భారీ డిస్కౌంట్లు ఇచ్చినా ఈ రూ.5 లక్షల కారును కొనే దిక్కులేదు.. మారుతికి పెద్ద తలనొప్పిగా మారింది

ఒకప్పుడు యువతలో స్టైలిష్ కారుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మారుతి ఇగ్నిస్ ఇప్పుడు షోరూమ్‌లలోనే మూలుగుతుంది. ఏప్రిల్ నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుకాకపోవడం ఆటో రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు భారీ తగ్గింపులు ప్రకటించినా వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ కారుకు భారత మార్కెట్లో ముగింపు దగ్గరపడిందనే చర్చ జోరందుకుంది.

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉన్న మారుతి సుజుకి, తన నెక్సా షోరూమ్‌ల ద్వారా విక్రయించే ఇగ్నిస్ కారును దాదాపు మార్కెట్ నుంచి తప్పించినట్టే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఏప్రిల్ అమ్మకాల గణాంకాల ప్రకారం.. ఈ కారుకు ఒక్క కస్టమర్ కూడా దొరకలేదు. అంటే ఏప్రిల్ నెల మొత్తం ఇగ్నిస్ విక్రయాలు సున్నాకే పరిమితమయ్యాయి.

maruti ignis sales zero huge discounts clearance sale details telugu

ప్రస్తుతం కంపెనీ వద్ద మిగిలిన స్టాక్‌ను క్లియర్ చేయడానికి భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇగ్నిస్‌పై రూ.57,500 వరకు తగ్గింపు ఇస్తున్నా కొనుగోలుదారులు పెద్దగా ముందుకు రావడం లేదని డీలర్లు చెబుతున్నారు. ఈ కారు ప్రారంభ ధర సుమారు రూ.5.35 లక్షలుగా ఉండేది. టాప్ వేరియంట్ ధర రూ.7.55 లక్షల వరకు వెళ్లేది.

ఇగ్నిస్ ఫెయిల్యూర్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి మారుతి సొంత కార్లే కావడం ఆసక్తికరం. అదే ధరలో వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బలెనో వంటి కార్లు ఎక్కువ ఫీచర్లు, మెరుగైన మైలేజీ, మంచి రీసేల్ విలువతో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వ్యాగన్ ఆర్ ధర ఇగ్నిస్ కంటే తక్కువగా ఉండటం వినియోగదారులను పూర్తిగా అక్కడికే మళ్లించింది.

maruti ignis sales zero huge discounts clearance sale details telugu

ఇటీవలి కాలంలో కార్ల కొనుగోలులో భద్రతకు ప్రాధాన్యం పెరిగింది. కానీ ఇగ్నిస్‌లో మాత్రం కంపెనీ పెద్దగా మార్పులు చేయలేదు. ఇప్పటికీ రెండు ఎయిర్‌బ్యాగ్‌లతోనే కొనసాగడం, ఆధునిక సేఫ్టీ ఫీచర్లు లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. అదే సమయంలో ఇతర మారుతి కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందుబాటులోకి రావడం ఇగ్నిస్‌ను మరింత వెనక్కి నెట్టింది.

ప్రస్తుతం దేశంలో సీఎన్‌జీ కార్లకు భారీ డిమాండ్ ఉంది. కానీ ఇగ్నిస్‌లో కంపెనీ ఎప్పుడూ ఫ్యాక్టరీ ఫిటెడ్ సీఎన్‌జీ ఆప్షన్ ఇవ్వలేదు. దీంతో తక్కువ ఖర్చుతో ప్రయాణించాలని చూసే వినియోగదారులు స్విఫ్ట్ సీఎన్‌జీ, వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ, బలెనో సీఎన్‌జీ వైపు వెళ్లిపోయారు.

maruti ignis sales zero huge discounts clearance sale details telugu

ఆటో రంగంలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఇగ్నిస్ స్థానంలో మారుతి త్వరలో కొత్త మైక్రో ఎస్‌యూవీని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇది టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వొచ్చని అంచనాలు ఉన్నాయి. అందుకే కంపెనీ ఇగ్నిస్ ఉత్పత్తిని నిశ్శబ్దంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది.

స్టైలిష్ డిజైన్ ఉన్నా, మార్కెట్ ట్రెండ్‌ను అందుకోవడంలో ఇగ్నిస్ వెనుకబడింది. యువత కోసం తీసుకొచ్చిన ఈ కారు, కాలానికి తగ్గ ఫీచర్లు, సేఫ్టీ అప్‌డేట్లు, సీఎన్‌జీ ఆప్షన్, బలమైన మార్కెటింగ్ లేక నెమ్మదిగా మార్కెట్ నుంచి కనుమరుగైపోయింది.

ప్రస్తుతం మార్కెట్లో కొత్త కార్లు ఎన్నో ఫీచర్లతో కస్టమర్లకు అందుబాటులోకి వస్తున్నాయి.. మారుతి కూడా ఈ కారుకు మరిన్ని ఫీచర్లు యాడ్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Article Published On: Friday, May 15, 2026, 11:49 [IST]
English summary
Maruti ignis sales zero huge discounts clearance sale details telugu
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+