దేశంలో డిమాండ్ లేదు.. విదేశాల్లో మాత్రం దీనిదే హవా.. రూ.3.50 లక్షల మారుతి కారు కొత్త రికార్డు

భారత ఆటోమొబైల్ రంగంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మన దేశంలో జనం పెద్దగా పట్టించుకోని ఒక కారు, విదేశీయులకు మాత్రం విపరీతంగా నచ్చేస్తోంది. కేవలం రూ.3.50 లక్షలకే లభించే మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (S-Presso) ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. మార్చి 2026 గణాంకాలను పరిశీలిస్తే, ఈ కారు ఎగుమతుల్లో ఏకంగా 216 శాతం వృద్ధిని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంది. మార్చి నెలలో మన దేశంలో ఈ మోడల్ కేవలం 226 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే భారతీయ కస్టమర్లు ఇప్పుడు పెద్ద కార్లు లేదా ప్రీమియం ఫీచర్లు ఉన్న కార్ల వైపు మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది. అయితే, ఎగుమతుల విషయానికి వస్తే సీన్ పూర్తిగా మారిపోయింది.

Maruti S-Presso Exports Surge Over 6 000 Units Sold Abroad Despite Low Domestic Demand

మార్చి నెలలో ఏకంగా 6,377 మంది విదేశీ కస్టమర్లు ఎస్-ప్రెస్సోను కొనుగోలు చేశారు. గత ఏడాది మార్చిలో కేవలం 2,018 యూనిట్లు మాత్రమే ఎగుమతి కాగా, ఈసారి అది 6,377 కు చేరింది. అంటే ఏకంగా 216 శాతం వృద్ధిని నమోదు చేసింది. మారుతి సెలెరియో (116%), హ్యుందాయ్ i20 (106%) వంటి పాపులర్ కార్లను కూడా ఎస్-ప్రెస్సో వెనక్కి నెట్టింది.

ఎస్-ప్రెస్సో సక్సెస్‌కు ప్రధాన కారణం దాని ధర, మెయింటెన్స్ ఖర్చు. కేవలం రూ.3.50 లక్షల నుంచే ప్రారంభమయ్యే ఈ కారు, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటుంది. దీని 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 68PS పవర్, 89NM టార్క్‌ను అందిస్తుంది. మైలేజీ విషయంలో కూడా ఇది దిట్ట. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24 కిమీ నుంచి 24.76 కిమీ వరకు మైలేజీ ఇస్తుంటే, CNG వేరియంట్ ఏకంగా కిలోకు 32.73 కిమీ మైలేజీని ఇస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ కావాలనుకునే విదేశీ వినియోగదారులకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్‌గా మారింది.

Maruti S-Presso Exports Surge Over 6 000 Units Sold Abroad Despite Low Domestic Demand

ఎస్-ప్రెస్సోలో యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 7-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీ-లెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMస్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో కేవలం రెండు ఎయిర్‌బ్యాగ్‌లే ఉన్నప్పటికీ, మారుతి సుజుకి త్వరలోనే 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా తీసుకురావాలని యోచిస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో ఈ కారు సేఫ్టీ రేటింగ్ కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

మారుతి ఆల్టో K10 కూడా ఎగుమతుల్లో మంచి వృద్ధిని (122%) నమోదు చేసింది. ఆల్టో K10 హార్టెక్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి నిర్మించబడింది. ఇందులో 1.0L డ్యూయల్ జెట్ ఇంజన్ ఉంటుంది. దీని మైలేజీ కూడా దాదాపు 25 kmpl (పెట్రోల్), 33.85 kmpl (CNG) గా ఉంది. ఆల్టో K10లో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా మార్చారు. రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ABS విత్ EBD వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

భారతీయ రోడ్లపై కంటే విదేశీ రోడ్లపైనే మన మేడ్ ఇన్ ఇండియా కార్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్-ప్రెస్సో, సెలెరియో, ఆల్టో వంటి చిన్న కార్లకు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. తక్కువ ధర, ఎక్కువ మైలేజీ, మారుతి బ్రాండ్ పై ఉన్న నమ్మకం ఈ కార్లను అంతర్జాతీయ మార్కెట్లో రారాజులుగా నిలబెడుతున్నాయి.

Article Published On: Wednesday, April 22, 2026, 11:10 [IST]
English summary
Maruti s presso exports surge over 6 000 units sold abroad despite low domestic demand
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+