బైక్‌లా మైలేజ్ ఇచ్చే కారు.. హైదరాబాద్‌లో కొనాలంటే ఎంత ఖర్చవుతుంది? ఆన్-రోడ్ ధరలు ఇవే!

భారత మార్కెట్లో సబ్-కాంపాక్ట్ క్రాసోవర్ SUV సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. 2023 ఏప్రిల్‌లో విడుదలైన ఈ SUV, అతి తక్కువ కాలంలోనే లక్షలాది మంది వినియోగదారుల మనసు గెలుచుకుంది. స్టైలిష్ SUV తరహా డిజైన్, ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన మైలేజ్, అందుబాటు ధరలు మరియు మారుతి సుజుకి బ్రాండ్‌పై ఉన్న నమ్మకం ఫ్రాంక్స్ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అందుకే ప్రస్తుతం ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటిగా కొనసాగుతోంది. ధరల విషయానికి వస్తే, ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ.6.85 లక్షల నుంచి రూ.11.98 లక్షల వరకు ఉన్నాయి.

అయితే కొనుగోలుదారులు వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే RTO రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆన్-రోడ్ ధర కాస్త పెరుగుతుంది. ఎక్స్ షోరూమ్ ధర అండ్ ఆన్‌రోడ్ ధరల మధ్య తేడా అనేది దేశంలోని ప్రాంతాలను బట్టి మారుతుంది. ఇప్పుడు ఈ కథణంలో హైదరాబాద్‌లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కొన్ని వేరియంట్ల ఎక్స్ షోరూమ్, ఆన్‌రోడ్ ధరల గురించి తెలుసుకుందాం.

Maruti Fronx Hyderabad Onroad Price With Include Rto Charges Insurance And Road Tax Details

హైదరాబాద్‌లో ఫ్రాంక్స్ బేస్ వేరియంట్ అయిన Sigma 1.2L పెట్రోల్ మాన్యువల్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.6.85 లక్షలు. అయితే వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురావాలంటే RTO రిజిస్ట్రేషన్, టెంపరరీ రిజిస్ట్రేషన్, ఇతర పన్నులు, ఇన్సూరెన్స్ ఛార్జీలు కూడా జత కావాల్సి ఉంటుంది. ఈ అన్ని ఖర్చులను కలిపి చూసినట్లయితే హైదరాబాద్‌లో ఈ వేరియంట్ ఆన్-రోడ్ ధర సుమారు రూ.8.18 లక్షల వరకు చేరుకుంటుంది.

Delta 1.2L పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ విషయానికి వస్తే, ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.7.70 లక్షలు. అదనంగా RTO ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇన్సూరెన్స్ ఖర్చులు జత కావడంతో మొత్తం ఆన్-రోడ్ ధర సుమారు రూ.9.25 లక్షల వరకు ఉంటుంది. బేస్ వేరియంట్‌తో పోలిస్తే ఈ మోడల్‌లో మరిన్ని ఫీచర్లు లభించడంతో పాటు, ధర కూడా అందుబాటులోనే ఉండటం వల్ల ఎక్కువ మంది కొనుగోలుదారులు ఈ వేరియంట్‌పై ఆసక్తి చూపుతున్నారు.

Maruti Fronx Hyderabad Onroad Price With Include Rto Charges Insurance And Road Tax Details

ఎక్కువ మైలేజ్‌ను కోరుకునే కొనుగోలుదారుల కోసం Sigma 1.2L CNG మాన్యువల్ వేరియంట్‌ను కూడా అందిస్తోంది. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.7.86 లక్షలు. అయితే RTO రిజిస్ట్రేషన్, ఇతర ప్రభుత్వ పన్నులు, టెంపరరీ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులు జత కావడంతో దీని ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో సుమారు రూ.9.44 లక్షల వరకు చేరుకుంటుంది.

మరోవైపు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఇష్టపడే వారి కోసం Delta Plus 1.2L పెట్రోల్ AMT వేరియంట్ అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.8.59 లక్షలు. అదనంగా RTO ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇన్సూరెన్స్ కలిపి చూసినట్లయితే, ఈ వేరియంట్ ఆన్-రోడ్ ధర సుమారు రూ.10.33 లక్షల వరకు ఉంటుంది. నగర ట్రాఫిక్‌లో తరచుగా డ్రైవ్ చేసే వారికి AMT గేర్‌బాక్స్ మంచి సౌకర్యాన్ని అందిస్తుంది.

Maruti Fronx Hyderabad Onroad Price With Include Rto Charges Insurance And Road Tax Details

మారుతి సుజుకి ఫ్రాంక్స్ మూడు ఇంజిన్ ఎంపికలను అందిస్తోంది. ఇందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ CNG పవర్‌ట్రెయిన్‌లు ఉన్నాయి. ఎక్కువ పనితీరును కోరుకునే వారి కోసం అందించిన 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 99 bhp శక్తిని ఉత్పత్తి చేస్తూ వేగవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అదే సమయంలో 20.1 నుంచి 21.5 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది.

రోజువారీ వినియోగానికి అనువైన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ వేరియంట్ 21.79 నుంచి 22.89 kmpl వరకు మైలేజ్ ఇవ్వగలదు. అయితే ఫ్రాంక్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఎంపిక CNG వేరియంట్ అని చెప్పవచ్చు. 1.2-లీటర్ CNG పవర్‌ట్రెయిన్ ఏకంగా 28.51 km/kg వరకు మైలేజ్ అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది కొన్ని ప్రీమియం బైకులతో సమాన మైలేజ్.

Article Published On: Wednesday, June 24, 2026, 14:06 [IST]
English summary
Maruti fronx hyderabad onroad price with include rto charges insurance and road tax details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+