ఇంత మంచి కార్లను ఇస్తున్నందుకు కంపెనీకి దండం పెట్టాలేమో...అందుకే విదేశీయులు కూడా ఫిదా అయ్యారు
భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి(Maruti Suzuki) మరోసారి తన అప్రతిహత జైత్రయాత్రను చాటుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి విక్రయాలతో దేశంలోనే నంబర్ వన్ కార్ల తయారీ సంస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా, విదేశాలకు కార్లను ఎగుమతి చేయడంలోనూ అగ్రగామిగా నిలిచింది.
ఒకవైపు మధ్యతరగతి ప్రజల మన్ననలు పొందుతూనే, మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి ఏకంగా 24,22,713 యూనిట్ల కార్లను విక్రయించి ఒక భారీ మైలురాయిని చేరుకుంది. గతేడాది (FY2025)లో 22.34 లక్షల కార్లు అమ్ముడవ్వగా, ఈ ఏడాది ఆ సంఖ్యను 24 లక్షలు దాటించడం విశేషం.

ఇందులో దేశీయ విక్రయాలు 19,74,939 యూనిట్లు కాగా, విదేశీ మార్కెట్లకు (ఎగుమతులు) ఏకంగా 4,47,774 కార్లను పంపింది. దీనితో భారతదేశం నుంచి అత్యధికంగా కార్లను ఎగుమతి చేస్తున్న కంపెనీగా మారుతి గర్వంగా నిలిచింది. మారుతి సుజుకి విజయానికి ప్రధాన కారణం చిన్న కార్ల విభాగంలో దానికి ఉన్న తిరుగులేని ఆధిపత్యం.
ముఖ్యంగా ప్రభుత్వం 4 మీటర్ల లోపు ఉన్న కార్లపై జీఎస్‌టీ (GST) రేట్లను తగ్గించడం మారుతికి బాగా కలిసివచ్చింది. బడ్జెట్ తక్కువలో ఉండి, మైలేజ్ ఎక్కువగా కావాలనుకునే ప్రతి ఒక్కరి మొదటి ఛాయిస్ మారుతినే అవుతోంది.

ఆల్టో (Alto), ఎస్-ప్రెస్సో (S-Presso): ఈ ఎంట్రీ లెవల్ కార్లు ఇప్పటికీ ఫస్ట్ టైమ్ కార్ బయ్యర్లకు ఫేవరెట్. తక్కువ మెయింటెనెన్స్ ఉండటం వల్ల వీటి సేల్స్ ఆగడం లేదు.
వాగన్ ఆర్ (WagonR), స్విఫ్ట్ (Swift): ఫ్యామిలీ కార్లుగా వీటికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెట్రోల్ తో పాటు సీఎన్జీ (CNG) వేరియంట్లు కూడా ఉండటంతో కస్టమర్లు క్యూ కడుతున్నారు.
బాలెనో (Baleno): ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో బాలెనో తన మార్కును కొనసాగిస్తోంది. దీని స్టైలిష్ లుక్ యువతను ఆకట్టుకుంటోంది.
కేవలం చిన్న కార్లకే పరిమితం కాకుండా, మారుతి సుజుకి ఇప్పుడు ఎస్‌యూవీ మార్కెట్‌ను కూడా శాసిస్తోంది. గత రెండేళ్లలో విడుదలైన మోడళ్లు కంపెనీ రూపురేఖలనే మార్చేశాయి.

మారుతి బ్రెజ్జా (Brezza): కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో బ్రెజ్జా తిరుగులేని రాజుగా నిలిచింది. సేఫ్టీ ఫీచర్లు, సన్‌రూఫ్ వంటి అప్‌డేట్స్‌తో దీని అమ్మకాలు అమాంతం పెరిగాయి.
గ్రాండ్ విటారా (Grand Vitara): హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన ఈ కారు, ఎస్‌యూవీ ఇష్టపడే వారికి మైలేజీని కూడా అందిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
ఫ్రాంక్స్ (Fronx): తన యూనిక్ డిజైన్‌తో తక్కువ కాలంలోనే లక్షల మంది మనసు గెలుచుకుంది. ఎగుమతుల్లో కూడా ఈ కారు వాటా గణనీయంగా ఉంది.
మారుతి సుజుకి కేవలం ఇండియాలోనే కాదు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య దేశాలలో కూడా తన ఉనికిని చాటుతోంది. FY2026లో 4.47 లక్షల కార్లను ఎగుమతి చేయడం ద్వారా దేశంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. అంటే మేడ్ ఇన్ ఇండియా మారుతి కార్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి.
మారుతి కార్లు అంటే సామాన్యుడికి నమ్మకం. తక్కువ ధర, అద్భుతమైన రీసేల్ వాల్యూ, ఎక్కడ పడితే అక్కడ దొరికే సర్వీస్ సెంటర్లు మారుతిని నంబర్ వన్ గా నిలబెట్టాయి.
అలాగే కంపెనీ వద్ద ఉన్న బలమైన డీలర్ నెట్‌వర్క్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా కార్ల విక్రయాలను పెంచేలా చేసింది. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనే (జనవరి-మార్చి 2026) 6.76 లక్షల కార్లు అమ్ముడవ్వడం చూస్తుంటే, మారుతి జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications