ఆ కారు రేటు పెంచకుండా రూ.55వేల డిస్కౌంట్ ఇస్తున్నారంటే.. షోరూమ్‌లో స్టాక్ ఖాళీ చేసే ప్లానా ?

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన మోస్ట్ పాపులర్ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజ్జా (Maruti Suzuki Brezza) సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సర్వం సిద్ధం చేసింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త 2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వచ్చే జూలై నెలలో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టెస్టింగ్ మోడల్స్ రోడ్లపై పలుమార్లు కనిపించాయి. అయితే, కొత్త కారు వస్తున్న తరుణంలో షోరూమ్‌లలో ఉన్న ప్రస్తుత మోడల్ స్టాక్‌ను త్వరగా ఖాళీ చేసేందుకు కంపెనీ కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను ఎరగా వేస్తోంది.

పైసా పెంచకుండా అదనపు తగ్గింపులు
సాధారణంగా ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల ధరలను అప్పుడప్పుడు పెంచుతుంటాయి. మారుతి సుజుకి కూడా ఇటీవల తన కొన్ని మోడళ్ల ధరలను పెంచినప్పటికీ, బ్రెజ్జా ధరలో మాత్రం ఒక్క రూపాయి కూడా మార్పు చేయలేదు. దీనికి తోడు జూన్ నెలలో ఈ కారును కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ. 55,000 వరకు భారీ ప్రయోజనాలను అందిస్తోంది.

Maruti Suzuki Brezza Gets Rs 55 000 Discount Ahead of 2026 Facelift Launch

ఇందులో రూ.25,000 వరకు క్యాష్ డిస్కౌంట్, పాత కారును ఎక్స్ఛేంజ్ చేసుకునే వారికి రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.15,000 వరకు స్క్రాపేజ్ బోనస్ లభిస్తాయి. ఇవి కాకుండా అదనంగా రూ.5,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లు పెట్రోల్, సిఎన్‌జి (CNG) వేరియంట్లు రెండింటికీ వర్తిస్తాయి.

2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో రాబోతున్న క్రేజీ అప్‌డేట్స్
త్వరలో రాబోయే సరికొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కేవలం లుక్స్ మాత్రమే కాకుండా, మెకానికల్ పరంగా కూడా పెద్ద మార్పులు చేయబోతున్నారు. ముఖ్యంగా ఇందులో మారుతి ఫ్రాంక్స్ (Fronx) కారులో ఉండే 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇచ్చే అవకాశం ఉంది.

ఇది 100bhp పవర్, 147Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్‌కు కొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేయనున్నారు. దీంతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ (5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్) కూడా యథావిధిగా కొనసాగుతుంది.

Maruti Suzuki Brezza Gets Rs 55 000 Discount Ahead of 2026 Facelift Launch

డిజైన్ మార్పులు, పెద్ద బూట్ స్పేస్ ట్విస్ట్
ఈ కొత్త మోడల్ టెస్టింగ్ ఫొటోలను గమనిస్తే.. కారు ముందు భాగంలో సరికొత్తగా డిజైన్ చేసిన వెడల్పాటి గ్రిల్, దాని మధ్యలో మందపాటి క్రోమ్ పట్టీ, రీడిజైన్ చేసిన బంపర్ మరియు సరికొత్త సిల్వర్ స్కిడ్ ప్లేట్ కనిపించనున్నాయి. కారు పొడవు, వెడల్పు, వీల్‌బేస్ వంటి కొలతల్లో ఎలాంటి మార్పులు ఉండవు.

అయితే సీఎన్‌జీ లవర్స్ కోసం మారుతి ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వబోతోంది. కొత్త బ్రెజ్జా సిఎన్‌జీ కారులో సిలిండర్‌ను కింద అమర్చే అండర్ బాడీ మౌంటెడ్ టెక్నాలజీని తీసుకురానున్నారు. దీనివల్ల కారు డిక్కీ (బూట్ స్పేస్)లో లగేజీ పెట్టుకోవడానికి చాలా ఎక్కువ స్థలం దొరుకుతుంది.

నెక్స్ట్ లెవెల్ లగ్జరీ ఫీచర్లు
కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్‌ను మరింత లగ్జరీగా మార్చనున్నారు. ఇందులో మారుతి విక్టోరిస్ (Victoris) కారు నుంచి సేకరించిన పెద్ద 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చనున్నారు.

వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సరికొత్త సీట్ అపోలిస్ట్రీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, కారు చుట్టుపక్కల దృశ్యాలను స్పష్టంగా చూపే 360-డిగ్రీ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లు ఈ కొత్త ఎస్‌యూవీలో భాగం కానున్నాయి.

Article Published On: Sunday, June 28, 2026, 15:15 [IST]
English summary
Maruti suzuki brezza gets rs 55 000 discount ahead of 2026 facelift launch
Read more on: #maruti suzuki #discount
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+