నాణ్యత లేని కార్లు కొనకండి.. మారుతి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్లు బెస్ట్! మీ ప్రాణాలకు పూర్తి రక్షణ

భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రస్థానంలో నిలిచిన మారుతి సుజుకి (Maruti Suzuki) దేశంలోనే అత్యధిక సంఖ్యలో కార్లు విక్రయించే సంస్థగా ప్రసిద్ధి చెందింది. సరసమైన ధరలు, అధిక ఇంధన సామర్థ్యం, సర్వీసింగ్ వంటి అంశాలు దీనిని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయి. అయితే గతంలో నిర్మాణ నాణ్యత విషయంలో ఈ సంస్థ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కొన్ని మోడళ్లకు తక్కువ సేఫ్టీ రేటింగ్ రావడంతో వినియోగదారుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సంస్థ భద్రతా ప్రమాణాలను గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంది. ఇటీవలి కాలంలో మారుతి వాహనాలు Bharat NCAP పరీక్షల్లో 5 స్టార్ రేటింగ్‌లు సాధించడం గమనార్హం. మారుతి సుజుకి డిజైర్, విక్టోరిస్, ఇన్విక్టో మోడళ్లను సంస్థ అత్యంత సురక్షితమైన వాహనాలుగా ప్రకటించింది. వీటి గురించి చూద్దాం.

Maruti Suzuki Dzire: దేశీయ మార్కెట్‌లో అత్యంత ఆదరణ పొందిన సెడాన్‌లలో ఒకటి మారుతి సుజుకి డిజైర్. Bharat NCAP నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో ఈ కారు 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను పొందడం విశేషం. పెద్దల రక్షణ విభాగంలో 32లో 29.46 పాయింట్లు, పిల్లల రక్షణ విభాగంలో 49లో 41.57 పాయింట్లు సాధించడం ద్వారా డిజైర్ తన స్థాయిని మరోసారి నిరూపించింది. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు ప్రామాణికంగా ఉన్నాయి.

Maruti Suzuki Bncap 5 Star Rated Cars Dzire Victoris And Invicto Details

యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్, ఎలక్ట్రానిక్ స్థిరత్వ నియంత్రణ, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.26 లక్షల నుంచి రూ. 9.31 లక్షల వరకు ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే, 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ సిఎన్‌జి వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్ 24 కిలోమీటర్లు, సిఎన్‌జి వేరియంట్ కిలోకు సుమారు 34 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదు.

Maruti Suzuki Victoris: మారుతి సుజుకి విక్టోరిస్‌ భద్రతా ప్రమాణాల్లో ఈ SUV కొత్త మైలురాయిని సృష్టించింది. Bharat NCAP నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో ఇది ప్రతిష్టాత్మక 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. వయోజన రక్షణ విభాగంలో 32లో 31.66 పాయింట్లు సాధించడం, పిల్లల రక్షణ విభాగంలో 49లో 43 పాయింట్లు నమోదు చేయడం ద్వారా ఇది కుటుంబాలకు అత్యంత విశ్వసనీయమైన ఎంపికగా నిలిచింది.

Maruti Suzuki Bncap 5 Star Rated Cars Dzire Victoris And Invicto Details

భద్రత పరంగా ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. లెవల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి. ధర పరంగా, రూ.10.50 లక్షల నుండి రూ.19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్, 1.5-లీటర్ CNG ఇంజిన్లతో 21.06 kmpl నుంచి గరిష్టంగా 28.65 kmpl వరకు ఇస్తుంది.

Maruti Suzuki Invicto: ప్రీమియం ఎంఫీవీ విభాగంలో మారుతి సుజుకి ఇన్విక్టో ప్రత్యేక స్థానం సంపాదించింది. Bharat NCAP నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో ఇది 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను అందుకుంది. వయోజన రక్షణ విభాగంలో 32లో 30.43 పాయింట్లు, పిల్లల రక్షణ విభాగంలో 49లో 45 పాయింట్లు సాధించడం ద్వారా ఇన్విక్టో కుటుంబ ప్రయాణాలకు విశ్వసనీయమైన వాహనంగా నిలిచింది.

Maruti Suzuki Bncap 5 Star Rated Cars Dzire Victoris And Invicto Details

ప్రయాణికుల భద్రత కోసం ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్థిరత్వ నియంత్రణ వ్యవస్థ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ముఖ్య ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్-షోరూమ్ ధర రూ.24.97 లక్షల నుండి రూ.28.61 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 2-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ అందుబాటులో ఉంది. ఇది సుమారు 23 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, February 16, 2026, 17:17 [IST]
English summary
Maruti suzuki bncap 5 star rated cars dzire victoris and invicto details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+