పేద-మధ్యతరగతికి దేవుడి లాంటి కంపెనీ.. అతి తక్కువకే కార్లను అందించి కోట్ల మంది కలను నెరవేర్చింది!
భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రస్థానంలో నిలిచిన మారుతి సుజుకి (Maruti Suzuki) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. చాలా కాలంగా ప్రతి నెల అమ్మకాలలో ముందంజలో ఉండే ఈ సంస్థ, వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరం స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2026లో మారుతి సుజుకి మొత్తం 2,39,646 (దేశీయ+ఎగుమతులు) వాహనాలను విక్రయించింది. ఇది కేవలం ఒక మంచి సంఖ్య మాత్రమే కాదు కంపెనీ నెలవారీ అమ్మకాల చరిత్రలో కొత్త గరిష్ట స్థాయిని కూడా నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ 1,79,791 యూనిట్లను మాత్రమే విక్రయించగా, ఈసారి దాదాపు 33.29 శాతం వృద్ధిని సాధించడం విశేషం.
ఈ స్థాయి పెరుగుదల మార్కెట్లో మారుతి సుజుకి స్థానం ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. ఈ విజయానికి ప్రధాన కారణం కంపెనీ విస్తృతమైన మోడల్ లైన్‌అప్. చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ఫ్యామిలీ కార్లు, SUVలు వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు వినియోగదారుల అవసరాలను తీర్చుతున్నాయి. అదనంగా, మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, తక్కువ నిర్వహణ ఖర్చులు, దేశవ్యాప్తంగా సర్వీస్ నెట్‌వర్క్ కలిసి మారుతి సుజుకికి భారీ కస్టమర్ బేస్‌ను అందించాయి.

ప్రధానంగా దేశీయ మార్కెట్లో కనిపించిన బలమైన డిమాండ్ వల్లే మారుతి సుజుకి ఏప్రిల్ 2026లో రికార్డు స్థాయి ప్రదర్శనను నమోదు చేసింది. గత నెలలో 2,39,646 యూనిట్లలో దేశీయంగా ఉన్న తన షోరూమ్‌ల ద్వారా కంపెనీ మొత్తం 1,87,704 వాహనాలను విక్రయించడం గమనార్హం. ఇది గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన 1,38,704 యూనిట్లతో పోలిస్తే దాదాపు 35.33 శాతం పెరుగుదలని సూచిస్తోంది.
ఈ సంఖ్యలు కేవలం అమ్మకాల పెరుగుదలకే పరిమితం కాకుండా, దేశీయంగా మారుతి సుజుకి బ్రాండ్‌పై ఉన్న విశ్వాసాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన విభిన్న మోడళ్లు, అందుబాటు ధరలు, మంచి మైలేజ్ కలిసి ఈ డిమాండ్‌ను మరింత పెంచాయి. ప్రత్యేకంగా చూస్తే, ఈ వృద్ధిలో ఎక్కువ భాగం కంపెనీ కార్ల పోర్ట్‌ఫోలియో నుండే రావడం మరో ముఖ్య అంశం.

హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, SUVలు వంటి విభిన్న సెగ్మెంట్లలో అందుబాటులో ఉన్న మోడళ్లు విభిన్న వర్గాల వినియోగదారులను ఆకర్షించాయి. దీంతో, మారుతి సుజుకి దేశీయ అమ్మకాలలో మరింత బలమైన స్థానం సంపాదించగలిగింది. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ కార్లలో ఆల్టో, మారుతి ఎస్‌ప్రెస్సో వంటి మోడళ్లు కలిపి ఏప్రిల్ 2026లో 16,066 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 6,332 యూనిట్లతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలగా నిలిచింది.
ఇక కాంపాక్ట్, మిడ్-సైజ్ సెగ్మెంట్ విషయానికి వస్తే, ఇదే మారుతి సుజుకి అమ్మకాలలో అత్యంత కీలకమైన విభాగంగా కొనసాగుతోంది. బాలెనో, స్విఫ్ట్, డిజైర్, వ్యాగన్ ఆర్, సెలెరియో వంటి మోడళ్లతో కూడిన ఈ సెగ్మెంట్, ఏప్రిల్ 2025లోని 61,912 యూనిట్ల నుండి 80,659 యూనిట్లకు పెరిగింది. ఎస్‌యూవీ విభాగం కూడా మంచి ఊపు మీద ఉంది.

ఈ సెగ్మెంట్ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంలో 59,022 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 77,892 యూనిట్లకు పెరగడం గమనార్హం. అంటే, SUVలు, MPVలపై పెరుగుతున్న డిమాండ్ ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తోందని స్పష్టంగా కనిపిస్తోంది. ఎగుమతుల పరంగా ఏప్రిల్ 2026లో 40,054 యూనిట్లను రవాణా చేసి, వార్షికంగా 43.51% వృద్ధిని నమోదు చేసింది. ఇది గత ఏడాది 27,911 యూనిట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications