34కిమీ మైలేజ్, రూ.4.99లక్షల ధర.. మిడిల్ క్లాస్ మెచ్చిన కార్లు.. 5.38 లక్షల మంది కొన్న టాప్ 3 మోడల్స్ ఇవే

భారతీయ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కారు అనేది ఒక కల. ఆ కలను సాకారం చేయడంలో మారుతి సుజుకి ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్ 2026లో భారత ఆటోమొబైల్ రంగం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. కేవలం 365 రోజుల్లో మారుతికి చెందిన మూడు కార్లు ఏకంగా 5.38 లక్షల మంది కస్టమర్లను సొంతం చేసుకోవడం విశేషం. ఈ కార్ల అమ్మకాలు, వాటి ప్రత్యేకతలు, సామాన్యుడికి ఇవి ఎందుకు అంత ఇష్టమో తెలుసుకుందాం.

2026 ఆర్థిక సంవత్సరంలో టాప్ 10 కార్ల జాబితాను నిశితంగా గమనిస్తే.. అందులో సగం మారుతి సుజుకి మోడల్స్ ఉండడం విశేషం. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన మారుతి స్విఫ్ట్, వ్యాగన్ఆర్, బలెనో కార్లు కలిసి మొత్తం 5,38,044 యూనిట్ల విక్రయాలను నమోదు చేశాయి. ఈ మూడు కార్లు కూడా ఏడాదిలో లక్ష కంటే ఎక్కువ మంది కస్టమర్లను సొంతం చేసుకున్న ఏకైక మోడల్స్‌గా నిలిచాయి.

Maruti Suzuki Dominates FY26 Swift WagonR and Baleno Record 5 38 Lakh Sales

స్విఫ్ట్ 1,85,350 యూనిట్లతో మొదటి స్థానంలో నిలవగా, వ్యాగన్ఆర్ 1,80,134 యూనిట్లతో రెండో స్థానంలో, బలెనో 1,72,560 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే భారతీయులకు మారుతి బ్రాండ్ మీద ఉన్న నమ్మకం ఎంటో అర్థం చేసుకోవచ్చు.

మారుతి స్విఫ్ట్ ఈ ఏడాది మరింత స్మార్ట్‌గా మారింది. కొత్త Z సిరీస్ 1.2 లీటర్ ఇంజన్‌తో వస్తున్న ఈ కారు, పాత వెర్షన్ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తోంది. ఇది 80bhp పవర్, 112nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా మైలేజీ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్ దాదాపు 25 కిలోమీటర్లు, సిఎన్‌జి వేరియంట్ ఏకంగా 32.85 కిలోమీటర్ల మైలేజీని ఇస్తోంది.

Maruti Suzuki Dominates FY26 Swift WagonR and Baleno Record 5 38 Lakh Sales

కేవలం మైలేజీ మాత్రమే కాదు, ఈసారి సేఫ్టీ విషయంలోనూ మారుతి రాజీ పడలేదు. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్, హిల్ హోల్డ్ కంట్రోల్, ESP వంటి ఫీచర్లు ఇచ్చారు. లోపల 9 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి మోడ్రన్ ఫీచర్లు మధ్యతరగతి కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. దీని ధర రూ.5.78 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

వ్యాగన్ఆర్ అంటేనే స్పేస్, మైలేజీకి మారుపేరు. కేవలం రూ.4.98 లక్షల ఆరంభ ధరతో దొరుకుతున్న ఈ కారు, ఇవాళా రేపు సామాన్యుడికి బెస్ట్ ఆప్షన్. ఇందులో 1.0 లీటర్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. సిఎన్‌జి వేరియంట్ అయితే లీటరుకు 34.05 కిలోమీటర్ల మైలేజీని ఇస్తూ మైలేజ్ కింగ్‌గా నిలిచింది.

Maruti Suzuki Dominates FY26 Swift WagonR and Baleno Record 5 38 Lakh Sales

లోపల విశాలమైన క్యాబిన్, 7 అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఈ కారును ఫ్యామిలీ మ్యాన్ ఫేవరెట్ చేశాయి. అందుకే మార్కెట్లో ఎన్ని కొత్త కార్లు వచ్చినా వ్యాగన్ఆర్ అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు.

కొంచెం స్టైలిష్ గా, ప్రీమియం గా ఉండాలనుకునే వారి ఛాయిస్ బలెనో. 90bhp పవర్‌ని ఇచ్చే 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ దీని సొంతం. ఇందులో ఉన్న 360 డిగ్రీ కెమెరా ఫీచర్ ఈ రేంజ్ కార్లలో మరే దానికీ లేదు. 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు దీనిని ఒక లగ్జరీ కారుగా మార్చాయి.

భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ రేటింగ్ సాధించడం ఈ కారు సేఫ్టీని చాటిచెబుతోంది. దీని ధర రూ.5.98 లక్షల నుంచి మొదలవుతుంది. అమ్మకాల్లో మూడో స్థానంలో ఉన్నా, యువతలో ఈ కారుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, అన్నింటికంటే ముఖ్యంగా అత్యుత్తమ మైలేజీని అందించడం వల్ల మారుతి కార్లు భారతీయ కుటుంబాలకు ప్రాణప్రదంగా మారాయి. మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండటం, రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉండటం కూడా ఈ కార్ల సక్సెస్‌కు ప్రధాన కారణాలు. మీరు కూడా కొత్త కారు కొనే ప్లాన్ లో ఉంటే, రూ.5 లక్షల బడ్జెట్ లో ఈ మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్స్ ఖచ్చితంగా మీ జాబితాలో ఉండాల్సిందే.

Article Published On: Sunday, April 26, 2026, 9:45 [IST]
English summary
Maruti suzuki dominates fy26 swift wagonr and baleno record 5 38 lakh sales
Read more on: #maruti swift #wagnor #budget
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+