టాటా పంచ్‌కు గట్టి షాకిచ్చిన మారుతి ఫ్రాంక్స్.. కేవలం 478 కార్ల తేడాతో నంబర్ 2 ప్లేస్ గుంజేసిందిగా!

మే 2026 దేశీయ కార్ల సేల్స్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్‌లో ఎప్పటిలాగే మారుతి సుజుకీ తన తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈసారి సేల్స్ చార్టులో మారుతి సుజుకి డిజైర్ కారు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని దూసుకుపోగా, మారుతి ఫ్రాంక్స్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా మార్కెట్‌ను ఏలుతున్న టాటా పంచ్ కారును వెనక్కి నెట్టి, ఫ్రాంక్స్ దేశంలోనే రెండో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. ఫ్రాంక్స్ కారుకు వచ్చిన డిమాండ్ ముందు టాటా పంచ్ ఈసారి కాస్త వెనకబడక తప్పలేదు.

మే నెల సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే మారుతి ఫ్రాంక్స్, టాటా పంచ్ మధ్య గట్టి పోటీ నడిచింది. గత నెలలో మారుతి ఫ్రాంక్స్ కారుకు చెందిన 20,686 యూనిట్లు అమ్ముడుపోగా, టాటా పంచ్ కారుకు చెందిన 20,208 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

Maruti Fronx Overtakes Tata Punch to Become India s Second Best-Selling Car in May 2026

అంటే కేవలం 478 కార్ల స్వల్ప తేడాతో టాటా పంచ్‌పై మారుతి ఫ్రాంక్స్ విజయం సాధించింది. ప్రస్తుతం మార్కెట్లో మారుతి ఫ్రాంక్స్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర 6,84,900 రూపాయలుగా ఉంది. అయితే ఈ కారుకు ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా కంపెనీ ఈ నెలలోనే దీని ధరను మరో 30,000 రూపాయల వరకు పెంచే యోచనలో ఉంది.

గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల వివరాలను చూస్తే, మొదటి స్థానంలో మారుతి డిజైర్ 24,546 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మారుతి ఫ్రాంక్స్ 20,686 యూనిట్లు, మూడో స్థానంలో మారుతి అర్టిగా 20,350 యూనిట్లతో నిలిచాయి. ఎప్పుడూ టాప్‌లో ఉండే టాటా పంచ్ ఈసారి 20,208 యూనిట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది.

Maruti Fronx Overtakes Tata Punch to Become India s Second Best-Selling Car in May 2026

ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టాటా నెక్సాన్ 19,100 యూనిట్లు, మారుతి బలెనో 18,396 యూనిట్లు, మారుతి వ్యాగన్ఆర్ 18,076 యూనిట్లు, మారుతి స్విఫ్ట్ 17,519 యూనిట్లతో నిలిచాయి. ఇక చివరి రెండు స్థానాల్లో మహీంద్రా స్కార్పియో 15,774 యూనిట్లు, హ్యుందాయ్ క్రెటా 15,235 యూనిట్ల అమ్మకాలతో సరిపెట్టుకున్నాయి.

మారుతి ఫ్రాంక్స్ కారు ఇంత పెద్ద సక్సెస్ కావడానికి దాని లుక్స్, ఇంజన్ పవర్ ప్రధాన కారణం. ఇందులో 1.0 లీటర్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజన్ ఆప్షన్ ఉంది. ఇది కేవలం 5.3 సెకన్లలోనే 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనితో పాటు స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.2 లీటర్ కే-సిరీస్, డ్యూయల్ జెట్ ఇంజన్ కూడా లభిస్తుంది. ఈ కారు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ప్యాడల్ షిఫ్టర్స్ ఫీచర్‌తో వస్తుంది.

ఇక మైలేజ్ విషయానికి వస్తే లీటరుకు 22.89 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ కారు పొడవు 3995 మిమీ, వెడల్పు 1765 మిమీ, ఎత్తు 1550 మిమీ కాగా, ఇందులో 308 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది.

Maruti Fronx Overtakes Tata Punch to Become India s Second Best-Selling Car in May 2026

మారుతి ఫ్రాంక్స్ కారులో కస్టమర్లను ఆకట్టుకునే ఎన్నో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, లెదర్ స్టీరింగ్ వీల్, 16 ఇంచుల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, వైర్‌లెస్ ఛార్జర్, 9 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు రియర్ ఏసీ వెంట్స్, ఫాస్ట్ యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్లు, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, రియర్ వ్యూ కెమెరా వంటి లగ్జరీ ఫీచర్లు కూడా ఇందులో ఇవ్వబడ్డాయి.

కార్ల సేఫ్టీ విషయంలో కూడా మారుతి ఫ్రాంక్స్ అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు (మొత్తం 6 ఎయిర్‌బ్యాగ్‌లు) ఉన్నాయి.

అలాగే హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఈబీడీతో కూడిన ఏబీఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా వస్తాయి. వీటితో పాటు టాప్ వేరియంట్లలో 360 డిగ్రీ కెమెరా, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం (IRVM) వంటి హై-ఎండ్ సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Article Published On: Wednesday, June 3, 2026, 17:13 [IST]
English summary
Maruti fronx overtakes tata punch to become india s second best selling car in may 2026
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+