7-సీటర్ కార్లలో దేశంలో చీప్ అండ్ బెస్ట్.. ఒక్కసారి కొంటే ఏళ్లు వాడిన టెన్షన్ లేదు! మిడిల్‌క్లాస్‌కు పర్ఫెక్ట్
2026 సంవత్సరం ప్రారంభంలోకి అడుగుపెట్టిన వేళ, దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థలు డిసెంబర్ 2025 చివరి నెల అమ్మకాల గణాంకాలను ఒకొక్కటిగా విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మారుతి సుజుకి (maruti suzuki) కూడా తన తాజా సేల్స్ డేటాను ప్రకటించింది. ఈ నివేదికలో ప్రత్యేకంగా భారత మార్కెట్‌లో డిసెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 7-సీటర్ కార్ల వివరాలు చోటు చేసుకున్నాయి. పెద్ద కుటుంబాలకు అనువైన కార్ల విభాగంలో ఎప్పటినుంచో ఆధిపత్యం చెలాయిస్తున్న మోడళ్లకు ఇది ఒక రకంగా పరీక్షలాంటిదే. ఈ జాబితాలో మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్న కారు మారుతి ఎర్టిగా (maruti ertiga). చాలా సంవత్సరాలుగా 7-సీటర్ సెగ్మెంట్‌లో నంబర్ 1గా కొనసాగుతున్న ఈ కారు, డిసెంబర్ 2025లో కూడా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
ప్రాక్టికల్ డిజైన్, నమ్మకమైన పనితీరు, మంచి మైలేజ్, మారుతి బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం ఇవన్నీ కలిసి ఎర్టిగాను భారతీయ కుటుంబాల మొదటి ఎంపికగా మార్చాయి. డిసెంబర్ నెలలో మొత్తం 16,586 యూనిట్లు అమ్ముడవ్వడం ద్వారా ఎర్టిగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కారుగా నిలిచింది. అంతేకాదు, టాప్ 10 అమ్మకాల జాబితాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఎర్టిగా అమ్మకాలు మూడు శాతం పెరగాయి.

ఇది మార్కెట్‌లో కొత్త మోడళ్ల పోటీ ఉన్నప్పటికీ, ఎర్టిగాపై నమ్మకం ఇంకా కొనసాగుతోందని స్పష్టంగా చూపిస్తోంది. ఈ కారు చాలా కాలంగా నంబర్ 1గా కొనసాగుతుండటానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కారును డిజైన్ చేయడం వల్లే ఇది వినియోగదారుల మొదటి ఎంపికగా మారింది. తగినంత స్థలం, అవసరమైన లగ్జరీ ఫీల్ కలగలిసి ఉండటం ఈ కారుకు పెద్ద ప్లస్ పాయింట్.
అంతేకాదు, 7-సీటర్ కార్ల విభాగంలో తక్కువ ధరలో అందుబాటులో ఉండటం కూడా దీనికి ఉన్న ప్రధాన బలం. కుటుంబంతో కలిసి ప్రయాణించాలనుకునే వారికి బడ్జెట్‌కు సరిపోయే కారుగా ఇది నిలుస్తోంది. ఈ కారులో ఏడుగురు వ్యక్తులు సౌకర్యంగా ప్రయాణించగలగడం మరో ముఖ్యమైన అంశం. మూడో వరుస సీట్లు కూడా ఉపయోగపడేలా ఉండటం వల్ల పెద్ద కుటుంబాలకు ఇది చాలా అనువైన కారు. అలాగే, పెద్ద బూట్ స్పేస్ అందుబాటులో ఉంది.

ఇది రోజువారీ ప్రయాణాలకే కాకుండా లాంగ్ ట్రిప్స్‌కు కూడా అనుకూలంగా మారుస్తోంది. ఇంజిన్ విషయానికి వస్తే, ఈ కారులో నమ్మదగిన, నిరూపితమైన ఇంజిన్‌ను అందించడం వల్ల వినియోగదారులకు విశ్వాసం పెరిగింది. పనితీరు పరంగా స్థిరంగా ఉండటంతో పాటు, ఇంధన సామర్థ్యం కూడా మంచి స్థాయిలో ఉండటం దీన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తోంది. అంతేకాదు, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం భారతీయ మార్కెట్‌లో ఈ కారుకు పెద్ద అడ్వాంటేజ్‌గా మారింది.
సర్వీస్ ఖర్చులు, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండటం వల్ల దీన్ని కొనుగోలు చేయడంలో వినియోగదారులు వెనకాడడం లేదు. ఈ MPV ధర రూ. 8.80 లక్షల నుంచి రూ. 12.94 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉండటంతో, మధ్యతరగతి, వాణిజ్య వినియోగదారులకు కూడా ఇది సులభంగా అందుబాటులోకి వస్తోంది. ఇందులో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 102 bhp హార్స్‌పవర్‌తో పాటు 139 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అదే విధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం కోరుకునే కస్టమర్ల కోసం 1.5-లీటర్ CNG ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 87 bhp హార్స్‌పవర్, 121 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, మంచి మైలేజీతో జేబుకు తక్కువ భారం పడేలా చేస్తుంది. ఈ MPV లీటరుకు సుమారు 20.30 నుంచి 26.11 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








