ఒక ఇంజిన్‌లో 28 KM మైలేజ్.. ఇంకోదానిలో 20 KM.. మరోదానిలో 27 KM.. చాలా మంది ఈ కారే ఎంచుకున్నారు!

భారతీయ ఎస్‌యూవీ మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. ప్రారంభం నుంచే ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు, మెరుగైన ఇంధన సామర్థ్యం, అలాగే మారుతి సుజుకి బ్రాండ్‌పై వినియోగదారులకు ఉన్న నమ్మకం కారణంగా ఈ ఎస్‌యూవీకి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, తక్కువ ఇంధన వ్యయంతో మెరుగైన పనితీరు కోరుకునే కస్టమర్లను గ్రాండ్ విటారా బాగా ఆకట్టుకుంది. 2026 మే నెల అమ్మకాల గణాంకాలు ఈ ఎస్‌యూవీకి మార్కెట్లో ఎంతటి డిమాండ్ ఉందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా స్థిరంగా అమ్మకాలు నమోదు చేస్తూ వచ్చిన గ్రాండ్ విటారా, మే నెలలో మరింత జోరు ప్రదర్శించింది.

ఆ నెలలో మొత్తం 9,366 యూనిట్లు అమ్ముడుపోగా, గత ఏడాది మే నెలలో నమోదైన 5,197 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 80 శాతం వృద్ధి. ప్రస్తుతం మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, ఇంత భారీ వృద్ధిని నమోదు చేయడం గ్రాండ్ విటారా విజయాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ అమ్మకాల పెరుగుదలకు బలమైన మైలేజ్, ఫీచర్లు, రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండటం సానుకూలమైన కారణాలుగా చెప్పొచ్చు.

Maruti Grand Vitara Records 80 Percent Growth With 9366 Units Sales In May 2026

గ్రాండ్ విటారా విజయంలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌తో ప్లాట్‌ఫామ్, హైబ్రిడ్ టెక్నాలజీని పంచుకుంటుంది. అయినప్పటికీ, బ్రాండ్ ఇమేజ్, డీలర్ నెట్‌వర్క్, కస్టమర్ రీచ్ పరంగా మారుతి సుజుకి కలిగిన బలమైన ఆధిపత్యం గ్రాండ్ విటారాకు అదనపు ప్రయోజనాన్ని అందిస్తోంది. ఇదే సమయంలో, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కూడా గత నెలలో 8,664 యూనిట్ల అమ్మకాలతో మంచి ఫలితాన్ని నమోదు చేసింది.

ప్రస్తుతం మధ్యతరహా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ, గ్రాండ్ విటారా మాత్రం తన స్థిరమైన పనితీరు, వినియోగదారుల విశ్వాసం, హైబ్రిడ్ టెక్నాలజీ ఆకర్షణతో అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. మే 2026లో నమోదైన ఈ 80 శాతం వృద్ధి, రాబోయే నెలల్లో కూడా ఈ ఎస్‌యూవీకి డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సూచిస్తోంది. ముఖ్యంగా పండగల సీజన్ దీనికి బాగా కలిసి రావచ్చు.

Maruti Grand Vitara Records 80 Percent Growth With 9366 Units Sales In May 2026

గ్రాండ్ విటారా మార్కెట్లో రూ. 10.77 లక్షల నుంచి రూ. 19.57 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో అందుబాటులో ఉంది. విభిన్న అవసరాలు ఉన్న కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని మారుతి సుజుకి ఈ ఎస్‌యూవీని మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, అలాగే సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందిస్తోంది. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ 102 bhp శక్తి, 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు లభిస్తాయి. అంతేకాకుండా, మెరుగైన ట్రాక్షన్ కోరుకునే వినియోగదారుల కోసం ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వెర్షన్‌ను కూడా మారుతి అందిస్తోంది. సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండటం ఈ ఎస్‌యూవీకి మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. మరోవైపు, టెక్నాలజీ పరంగా మరింత ఆధునికమైన 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ eCVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.

Maruti Grand Vitara Records 80 Percent Growth With 9366 Units Sales In May 2026

ఈ సెటప్ గరిష్టంగా 113 bhp పవర్, 122 Nm టార్క్‌ను అందిస్తుంది . మైలేజ్ పరంగా గ్రాండ్ విటారా తన సెగ్మెంట్‌లో బలమైన పోటీదారుగా నిలుస్తోంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లు లీటరుకు 27.97 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తాయి. అదే సమయంలో, మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్లు గరిష్టంగా 19.38 kmpl మైలేజీని ఇస్తాయి. ఇక సీఎన్‌జీ మోడళ్లు కిలో సీఎన్‌జీకి 26.6 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవని మారుతి పేర్కొంటోంది.

Article Published On: Sunday, June 14, 2026, 9:07 [IST]
English summary
Maruti grand vitara records 80 percent growth with 9366 units sales in may 2026
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+