కొత్త అవతారంలో మారుతి బ్రెజ్జా.. రూ.11,000తో బుకింగ్ స్టార్ట్.. మరికొద్ది రోజుల్లో గ్రాండ్ లాంచ్
సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) ఇప్పుడు సరికొత్త అప్‌డేట్‌తో కొత్త అవతారంలో రాబోతోంది. చాలా కాలంగా ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం ఎదురుచూస్తున్న వారికి తాజాగా కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. అప్‌డేట్ చేసిన కొత్త బ్రెజ్జాను ఈ జూలైలో అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మారుతి సుజుకి, లాంచ్‌కు ముందే ఈ SUV కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. దీంతో కొత్త బ్రెజ్జాను ముందుగానే సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు ఇప్పటి నుంచే తమ పేరును నమోదు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మారుతి సుజుకి ఎరీనా డీలర్‌షిప్‌లలో ఈ కొత్త బ్రెజ్జా కోసం బుకింగ్‌లు స్వీకరిస్తున్నారు. అలాగే కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
కేవలం రూ.11,000 అమౌంట్ చెల్లించి, ఈ అప్‌డేట్ చేసిన SUVని రిజర్వ్ చేసుకోవచ్చు. ఇప్పటికే బ్రెజ్జాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో, కొత్త మోడల్‌కు కూడా మెరుగైన స్పందన లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న రెండో తరం మారుతి బ్రెజ్జా 2022లో పూర్తిస్థాయి మార్పులతో విడుదలైంది. అయితే ఇప్పుడు రాబోతున్న ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఆ మోడల్‌కు ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద అప్‌డేట్‌గా నిలవనుంది.

కొత్త బ్రెజ్జాలో ముందు మరింత ఆకట్టుకునే గ్రిల్ డిజైన్, కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్లు, కొత్త అలాయ్ వీల్స్, వెనుక మార్పులతో కూడిన టెయిల్‌ల్యాంప్స్ వంటి అప్‌డేట్‌లు కనిపించే అవకాశం ఉంది. ఈ ఫేస్‌లిఫ్ట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం కొత్త పవర్‌ట్రెయిన్. ఇప్పటివరకు వినియోగిస్తున్న ఇంజన్ స్థానంలో మరింత కొత్తది, ఫ్యూయల్ ఖర్చులను చాలా వరకు తగ్గించే కొత్త ఇంజన్‌ను ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం బ్రెజ్జా 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు 1.5 లీటర్ పెట్రోల్ ప్లస్ సీఎన్‌జీ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈసారి మారుతి సుజుకి తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఫ్రాంక్స్‌లో ఉపయోగిస్తున్న 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా బ్రెజ్జా లైనప్‌లో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టర్బో ఇంజన్ రావడం వల్ల బ్రెజ్జా పనితీరు మరింత మెరుగుపడుతుంది.
సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా మారుతి కొన్ని కీలక మార్పులు చేసే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం బూట్ స్పేస్‌ను కొంత మేర ఆక్రమించే సీఎన్‌జీ ట్యాంక్ స్థానంలో, అండర్‌బాడీలో అమర్చే కొత్త సీఎన్‌జీ ట్యాంక్‌ను అందించే అవకాశం ఉందని సమాచారం. ఇలా చేస్తే బూట్‌లో లగేజ్ కోసం ఎక్కువ స్థలం లభించడంతో పాటు కారులో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి చాలా కంఫర్ట్‌గా అనిపిస్తూ, ఒక ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.
క్యాబిన్‌లో కూడా మరింత ప్రీమియం అనుభూతిని కలిగించేలా మార్పులు ఉండనున్నాయి. ప్రస్తుతం అందిస్తున్న 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్థానంలో, మరింత పెద్దదైన 10.25 అంగుళాల హై-రిజల్యూషన్ డిస్‌ప్లేను అమర్చే అవకాశం ఉంది. ఈ కొత్త స్క్రీన్ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి కనెక్టివిటీ ఫీచర్లకు పూర్తి సపోర్ట్ ఇవ్వడంతో పాటు, మరింత వేగవంతమైన యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా అందించవచ్చని భావిస్తున్నారు.
అంతేకాకుండా, కొత్త బ్రెజ్జాలో కనెక్టెడ్ కార్ టెక్నాలజీని మరింత అడ్వాన్స్‌డ్‌గా అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ ద్వారా ట్రాక్ చేయడం, రిమోట్ ఫంక్షన్లను కంట్రోల్ చేయడం వంటి ఫీచర్లతో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ వంటివి ఉండనున్నయి. టాప్-ఎండ్ వేరియంట్లలో హెడ్-అప్ డిస్‌ప్లే (HUD) కూడా అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications