దేశంలో ఎక్కువ మంది కొనుగోలు చేసిన కారు.. 5-స్టార్ సేఫ్టీ, 33km మైలేజ్, రూ. 6.26 లక్షల ధర
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా SUVల హవా కొనసాగుతోంది. చిన్న కార్ల నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు ఎక్కడ చూసినా SUVలకే ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. కొత్తగా కారును కొనుగోలు చేయాలనుకునే చాలా మంది వినియోగదారులు కూడా SUVల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సెడాన్ కారు మాత్రం అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. ఆ కారు మరెదో కాదు.. మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire). ఒకప్పుడు భారతీయ కుటుంబాల తొలి ఎంపికగా నిలిచిన సెడాన్ కార్లకు SUVల రాకతో డిమాండ్ తగ్గుతుందని చాలామంది భావించారు. కానీ డిజైర్ మాత్రం ఆ అంచనాలను తప్పు చేస్తూ వరుసగా అమ్మకాల పరంగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.
అమ్మకాల గణాంకాలు చూస్తే డిజైర్ ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 2026 మే నెలలో ఈ కాంపాక్ట్ సెడాన్ మొత్తం 24,546 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అంతకుముందు ఏప్రిల్ నెలలో 23,580 యూనిట్లు అమ్ముడవగా, కేవలం ఒక్క నెల వ్యవధిలోనే అమ్మకాలు 4.1 శాతం పెరిగాయి. SUVలు మార్కెట్‌ను శాసిస్తున్న సమయంలో ఒక సెడాన్ కారు ఇంత భారీ స్థాయిలో అమ్ముడవడం నిజంగా విశేషమే అని చెప్పాలి.

అంతేకాదు, డిజైర్ విజయం ఒక్క నెల లేదా ఒక్క ఏడాదికి పరిమితమైనది కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఈ కారు భారత మార్కెట్లో స్థిరమైన డిమాండ్‌ను కొనసాగిస్తోంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో ఇది ఎప్పుడూ ముందువరుసలో కనిపిస్తుంది. ఫ్యామిలీ కారుగా నమ్మకం, టాక్సీ కారుగా లాభదాయకత, 5-స్టార్ భద్రత కూడా కలవడంతో డిజైర్ విజయయాత్ర మరింత బలపడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం ఎక్స్-షోరూమ్ ధర రూ.6.26 లక్షల నుంచి రూ.9.31 లక్షల వరకు ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే కార్లలో ఒకటిగా మారింది. ఇది LXi, VXi, ZXi, ZXi+ వేరియంట్లలో అందుబాటులో ఉంది. కొత్త తరం డిజైర్‌లో మారుతి సుజుకి తన తాజా Z12E 1.2-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను అందించింది. ఈ పవర్‌ట్రెయిన్ గరిష్టంగా 82 bhp పవర్, 112 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఇది సీఎన్‌జీలో కూడా కొనుగోలు చేయడానికి లభిస్తుంది. NG మోడ్‌లో పవర్ కొంత తగ్గినప్పటికీ, కిలోగ్రాముకు 33.73 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదు. అదే పెట్రోల్ వేరియంట్ లీటరు పెట్రోల్‌కు 25.71 కిలోమీటర్ల వరకు మైలేజీ అందిస్తుందని మారుతి సుజుకి పేర్కొంటోంది. ఇంటీరియర్‌లో 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి ఆధునిక టెక్నాలజీలు ఉన్నాయి.
కనెక్టెడ్ కార్ ఫీచర్ల ద్వారా వాహనానికి సంబంధించిన అనేక వివరాలను స్మార్ట్‌ఫోన్ ద్వారానే తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్లు, వెనుక సెంటర్ ఆర్మ్‌రెస్ట్, 360-డిగ్రీ కెమెరా వంటి సౌకర్యాలు ఈ సెడాన్‌కు మరింత ప్రీమియం ఫీల్‌ను తీసుకొచ్చాయి. భద్రత విషయంలో కూడా డిజైర్ ఇప్పుడు మారుతి సుజుకి లైనప్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన తొలి మారుతి సుజుకి సెడాన్‌గా ఇది చరిత్ర సృష్టించింది. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందించడం ద్వారా కంపెనీ ప్రయాణికుల భద్రతకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చూపించింది. దీనికి తోడు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్ వంటి కీలక భద్రతా ఫీచర్లు కూడా ప్రతి వేరియంట్‌లో అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications