ఏడు సీట్లు.. 26 కి.మీ మైలేజీ.. పెద్ద కుటుంబానికి పర్ఫెక్ట్ పార్టనర్..ఆకాశాన్ని తాకుతున్న ఈ కారు క్రేజ్

మిడిల్ క్లాస్ వాళ్లకు కారు కొనడం అనేది ఒక తీరని కల. ముఖ్యంగా పెద్ద కుటుంబం ఉన్నప్పుడు అందరూ కలిసి ప్రయాణించాలంటే ఏడు సీట్ల కారు తప్పనిసరి. అయితే మార్కెట్లో ఉన్న ఎంపీవీలు (MPVs), ఎస్‌యూవీల (SUVs) ధరలు చూస్తే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. కానీ, ఈ రంగుల ప్రపంచానికి దూరంగా ఒక కారు మాత్రం సైలెంటుగా రికార్డులు సృష్టిస్తోంది. అదే మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco). ఎలాంటి ఆర్భాటాలు లేకపోయినా, ప్రతి నెలా వేల సంఖ్యలో అమ్ముడవుతూ భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని రారాజుగా నిలుస్తోంది. కేవలం రూ.5.18 లక్షల ప్రారంభ ధరకే లభిస్తున్న ఈ 7-సీటర్ కారును కొనేందుకు జనం ఎందుకు ఎగబడుతున్నారో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY2026) గణంకాలను పరిశీలిస్తే, మారుతి ఈకో అమ్మకాలు చూసి దిగ్గజ కార్లే ఆశ్చర్యపోతున్నాయి. గడచిన 11 నెలల్లోనే ఈ కారు ఏకంగా 1,28,436 యూనిట్లు అమ్ముడైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 3 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే ప్రతి నెలా సగటున 11,600 మంది ఈ కారును తమ ఇంటికి తీసుకెళ్తున్నారు. టాటా పంచ్, మారుతి బ్రెజా వంటి మోడళ్లు అమ్మకాల పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా, ఈకో మాత్రం తన స్థిరత్వాన్ని కాపాడుకుంటోంది. దీనికి ప్రధాన కారణం దీని బహుముఖ ప్రయోజనం. ఇది కేవలం కుటుంబ అవసరాలకే కాకుండా, వ్యాపార రీత్యా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండటమే దీని విజయ రహస్యం.

Maruti Eeco Mania 11 600 Buyers Monthly for Indias Most Affordable 7-Seater

మారుతి ఈకోలో ప్రధాన ఆకర్షణ దీని ఇంజిన్ పనితీరు. ఇందులో అత్యాధునిక K-సిరీస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 80.76 PS పవర్, 104.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ధరలు మండుతున్న ఈ రోజుల్లో మైలేజీ ప్రాధాన్యత పెరిగింది. ఈకో పెట్రోల్ వెర్షన్ లీటరుకు 19.7 కి.మీ మైలేజీని ఇస్తుండగా, సీఎన్‌జీ (CNG) వెర్షన్ ఏకంగా 26.78 కి.మీ మైలేజీని అందిస్తోంది. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వరం. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే పర్యాటక రంగంలో, స్కూల్ వ్యాన్‌లుగా దీనిని ఎక్కువగా వాడుతున్నారు.

సేఫ్టీ విషయంలో కూడా మారుతి ఈకో ఇప్పుడు రాజీ పడటం లేదు. పాత మోడళ్లతో పోలిస్తే సరికొత్త ఈకోలో 11 రకాల సేఫ్టీ ఫీచర్లను జోడించారు. ఇందులో ముఖ్యంగా 6 ఎయిర్‌బ్యాగ్స్ (6 Airbags), ఏబీఎస్ విత్ ఈబీడీ (ABS with EBD), రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, చైల్డ్ లాక్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రభుత్వం కారు భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయడంతో మారుతి ఈ మార్పులను చేపట్టింది. లోపల డ్యాష్‌బోర్డును కూడా రీడిజైన్ చేశారు. సరికొత్త స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ దీనికి కొత్త లుక్‌ను ఇస్తున్నాయి. ఏసీ కంట్రోల్స్ కూడా ఇప్పుడు స్టైలిష్‌గా మారాయి.

Maruti Eeco Mania 11 600 Buyers Monthly for Indias Most Affordable 7-Seater

ఈ కారును కేవలం ఒకే రకంగా కాకుండా, మన అవసరాలకు తగ్గట్టుగా ఎంచుకోవచ్చు. ఇది 5-సీటర్, 7-సీటర్ ఫార్మాట్లలో లభిస్తుంది. అంతేకాకుండా కార్గో వెర్షన్, అంబులెన్స్ వెర్షన్ మరియు టూర్ వెర్షన్లలో కూడా అందుబాటులో ఉంది. ఈకో కొలతలు గమనిస్తే.. దీని పొడవు 3,675mm, వెడల్పు 1,475mm, ఎత్తు 1,825mm ఉంటుంది. ఇరుకైన సందుల్లో కూడా సులభంగా దూసుకెళ్లడం దీనికి ఉన్న మరో ప్లస్ పాయింట్. అందుకే పట్టణ ప్రాంతాల్లో సరుకుల రవాణాకు, ప్రయాణికుల రవాణాకు దీనిని మొదటి ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. తక్కువ ధరలో ఎక్కువ సీట్లు, అదిరిపోయే మైలేజీ, మారుతి నమ్మకం వెరసి ఈకో ఇప్పట్లో తగ్గేదేలే అంటోంది.

More from DriveSpark

Article Published On: Friday, March 13, 2026, 11:43 [IST]
English summary
Maruti eeco mania 11 600 buyers monthly for indias most affordable 7 seater
Read more on: #maruti suzuki #mpv #eeco
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+