ప్రతినెలా 10 వేల మంది పైగా కొంటున్నారు.. గ్రామం నుంచి నగరం వరకు బెస్ట్ కారు

మారుతి సుజుకి బ్రెజ్జా (maruti suzuki brezza) భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక కాంపాక్ట్ SUV మాత్రమే కాదు... ప్రతి కుటుంబానికి పరిచయమైన ఇంటి పేరులా మారిపోయింది. స్టైలిష్ డిజైన్, విశ్వసనీయత, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, మారుతి సుజుకి బ్రాండ్‌పై ఉన్న నమ్మకం ఇవన్నీ కలసి బ్రెజ్జాను సంవత్సరాలుగా కొనుగోలుదారుల తొలి ఎంపికగా నిలిపాయి. అందుకే ఈ కారుకు డిమాండ్ రోజురోజుకూ మరింత బలపడుతూ వస్తోంది. ఈ పెరుగుతున్న డిమాండ్‌కు తాజా సాక్ష్యం డిసెంబర్ 2025 అమ్మకాల గణాంకాలు. గత నెలలో మాత్రమే మారుతి సుజుకి బ్రెజ్జా మొత్తం 17,700 యూనిట్లు వినియోగదారులకు విజయవంతంగా డెలివరీ చేయబడ్డాయి.

సంవత్సరం చివర్లో మార్కెట్ సాధారణంగా కొంచెం నెమ్మదిగా ఉంటుందని భావించే సమయంలో కూడా బ్రెజ్జా ఇంత పెద్ద సంఖ్యలో అమ్ముడవడం అంటే, ఈ SUVపై కస్టమర్లకు ఉన్న నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. బ్రెజ్జా విజయానికి ప్రధాన కారణం ఆల్‌రౌండ్ ప్యాకేజ్. సిటీ డ్రైవింగ్‌కి అనుకూలమైన పరిమాణం, హైవే ప్రయాణాల్లోనూ నమ్మకమైన పనితీరు ఇవి అన్నీ కలిసి దీన్ని ప్రతి వర్గం కొనుగోలుదారులకు సరిపోయే కారుగా మార్చాయి.

Maruti Suzuki Brezza December 2025 Sales Report 17700 Units More Details

డిసెంబర్ 2025లో బ్రెజ్జా సాధించిన అమ్మకాల జోరు ఒక్క నెలకే పరిమితం కాలేదని, గత కొన్ని నెలల గణాంకాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. నవంబర్‌లో 13,947 యూనిట్లు, అంతకుముందు అక్టోబర్‌లో 12,072 యూనిట్లు, సెప్టెంబర్‌లో 10,173 యూనిట్లు, అలాగే పండుగల సీజన్ ఆగస్టులో 13,620 యూనిట్లు, మరో నెలలో 14,065 యూనిట్లు అమ్ముడవడం ఇవన్నీ మారుతి సుజుకి బ్రెజ్జా అమ్మకాల గ్రాఫ్ ఎంత స్థిరంగా, బలంగా ముందుకు సాగుతోందో చూపిస్తున్నాయి.

నెలనెలా వేల సంఖ్యలో వినియోగదారులు ఈ SUVని తమ ఇంటికి తీసుకెళ్లడం వెనుక ఉన్న ప్రధాన కారణం, బ్రెజ్జా అందించే నమ్మకం, విలువైన ప్యాకేజ్‌నే చెప్పుకోవాలి. ఈ స్థాయి విజయానికి ధర కూడా ఒక ప్రధాన కారణంగా నిలుస్తోంది. మారుతి బ్రెజ్జా బడ్జెట్ ధరలకే అందుబాటులో ఉండటం వల్ల, మొదటిసారి కారు కొనుగోలు చేసే వారికి నుంచి, ఇప్పటికే వాహనం ఉన్నవారు అప్‌గ్రేడ్ కావాలనుకునే వరకు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Maruti Suzuki Brezza December 2025 Sales Report 17700 Units More Details

దీని కనీస ధర రూ. 8.26 లక్షలు, అలాగే గరిష్ట ధర రూ. 13 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండటం వల్ల, ఈ కాంపాక్ట్ SUV అన్ని తరగతుల వినియోగదారులకు సులభంగా అందుబాటులోకి వస్తోంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బ్రెజ్జాను నాలుగు ఆకర్షణీయమైన వేరియంట్లలో అందిస్తున్నారు. ఎంట్రీ లెవల్ నుంచి ప్రీమియం ఫీల్ వరకు కావాలనుకునే వారికి సరిపడేలా LXI, VXI, ZXI, ZXI ప్లస్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

బ్రెజ్జాలో ప్రధానంగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, అలాగే ఇంధన ఖర్చును మరింత తగ్గించే 1.5-లీటర్ CNG ఇంజిన్ అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు ఆప్షన్లు డ్రైవింగ్ స్టైల్‌కు అనుగుణంగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ఇస్తాయి. పెట్రోల్ వేరియంట్ పవర్, రిఫైన్మెంట్‌కు పేరుపొందితే, మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్ మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియెన్సీతో రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది.

Maruti Suzuki Brezza December 2025 Sales Report 17700 Units More Details

ఇక CNG వేరియంట్ అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. మైలేజ్ విషయంలోనూ బ్రెజ్జా నిరాశపరచదు. వేరియంట్, ఇంజిన్ ఎంపికను బట్టి ఇది గరిష్టంగా 25 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇంధన ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఇంత మంచి మైలేజ్ ఉండటం బ్రెజ్జాను మరింత ప్రాక్టికల్ SUVగా మారుస్తోంది.

వేరియంట్‌ను బట్టి ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా మరింత సౌకర్యవంతమైన డ్రైవ్ కోసం 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను అందిస్తోంది. దీని గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు, అలాగే కేవలం 16 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే సామర్థ్యం దీనిలో ఉంది. దీని వల్ల హైవే డ్రైవింగ్‌లోనూ, ఓవర్‌టేకింగ్ సమయంలోనూ డ్రైవర్‌కు మంచి కాన్ఫిడెన్స్ లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 6, 2026, 10:49 [IST]
English summary
Maruti suzuki brezza december 2025 sales report 17700 units more details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+