మారుతి షోరూముల్లో కొనే దిక్కులేక వెలవెలబోతున్న కార్లు.. జర వీటిని కూడా చూడండి భయ్యా
స్టాక్ మార్కెట్ నుంచి ఆటోమొబైల్ రంగం వరకు ప్రస్తుతం అంతా హాట్ హాట్‌గా సాగుతోంది. ముఖ్యంగా బడ్జెట్ కార్ల విభాగంలో ఇప్పుడు పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు మారుతి సుజుకి అంటే ఎదురులేకుండా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. తాజాగా అందుతున్న అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. మారుతి సుజుకి ఇగ్నిస్(Maruti Ignis)కు కస్టమర్లు దూరమవుతుండగా, టాటా టియాగో (Tata Tiago) వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. ఇగ్నిస్ కంటే టియాగో సుమారు రూ.78,000 తక్కువకే లభిస్తుండటంతో పాటు సేఫ్టీ విషయంలోనూ తిరుగులేదని నిరూపించుకుంటోంది.
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మారుతి సుజుకి అగ్రగామిగా కొనసాగుతున్నప్పటికీ, కొన్ని మోడళ్ల విషయంలో ఆ సంస్థకు గడ్డు కాలం నడుస్తోంది. ముఖ్యంగా ప్రీమియం నెక్సా(Nexa) షోరూమ్‌ల ద్వారా లభించే అత్యంత చవకైన కారు మారుతి ఇగ్నిస్ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది.

2026 జనవరి నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, ఈ మోడల్ అమ్మకాలు దాదాపు 49.68 శాతం పడిపోయాయి. గత ఏడాది జనవరిలో 3,780 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది అది కేవలం 1,902 యూనిట్లకు పరిమితం కావడం మారుతి యాజమాన్యానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు.
ఇగ్నిస్ వైఫల్యానికి ప్రధాన కారణం టాటా టియాగో అని స్పష్టంగా తెలుస్తోంది. ధర విషయానికి వస్తే.. ఇగ్నిస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.35 లక్షల నుండి ప్రారంభమవుతుండగా, టాటా టియాగో కేవలం రూ.4.57 లక్షలకే లభిస్తోంది. అంటే దాదాపు రూ.78,000 ఆదా అవుతుంది.
ఒక మధ్యతరగతి కుటుంబానికి ఇది చిన్న మొత్తమేమీ కాదు. ఈ మిగిలిన డబ్బుతో ఇన్సూరెన్స్ లేదా కార్ యాక్సెసరీస్ సులభంగా కొనుగోలు చేయవచ్చు. ధరతో పాటు, గ్లోబల్ NCAP రేటింగ్స్‌లో 4-స్టార్ సాధించిన టాటా సేఫ్టీ ప్రమాణాలు కస్టమర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

మారుతి ఇగ్నిస్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నప్పటికీ, కస్టమర్లు ఇతర అంశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఇగ్నిస్‌లో కేవలం 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో CNG ఆప్షన్ లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. మరోవైపు, టాటా టియాగో పెట్రోల్‌తో పాటు CNG, ఎలక్ట్రిక్ వేరియంట్లలో కూడా లభిస్తూ వినియోగదారులకు విభిన్న ఆప్షన్లను అందిస్తోంది.
వినియోగదారుల కోణంలో ఆలోచిస్తే, టియాగో అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, పెరుగుతున్న టాటా సర్వీస్ నెట్‌వర్క్ దీనికి అదనపు బలాన్ని ఇస్తున్నాయి. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా భద్రతకు ప్రాధాన్యత పెరగడంతో టాటా కార్లకు మంచి రీసేల్ వాల్యూ లభిస్తోంది. డ్రైవింగ్ కంఫర్ట్ మరియు క్యాబిన్ స్పేస్ విషయంలో కూడా టియాగోనే మెరుగ్గా ఉందని యూజర్ రివ్యూలు చెబుతున్నాయి.
కారు అనేది కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది మన కుటుంబ భద్రతకు సంబంధించినది. మారుతి బ్రాండ్ ఇమేజ్ కంటే, ప్రమాద సమయంలో ప్రయాణికులను కాపాడే కారు బాడీ స్ట్రక్చర్‌కే నేటి కస్టమర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ.78,000 ఆదా చేస్తూ, అత్యుత్తమ భద్రతను అందించే టాటా లిటిల్ డైనమో టియాగో ప్రస్తుతం బడ్జెట్ కస్టమర్లకు అసలైన స్మార్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications