23 కిమీ మైలేజ్ మారుతి భారీ 7/8 సీటర్‌ ధర రూ.2.15 లక్షలు తగ్గింది.. ఇప్పుడు కొంటే జాక్‌పాట్ తగిలినట్టే!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రతి నెలా వినియోగదారులను ఆకట్టుకునేందుకు కార్ల కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ముఖ్యంగా పండుగల సీజన్ కాకపోయినా, అమ్మకాలను పెంచేందుకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు వంటి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా ఈ మే నెలలో పలు మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అయితే అందులో అత్యధిక తగ్గింపులు పొందిన మోడల్‌గా మారుతి ఇన్విక్టో ఎంపీవీ ( Invicto MPV) ప్రత్యేకంగా నిలిచింది. పెద్ద కుటుంబాల కోసం ప్రీమియం 7/8 సీటర్ ఎంపికగా మార్కెట్లో ఉన్న మారుతి ఇన్విక్టోపై ఈసారి కంపెనీ భారీ తగ్గింపులను అందిస్తోంది.

ఈ మే నెలలో ఈ MPVని మొత్తం రూ. 2.80 లక్షల వరకు తగ్గింపులతో కొనుగోలు చేసే అవకాశం పొందుతున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లో ఇంత భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్న ప్రీమియం MPVలలో ఇన్విక్టో ఒకటి. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్, ఇతర ప్రత్యేక స్కీములు కూడా ఉండే అవకాశం ఉంది. ఫ్యామిలీ కోసం పెద్ద సైజు కారు కావాలంటే ఇదే బెస్ట్.

Maruti Invicto May 2026 Offers And Benefits Worth Rs 2 80 Lakh More Details

ప్రస్తుతం రూ. 2.80 లక్షల వరకు తగ్గింపులు అందుబాటులో ఉండటంతో, ప్రీమియం 7/8 సీటర్ MPV కొనాలనుకునే వారికి ఈ మే నెల సరైన సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, లగ్జరీతో పాటు విశాలమైన స్పేస్ కోరుకునే వినియోగదారులు మారుతి ఇన్విక్టోను మంచి ఎంపికగా పరిగణిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా వినియోగదారులకు మొదటిగా రూ. 50,000 వరకు నేరుగా నగదు తగ్గింపును అందిస్తున్నారు.

దీనితో పాటు పాత కారును ఎక్స్ఛేంజ్ చేసే వారికి అదనంగా రూ. 1 లక్ష వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. మరోవైపు పాత వాహనాన్ని స్క్రాప్ చేయాలనుకునే కస్టమర్ల కోసం రూ. 1.15 లక్షల వరకు స్క్రాపేజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. అదనంగా కొన్ని కంపెనీల ఉద్యోగులకు మరియు అర్హత ఉన్న వినియోగదారులకు రూ. 15,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.

Maruti Invicto May 2026 Offers And Benefits Worth Rs 2 80 Lakh More Details

ఈ ప్రయోజనాలను కలిపి చూస్తే, ఇన్విక్టో కొనుగోలుపై భారీ మొత్తంలో ఆదా చేసుకునే అవకాశం పొందుతున్నారు. ప్రీమియం 7/8 సీటర్ MPV సెగ్మెంట్‌లో ఇంత పెద్ద డిస్కౌంట్ రావడం అరుదైన విషయం. అయితే ఈ ఆఫర్లు నగరం, డీలర్‌షిప్, వేరియంట్, స్టాక్ లభ్యత ఆధారంగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు, ఆఫర్ నిబంధనలు తెలుసుకోవాలనుకునే వినియోగదారులు తమ సమీప మారుతి సుజుకి డీలర్‌షిప్‌ను సంప్రదించడం మంచిది.

ఇన్విక్టో ప్రస్తుతం భారత మార్కెట్లో ప్రీమియం MPV సెగ్మెంట్‌లో కంపెనీకి ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇన్విక్టోను రూ. 24.97 లక్షల నుంచి రూ. 28.60 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరలకు విక్రయిస్తోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ MPVని మొత్తం మూడు వేరియంట్లలో అందిస్తున్నారు. జీటా ప్లస్ 7-సీటర్, జీటా ప్లస్ 8-సీటర్, ఆల్ఫా ప్లస్ 7-సీటర్ అనే ఆప్షన్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Maruti Invicto May 2026 Offers And Benefits Worth Rs 2 80 Lakh More Details

పెద్ద కుటుంబాలు లేదా ఎక్కువ మంది కలిసి ప్రయాణించే వారికి 8-సీటర్ వేరియంట్ మంచి ఎంపికగా ఉండగా, మరింత ప్రీమియం అనుభవం కోరుకునే వారికి 7-సీటర్ కెప్టెన్ సీట్ల ఆప్షన్ ఆకర్షణీయంగా మారుతోంది. ఇన్విక్టోలో అన్ని వేరియంట్లకూ ఒకే రకమైన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అందిస్తున్నారు. పెట్రోల్ ఇంజిన్‌తో కలిసి పనిచేసే ఈ హైబ్రిడ్ సిస్టమ్ మంచి పనితీరుతో పాటు 23 కి.మీ మైలేజ్ కూడా అందిస్తుంది.

నగర రోడ్లపై స్మూత్ డ్రైవింగ్ అనుభవం ఇవ్వడమే కాకుండా, హైవేల్లో కూడా స్థిరమైన పనితీరును అందిస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో, హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఈ MPV మంచి మైలేజ్ ఇవ్వడం ప్రయోజనంగా మారింది. ప్రీమియం ఇంటీరియర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ సీట్లు, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు వంటి అనేక సౌకర్యాలు ఇన్విక్టోను మరింత లగ్జరీ ఫ్యామిలీ MPVగా నిలబెడుతున్నాయి.

Article Published On: Friday, May 8, 2026, 13:17 [IST]
English summary
Maruti invicto may 2026 offers and benefits worth rs 2 80 lakh more details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+