కేవలం 31 రోజుల్లోనే 17 వేల మందికి పైగా కొనేశారు.. ఈ కారుకు మార్కెట్ ఊహకు మించి డిమాండ్!

మారుతి సుజుకి 2026 సంవత్సరాన్ని కూడా బలమైన అమ్మకాలతోనే ప్రారంభించింది. జనవరి 2026 నెలలో కంపెనీ మొత్తం 2.37 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది, ఇది భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి ఆధిపత్యాన్ని మరోసారి స్పష్టంగా చూపిస్తోంది. ప్రయాణికుల కార్ల విభాగంలో వినియోగదారుల నమ్మకం పొందిన బ్రాండ్‌గా మారుతి కొనసాగుతుండటానికి ఈ గణాంకాలే సాక్ష్యం. ఈ భారీ అమ్మకాలలో స్విఫ్ట్, బ్రెజ్జా, డిజైర్, బాలెనో వంటి పాపులర్ మోడళ్లే ప్రధానంగా కీలక పాత్ర పోషించాయి. ఈ కార్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతుండటం వల్ల, జనవరి నెలలో ఇవి రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. స్టైల్, మైలేజ్, నమ్మకమైన పనితీరు, సరసమైన ధరల కలయికే ఈ మోడళ్లను వినియోగదారుల మొదటి ఎంపికగా మార్చిందని చెప్పవచ్చు.

ప్రత్యేకంగా మారుతి సుజుకి బ్రెజ్జా గురించి మాట్లాడితే, ఈ SUV తన విభాగంలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ అద్భుతమైన అమ్మకాలను నమోదు చేసింది. ఇతర బ్రాండ్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా, బ్రెజ్జా మాత్రం తన స్థానాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందంజలోనే కొనసాగుతోంది. ఇది మారుతి సుజుకి మొత్తం అమ్మకాల వృద్ధికి గణనీయంగా దోహదపడిందని చెప్పవచ్చు. జనవరి 2026లో మాత్రమే బ్రెజ్జా మొత్తం 17,486 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Maruti Suzuki Compact Suv Brezza January 2026 Sales Recorded 17486 Units

ఈ సంఖ్యను రోజువారీగా లెక్కిస్తే, ప్రతిరోజూ సగటున దాదాపు 564 బ్రెజ్జా కార్లు వినియోగదారులకు డెలివరీ అయ్యాయి అన్న మాట. ఇది ఏ మోడల్‌కైనా చిన్న విషయం కాదు. ఈ గణాంకాలు బ్రెజ్జా భారతీయ వినియోగదారులను ఎంత బలంగా ఆకర్షించిందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. భారతదేశంలో సబ్ కాంపాక్ట్ SUV విభాగం వేగంగా అభివృద్ధి చెందుతోంది, వీటిలో బ్రెజ్జా మార్కెట్లో నిలిచి ఉంటూ సంవత్సరాలుగా ప్రత్యర్థులతో పోరాడుతోంది.

కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 8,25,900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఫుల్ ఫీచర్లతో వచ్చే టాప్ వేరియంట్ ధర రూ. 13,01,300 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ ధరలో బ్రెజ్జా ఒక స్ట్రాంగ్ వాల్యూ ఫర్ మనీ కాంపాక్ట్ SUVగా నిలుస్తోంది. ఐదుగురు ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చునేలా రూపొందించిన ఈ SUV, ఫ్యామిలీ యూజ్‌తో పాటు డైలీ కమ్యూట్‌కు కూడా బాగా సరిపోతుంది.

Maruti Suzuki Compact Suv Brezza January 2026 Sales Recorded 17486 Units

ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే, మారుతి సుజుకి బ్రెజ్జాను K15 పెట్రోల్ అలాగే CNG ఆప్షన్‌లలో అందిస్తోంది. పెట్రోల్ వేరియంట్ పవర్, స్మూత్ డ్రైవింగ్‌కు అనువుగా ఉండగా, CNG వేరియంట్ తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ మైలేజ్ కోరుకునే వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తాయి, దీంతో డ్రైవర్ అవసరాలకు అనుగుణంగా వేరియంట్ ఎంచుకునే అవకాశం ఉంటుంది.

మైలేజ్ విషయంలో కూడా బ్రెజ్జా నిరాశపరచదు. ఈ SUV పెట్రోల్‌లో లీటరుకు 17.38 కి.మీ, అలాగే CNG వేరియంట్‌లో కిలోకు 25.51 కి.మీ మైలేజ్ అందించగలదు. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఈ మైలేజ్ గణాంకాలు బ్రెజ్జాను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో ఈ కారు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించడం విశేషం. ఇది ప్రయాణికుల భద్రతకు కంపెనీ ఇచ్చే ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తుంది.

Maruti Suzuki Compact Suv Brezza January 2026 Sales Recorded 17486 Units

ఈ కారులో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. లోపల 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, చుట్టు చూడటానికి 360-వ్యూ కెమెరా, 6-స్పీకర్ సెటప్‌తో పాటు అత్యాధునిక హెడ్-అప్ డిస్‌ప్లే వంటి అధునాతన లక్షణాలతో నిండి ఉంది. దీని ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అదనాతనంగా కనిపిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 5, 2026, 17:23 [IST]
English summary
Maruti suzuki compact suv brezza january 2026 sales recorded 17486 units
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+