5-స్టార్ సేఫ్టీ, 33 కి.మీ మైలేజ్.. రూ.6.25 లక్షలకే అదిరిపోయే ఫీచర్లు.. మిడిల్ క్లాస్ మెచ్చిన కారు

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో సెడాన్ కార్ల(sedan cars) హవా తగ్గుతోందని అందరూ అనుకుంటున్న తరుణంలో, మారుతి సుజుకి డిజైర్(Maruti suzuki dzire 2026) ఆ అంచనాలను తారుమారు చేస్తోంది. కేవలం సెడాన్ సెగ్మెంట్‌లోనే కాకుండా, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా డిజైర్(dzire) తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఏప్రిల్ 2026 సేల్స్ రిపోర్టును గమనిస్తే, ఇతర కంపెనీల కార్లు డిజైర్ దరిదాపుల్లో కూడా లేవని స్పష్టమవుతోంది. తక్కువ ధర, అత్యుత్తమ మైలేజ్, ఊహించని భద్రత వంటి అంశాలే ఈ కారును నంబర్-1 స్థానంలో నిలబెట్టాయి.

గత నెలలో జరిగిన కార్ల అమ్మకాలను పరిశీలిస్తే మారుతి డిజైర్(Maruti dzire) అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. ఏప్రిల్ 2025లో 16,996 యూనిట్లు అమ్ముడవగా, ఏప్రిల్ 2026 నాటికి ఈ సంఖ్య ఏకంగా 23,580 యూనిట్లకు చేరుకుంది. అంటే దాదాపు 38.70 శాతం వృద్ధిని సాధించింది.

maruti suzuki dzire 2026 sales safety rating mileage features price details

ఇదే సమయంలో హ్యుందాయ్ ఆరా (4,587 యూనిట్లు), హోండా అమేజ్(honda amaze) (2,856 యూనిట్లు) వంటి కార్లు డిజైర్ రేసులో చాలా వెనుకబడిపోయాయి. టాటా టిగోర్(tata tigor), ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి కార్లు డిగ్రోత్‌ను నమోదు చేయడం గమనార్హం.

సాధారణంగా భారతీయ కస్టమర్లు కారు కొనేముందు అడిగే మొదటి ప్రశ్న మైలేజ్ ఎంత?. ఈ విషయంలో డిజైర్ తిరుగులేని సమాధానం చెబుతోంది. ఇందులో అమర్చిన 1.2-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది.

సాధారణ పెట్రోల్ వేరియంట్ మంచి మైలేజ్ ఇస్తుండగా, సిఎన్‌జి (CNG) వేరియంట్ ఏకంగా కిలోకు 33.73 కిలోమీటర్ల మైలేజీని అందిస్తోంది. పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఇంతటి మైలేజ్ ఇచ్చే కారు ఉండటం సామాన్యులకు పెద్ద ఊరట.

maruti suzuki dzire 2026 sales safety rating mileage features price details

మారుతి కార్లు అంటే సేఫ్టీ ఉండదు అనే అపవాదును ఈ కొత్త డిజైర్ చెరిపివేసింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ (GNCAP), భారత్ ఎన్‌క్యాప్ (BNCAP) పరీక్షల్లో ఈ కారు ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కంపెనీ ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా (అన్ని వేరియంట్లలో) అందిస్తోంది. దీనితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా ఫీచర్లు ప్రయాణికులకు పూర్తి భరోసానిస్తున్నాయి.

కొత్త డిజైర్ కేవలం సేఫ్టీ, మైలేజ్ మాత్రమే కాదు, ఫీచర్ల పరంగా కూడా ప్రీమియం లుక్‌ను సంతరించుకుంది. సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా ఇందులో 360-డిగ్రీల కెమెరాను పరిచయం చేశారు. దీనివల్ల కారును పార్కింగ్ చేయడం చాలా సులభమవుతుంది.

maruti suzuki dzire 2026 sales safety rating mileage features price details

లోపల 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సింగిల్ పేన్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. వై-షేప్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా ఈ కారుకు మోడ్రన్ లుక్‌ను ఇచ్చాయి.

ఇన్ని ఫీచర్లు, 5 స్టార్ సేఫ్టీ ఉన్నప్పటికీ మారుతి సుజుకి(maruti suzuki) ఈ కారు ధరను సామాన్యుడికి అందుబాటులోనే ఉంచింది. డిజైర్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 6,25,600గా ఉంది. కస్టమర్లు తమ బడ్జెట్, అవసరాలను బట్టి LXi, VXi, ZXi, ZXi Plus వంటి వేరియంట్లలో తమకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. మొత్తానికి తక్కువ బడ్జెట్‌లో ఫ్యామిలీ మొత్తం సురక్షితంగా, తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి డిజైర్ ఇప్పుడొక బెస్ట్ ఆప్షన్‌గా మారింది.

Article Published On: Monday, May 11, 2026, 14:09 [IST]
English summary
Maruti suzuki dzire 2026 sales safety rating mileage features price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+