ఈ కారు మార్కెట్లోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు.. అప్పుడే రేట్లు పెంచేశారు భయ్యా
భారతదేశ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. ఎంతో కాలం ఎదురుచూసిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి (2026)లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV ఇ-విటారా (eVitara) ధరలను కంపెనీ మొదటిసారిగా పెంచుతున్నట్లు ప్రకటించింది. కారు తయారీకి అవసరమైన ముడిసరుకుల ధరలు పెరగడం, మార్కెట్ లో ఉన్న ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్లే ఈ ధరల సవరణ చేయాల్సి వచ్చిందని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ధరల పెంపు సాధారణ వేరియంట్లతో పాటు బ్యాటరీ-ఆస్-ఎ-సర్వీస్ (BaaS) మోడళ్లకు కూడా వర్తిస్తుంది.
జీటా వేరియంట్‌పైనే అత్యధికంగా పెంపు
భారత మార్కెట్లో మారుతి ఇ-విటారా కారు ముఖ్యంగా డెల్టా, జీటా, ఆల్ఫా (Delta, Zeta, Alpha) అనే మూడు ప్రధాన వేరియంట్లలో లభిస్తోంది. తాజా ధరల సవరణలో భాగంగా.. ఈ SUV మిడ్-స్పెక్ జీటా (Zeta) వేరియంట్‌పై కంపెనీ అత్యధికంగా రూ.30,000 వరకు ధరను పెంచింది.

అంటే ఈ వేరియంట్ కొనాలనుకునే వారు ఇకపై రూ.30,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో, అన్ని రకాల హై-ఎండ్ ఫీచర్లు ఉండే టాప్-ఎండ్ ఆల్ఫా (Alpha) వేరియంట్‌పై మునుపటి ధర కంటే రూ.20,000 వరకు పెంచుతూ మారుతి నిర్ణయం తీసుకుంది.
రెండు పవర్ ఫుల్ బ్యాటరీ ఆప్షన్లు - సూపర్ మైలేజ్
ధరలు పెరిగినప్పటికీ, ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVలో మారుతి సుజుకి అందిస్తున్న పవర్ ఫుల్ ప్యాకేజ్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ కారులో కంపెనీ రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను ఇస్తోంది. ఇందులో మొదటిది చిన్నదైన 49 kWh బ్యాటరీ కాగా, ఇది సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 440 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుంది.

ఇకపోతే లాంగ్ జర్నీలు చేయాలనుకునే వారి కోసం 61 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కూడా ఉంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై ఏకంగా 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ ధృవీకరించింది. మార్కెట్లో ఈ లాంగ్-రేంజ్ వెర్షన్‌కే డిమాండ్ ఎక్కువగా ఉంది.
భారత్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్
సేఫ్టీ (భద్రత) విషయంలో మారుతి ఇ-విటారా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇటీవల జరిగిన భారత్ NCAP (Bharat NCAP) క్రాష్ టెస్టింగ్‌లో ఈ ఎలక్ట్రిక్ కారు ఫుల్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
ప్రయాణికుల రక్షణ కోసం ఈ కారులో బేస్ వేరియంట్ నుంచి 7 ఎయిర్‌బ్యాగులు, లెవల్-2 ADAS టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), అన్ని వీల్స్‌కు డిస్క్ బ్రేక్‌లను స్టాండర్డ్‌గా అందించారు.

లగ్జరీ ఇంటీరియర్, సరికొత్త ధరల వివరాలు
కారు లోపల కస్టమర్లకు లగ్జరీ ఫీల్ ఇచ్చేలా పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ఫుల్ డిజిറ്റల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-టోన్ ప్రీమియం క్యాబిన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రసిద్ధ హార్మన్ కార్డన్ (Harman Kardon) సౌండ్ సిస్టమ్‌ను అమర్చారు. ధరల పెంపు తర్వాత ఇ-విటారా స్టాండర్డ్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.99 లక్షలుగా ఉంది.
కాగా, బ్యాటరీ రెంట్ విధానం (BaaS)లో దీనిని కేవలం రూ. 10.99 లక్షల ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లో ఇది మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా కర్వ్ ఈవీలతో పాటు ఈ నెల చివర్లో రాబోతున్న టాటా సియెర్రా ఈవీకి గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications