పేదలు సైతం కొనేంత తక్కువ ధర.. ఇప్పటికే 14 లక్షల మంది కొన్నారు! ప్రతి 10 లో 9 ఇదే!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో వ్యాన్ సెగ్మెంట్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco). దాదాపు ఒకటిన్నర దశాబ్దంగా భారతీయ కుటుంబాలు, చిన్న వ్యాపారులు, ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు, వాణిజ్య వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకున్న ఈ వాహనం, తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. 2010లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈకో, కాలానుగుణంగా కొన్ని మార్పులు, అప్‌డేట్‌లతో ముందుకు సాగుతూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఈకో విజయానికి ప్రధాన కారణం దాని సరళమైన డిజైన్, విశాలమైన క్యాబిన్, తక్కువ నిర్వహణ ఖర్చులు, విశ్వసనీయ పనితీరు.
ఒకవైపు పెద్ద కుటుంబాలకు ఇది అనువైన ప్రయాణ వాహనంగా నిలుస్తుండగా, మరోవైపు చిన్న వ్యాపారాలు, స్కూల్ వాహనాలు, టూరిస్ట్ సర్వీసులు, సరుకు రవాణా అవసరాలకు కూడా విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఈ బహుముఖ వినియోగ సామర్థ్యమే ఈకోను భారత మార్కెట్లో అత్యంత విజయవంతమైన వ్యాన్‌గా నిలిపింది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈకో 14 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలను నమోదు చేయడం దాని ప్రజాదరణకు నిదర్శనం.

వ్యాన్ విభాగంలో ఇంత భారీ సంఖ్యలో అమ్ముడవడం సాధారణ విషయం కాదు. సంవత్సరాలు గడిచినా వినియోగదారుల విశ్వాసం తగ్గకుండా ఉండటం, ఈ వాహనం మార్కెట్లో ఎంత బలమైన స్థానాన్ని సంపాదించుకుందో స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం భారతీయ వ్యాన్ సెగ్మెంట్‌లో ఈకో దాదాపు 90 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండటం విశేషం. అంటే ఈ విభాగంలో అమ్ముడవుతున్న ప్రతి 10 వ్యాన్లలో సుమారు 9 ఈకో వాహనాలే కావడం గమనార్హం.
పోటీదారులు ఉన్నప్పటికీ, ధర, ఫీచర్లు వంటి అంశాలు ఈకోకు భారీ ఆధిక్యాన్ని అందిస్తున్నాయి. ఈకో సాధారణంగా జనవరి 2025 నాటికి, 12 లక్షల అమ్మకాలను అధిగమించింది. ఆ తరువాత 1,45,000 యూనిట్లను నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ నాటికి 50 వేల సేల్స్ నమోదు చేయగా మొత్తంగా 14 లక్షలకు పైగా సాధించింది. అలాగే, వ్యాన్ విభాగంలో 90 శాతం మార్కెట్ వాటా పొందడం విశేషం.

భారత మార్కెట్లో ఈ వ్యాన్ ప్రారంభ ధర సుమారు రూ.5.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర రూ.6.36 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ కారులో 6 మంది హాయిగా కొనుగోలు చేయవచ్చు. పనితీరు విషయానికి వస్తే, ఈకోలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తున్నారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 80 bhp పవర్, 104.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ CNG వేరియంట్‌ను కూడా అందిస్తోంది.
మైలేజ్ పరంగా కూడా ఈకో ఆకట్టుకుంటుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు సుమారు 19.7 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు. ఇక CNG వేరియంట్ విషయానికి వస్తే, కిలోకు సుమారు 26.8 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించగలదు. ఫీచర్ల పరంగా మారుతి సుజుకి ఈకో ఒక ప్రాక్టికల్ ఫ్యామిలీ, కమర్షియల్ వాహనంగా నిలుస్తుంది. ఇందులో పవర్ స్టీరింగ్, ఎయిర్ కండిషనింగ్, హీటర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు అందించారు.

ముఖ్యంగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వాహనానికి ఆధునిక టచ్‌ను అందించగా, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి. భద్రత విషయంలో ఈ వ్యాన్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తోంది. దీంతో డ్రైవర్‌తో పాటు ఇతర ప్రయాణికులకు కూడా మెరుగైన భద్రత లభిస్తుంది. అదనంగా, EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ABS అత్యవసర పరిస్థితుల్లో వాహనంపై మెరుగైన నియంత్రణను అందిస్తుంది.


Click it and Unblock the Notifications