ఇన్నాళ్ల నిరీక్షణకు తెర దించనున్న మారుతి.. పక్క కంపెనీలు కుళ్లుకునేలా త్వరలో మార్కెట్లోకి 3 ఎలక్ట్రిక్ కార్లు

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన రూటు మారుస్తోంది. ఇప్పటివరకు పెట్రోల్, సిఎన్‌జీ కార్లతో మార్కెట్‌ను ఏలిన మారుతి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EV) సెగ్మెంట్‌లో కూడా జెండా పాతేందుకు సిద్ధమైంది. 2031 నాటికి వరుసగా కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో అదిరిపోయే ఎలక్ట్రిక్ ఎంపీవీ, ఒక బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాంక్స్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ఉన్నాయి. మారుతి సుజుకి నుంచి రాబోతున్న ఆ మూడు అద్భుతమైన కార్ల వివరాలు చూద్దాం.

1. మారుతి సుజుకి YMC ఎలక్ట్రిక్ ఎంపీవీ (Maruti Suzuki YMC Electric MPV)
మారుతి సుజుకి నుంచి రాబోతున్న అత్యంత ఆసక్తికరమైన మోడల్ ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ. దీనికి YMC అనే కోడ్‌నేమ్ ఇచ్చారు. ఇది ఒక ప్యూర్ ఎలక్ట్రిక్ త్రీ-రో (Three-Row) ఎంపీవీ. అంటే ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా ప్రయాణించవచ్చు. ఈ కారు 2026 చివరి నాటికి, బహుశా దీపావళి సీజన్ (సెప్టెంబర్-అక్టోబర్) సమయంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Maruti Suzuki Confirms 3 New EVs Fronx EV Electric MPV and Budget Hatchback Coming Soon

ఫీచర్లు, రేంజ్
ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీని మారుతి మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-విటారా ప్లాట్‌ఫారమ్ మీదే నిర్మిస్తున్నారు. ఇందులో 49 kWh, 61 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది ఏకంగా 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. ఇది మార్కెట్లోకి వస్తే కియా క్యారెన్స్ ఈవీ, బీవైడీ eMax 7 వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. టయోటా కూడా దీనికి సమానమైన వెర్షన్‌ను 2027లో తీసుకువచ్చే అవకాశం ఉంది.

2. మారుతి సుజుకి eWX ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ (Maruti Suzuki eWX Electric Hatchback)
భారతదేశంలో మధ్యతరగతి ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలను చేరువ చేయడమే లక్ష్యంగా మారుతి ఈ చిన్న ఎలక్ట్రిక్ కారును సిద్ధం చేస్తోంది. ఇది K-EV అనే సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించిన eWX కాన్సెప్ట్ ఆధారంగా దీనిని తయారు చేస్తున్నారు. ఇది 2027 ద్వితీయార్ధంలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

Maruti Suzuki Confirms 3 New EVs Fronx EV Electric MPV and Budget Hatchback Coming Soon

ఫీచర్లు, ధర:
ఈ చిన్న కారులో 35 kWh బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చు, ఇది సుమారు 200 నుంచి 250 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని అసలైన ప్లస్ పాయింట్ దీని ధర. మారుతి దీనిని రూ.10 లక్షల కంటే తక్కువ ధరలోనే తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. దీనివల్ల టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీలకు ఇది గట్టి పోటీదారుగా మారుతుంది. లోకల్ గానే బ్యాటరీ తయారీ చేపడుతుండటం వల్ల ధర అందుబాటులో ఉండేలా మారుతి జాగ్రత్త పడుతోంది.

3. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎలక్ట్రిక్ (Maruti Suzuki Fronx EV)
మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో అత్యంత స్టైలిష్ కార్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఫ్రాంక్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలోకి మారబోతోంది. దీనిపై కంపెనీ ఇప్పటికే పని మొదలుపెట్టింది. 2028 ప్రారంభంలో ఇది మార్కెట్లోకి రావచ్చని అంచనా. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ఫ్రాంక్స్ డిజైన్‌ను ఇది కలిగి ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ వెర్షన్ అని తెలియడానికి ఫ్రంట్ గ్రిల్, అలాయ్ వీల్స్, లైటింగ్ సిస్టమ్‌లో కొన్ని కీలక మార్పులు చేయనున్నారు.

Maruti Suzuki Confirms 3 New EVs Fronx EV Electric MPV and Budget Hatchback Coming Soon

ఫీచర్లు, పర్ఫార్మెన్స్:
ఫ్రాంక్స్ ఈవీ పలు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రానుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 350 నుంచి 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో అత్యాధునిక టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. ఇది ఈ-విటారా కంటే తక్కువ ధరలో, మిడ్-రేంజ్ ఈవీ ప్రియులను ఆకట్టుకునేలా ఉండబోతోంది.

Source : www.livehindustan.com

More from DriveSpark

Article Published On: Monday, April 13, 2026, 17:44 [IST]
English summary
Maruti suzuki confirms 3 new evs fronx ev electric mpv and budget hatchback coming soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+