సర్ ఈవీ సరైనది. అలా కాకుండా మీకు ఒక పక్కా ఎస్‌యూవీ లుక్, అత్యధిక రేంజ్, మారుతి బ్రాండ్ వాల్యూ, సేఫ్టీ రేటింగ్ కావాలనుకుంటే మారుతి ఇ విటారా కోసం అదనపు లక్ష రూపాయలు ఖర్చు చేయడం తప్పులేదు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 18, 2026, 10:17 [IST]
English summary
Maruti e vitara vs mg windsor ev which electric car offers better range and vfm
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+