కేవలం రూ.4.61లక్షలు..మైలేజ్ ఏకంగా 34కిమీ..పేదల కోసం మారుతి తీసుకొచ్చిన ఆపద్భాందవులు ఈ కార్లు
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి హవా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలనుకునే సామాన్యుడికి మారుతి సిఎన్‌జి (CNG) కార్లు వరంలా మారాయి. ఇతర కార్ల కంపెనీలతో పోలిస్తే, మారుతి సుజుకి వద్దే అత్యధికంగా 14 రకాల సిఎన్‌జి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా ఆర్థిక సంవత్సరం 2025లో దేశవ్యాప్తంగా సీఎన్జీ వాహనాల అమ్మకాలు 22 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది ఏకంగా 8,38,546 సిఎన్‌జి కార్లు అమ్ముడవ్వగా, అందులో సింహభాగం మారుతి సుజుకివే కావడం విశేషం.
భారతదేశంలో మైలేజ్ అనే పదానికి మారుపేరు మారుతి సుజుకి. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నప్పటికీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యల వల్ల చాలామంది సిఎన్‌జి వైపు మొగ్గు చూపుతున్నారు.
మారుతి సుజుకి తన పోర్ట్‌ఫోలియోలో ఎస్-ప్రెసో, ఆల్టో K10, సెలెరియో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, ఈకో, డిజైర్, బాలెనో, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, బ్రెజా, ఎర్టిగా, XL6, విక్టోరిస్ వంటి 14 రకాల సిఎన్‌జి మోడళ్లను కలిగి ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ మూడు చౌకైన కార్లు (ఆల్టో, ఎస్-ప్రెసో, సెలెరియో) కలిపి సుమారు 12 వేల యూనిట్ల అమ్మకాలను సాధించాయి.

1. మారుతి ఆల్టో K10: సామాన్యుడి సూపర్ కార్ మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు ఆల్టో K10. ఇది కేవలం తక్కువ ధరకే కాకుండా, భారీ మైలేజీకి కూడా పెట్టింది పేరు. దీని సిఎన్‌జి వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4,81,900 నుంచి ప్రారంభమవుతుంది. గత ఏడాది 6,210 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఇందులో 1.0 లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్ ఇంజిన్ ఉంది. ఇది 66.62 PS పవర్, 89 Nm టార్క్ ఇస్తుంది. ఈ కారు సిఎన్‌జిపై లీటరుకు 33.85 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 7-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 6 ఎయిర్‌బ్యాగ్స్ (స్టాండర్డ్), ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

2. మారుతి ఎస్-ప్రెసో: మినీ ఎస్‌యూవీ లుక్ తక్కువ బడ్జెట్‌లో ఎస్‌యూవీ ఫీల్ కావాలనుకునే వారికి ఎస్-ప్రెసో సరైన ఎంపిక. మారుతి కార్లలో ఇదే అత్యంత చౌకైన సిఎన్‌జి మోడల్. దీని ప్రారంభ ధర రూ.4,61,900. గత ఏడాది 1,575 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో కూడా 1.0 లీటర్ ఇంజిన్ అమర్చారు. సిఎన్‌జి మోడ్‌లో ఇది 32.73 km/kg మైలేజీని ఇస్తుంది.
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీ-లెస్ ఎంట్రీ, హిల్ హోల్డ్ అసిస్ట్, స్మార్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. త్వరలో ఇందులో కూడా 6 ఎయిర్‌బ్యాగులను స్టాండర్డ్ చేయబోతున్నారు.

3. మారుతి సెలెరియో: స్టైలిష్ అండ్ ఎకనామికల్ కొంచెం స్టైలిష్‌గా, ఎక్కువ స్పేస్‌తో ఉండాలనుకునే వారికి సెలెరియో ఉత్తమ ఆప్షన్. దీని సిఎన్‌జి వేరియంట్ ప్రారంభ ధర రూ.5,97,900. గత ఏడాది 4,193 యూనిట్లు అమ్ముడయ్యాయి.
కేవలం మైలేజీ పరంగా చూస్తే, సెలెరియో అందరి కంటే ముందుంది. ఇది కేజీ సిఎన్‌జికి ఏకంగా 34.43 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. కొత్త రేడియంట్ ఫ్రంట్ గ్రిల్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, 12 రకాల సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
టాటా సియెర్రా, మహీంద్రా Scorpio N వంటి పెద్ద కార్ల హడావిడి ఉన్నప్పటికీ, మధ్యతరగతి ప్రజల నాడిని పట్టుకోవడంలో మారుతి సుజుకి ఎప్పుడూ ముందే ఉంటుంది. పెట్రోల్ కార్లతో పోలిస్తే సిఎన్‌జి కార్ల వల్ల కిలోమీటరుకు అయ్యే ప్రయాణ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా, ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో రోడ్ టాక్స్‌పై 100% మినహాయింపు ఇస్తుండటం కూడా ఈ కార్ల అమ్మకాలకు ప్లస్ పాయింట్‌గా మారింది. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజీ ఇచ్చే కారు కోసం చూస్తుంటే, ఈ మూడు మోడల్స్ బెస్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications








