చేతిలో రూ.3 లక్షలు ఉంటే ఈ కారు కొనచ్చు! 32.73 కి.మీ మైలేజ్, 5 గురికి పర్ఫెక్ట్.. మారుతి ఆఫర్ భలేగా ఉంది
భారతీయ కార్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించేందుకు ఆఫర్లతో ముందుకు వస్తూ ఉండే మారుతి సుజుకి (Maruti Suzuki) ఈ ఏప్రిల్ నెలలో కూడా తన ప్రసిద్ధ చిన్న కారు మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో (Maruti Suzuki S-Presso) పై ఆకర్షణీయమైన తగ్గింపులను ప్రకటించింది. ఇప్పటికే దేశంలో అత్యంత చౌకైన కార్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మోడల్, ఇప్పుడు ఈ డిస్కౌంట్లతో మరింత అందుబాటులోకి వచ్చిందని చెప్పాలి. ఈ నెలలో కంపెనీ మొత్తం రూ. 37,500 వరకు లాభాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఇందులో భాగంగా కస్టమర్లకు నేరుగా ఉపయోగపడే క్యాష్ డిస్కౌంట్ (యూజర్ డిస్కౌంట్) రూ. 10,000 వరకు ఉంది. అంటే షోరూమ్‌లోనే కార్ ధర నుంచి ఈ మొత్తం తగ్గుతుంది.
అంతేకాకుండా, తమ పాత కారును మార్చుకోవాలనుకునే వారికి ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో రూ. 15,000 వరకు లాభం లభిస్తుంది. అదే సమయంలో, పాత వాహనాన్ని స్క్రాప్ చేయించేవారికి మరింత ప్రయోజనం కల్పిస్తూ రూ. 25,000 వరకు స్క్రాపేజ్ బోనస్ కూడా అందిస్తోంది. ఇవి మాత్రమే కాదు, కార్పొరేట్ ఉద్యోగుల కోసం అదనంగా రూ. 2,500 వరకు ప్రత్యేక డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.

ఈ అన్ని ఆఫర్లను కలిపి చూస్తే, ఇప్పటికే బడ్జెట్‌లో ఉండే ఈ కారు మరింత తక్కువ ధరలో దక్కుతుంది. ముఖ్యంగా మొదటిసారి కారు కొనాలనుకునే వారికి లేదా నగర ప్రయాణాలకు చిన్న, కాంపాక్ట్ కారు కావాలనుకునే వారికి మంచి అవకాశం. ఈ ఆఫర్లు ప్రాంతాన్ని బట్టి లేదా షోరూమ్‌ను బట్టి కొద్దిగా మారే అవకాశం ఉండటంతో, ఖచ్చితమైన వివరాల కోసం మీ సమీపంలోని మారుతి సుజుకి డీలర్‌షిప్‌ను సంప్రదించడం మంచిది.
భారతదేశంలో అత్యంత చౌకైన కార్‌గా మంచి గుర్తింపు పొందిన మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో ప్రస్తుతం ధరల పరంగా మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 3.50 లక్షల నుండి రూ. 5.25 లక్షలు. ఒకప్పుడు ఈ "అత్యంత చౌకైన కారు" టైటిల్ Alto K10 పేరిట ఉండేది. అయితే గతంలో జీఎస్టీ రేటు తగ్గింపు తర్వాత ఎస్-ప్రెస్సో ధరలో ఎక్కువ తగ్గింపు పొందింది.

ఇప్పుడు ఏప్రిల్ నెలకు ప్రత్యేకంగా ప్రకటించిన ఆఫర్లతో ఈ కారు మరింత అందుబాటులోకి వచ్చింది. మొత్తం తగ్గింపులను కలిపి చూస్తే, వినియోగదారులు ఈ కారును సుమారు రూ. 3 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు దగ్గరగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే బడ్జెట్ సెగ్మెంట్‌లో ఉన్న ఈ మోడల్, ఇప్పుడు ఇంకా తక్కువ ధరలో దొరికే స్థాయికి చేరింది.
భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ కలిగిన చిన్న కార్లలో ఒకటైన ఎస్-ప్రెస్సో నాలుగు ప్రధాన వేరియంట్లలో అందిస్తోంది. అవి STD (O), LXi (O), VXi (O), VXi (O)+. ఈ నాలుగు వేరియంట్లన్నీ స్టాండర్డ్‌గా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. అయితే మరింత సౌకర్యం కోరుకునే కస్టమర్ల కోసం టాప్ ఎండ్ వేరియంట్లు VXi (O), VXi (O)+ లో ఆటోమేటిక్ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే, ఈ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, CNG అనే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వినియోగదారుల కోసం CNG వేరియంట్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఈ CNG ఆప్షన్ LXi (O), VXi (O) వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మైలేజ్ పరంగా పెట్రోల్, CNG వేరియంట్లను బట్టి సుమారు 24.12 కిమీ/లీటర్ నుంచి 32.73 కిమీ/కేజీ వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది.


Click it and Unblock the Notifications








