రూ.6.25 లక్షల కారే ఇప్పుడు దేశం మొత్తానికి ఫేవరెట్.. ఎర్టిగా, వాగన్‌ఆర్‌లు కూడా దీని తర్వాతే

భారతీయ కార్ల మార్కెట్లో మరోసారి మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. రూ.6.25 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న డిజైర్ సెడాన్(Maruti Dzire) ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది. ఒకప్పుడు వాగన్‌ఆర్, స్విఫ్ట్, బలెనో వంటి కార్లు టాప్‌లో ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మైలేజీ, భద్రత, కుటుంబ వినియోగం అన్నీ ఒకే కారులో కావాలనుకునే ప్రజలు డిజైర్(Maruti Dzire) వైపు పరుగులు తీస్తున్నారు.

ఏప్రిల్ 2026 అమ్మకాల గణాంకాలు చూస్తే మారుతి డిజైర్ మార్కెట్లో ఎలా దూసుకుపోతోందో స్పష్టంగా తెలుస్తోంది. గత నెలలో ఈ కారు ఏకంగా 23,580 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో అమ్ముడైన కార్లతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. దాదాపు 39 శాతం వృద్ధి నమోదు చేసింది.

maruti suzuki dzire sales record april 2026 updates telugu

ఏడు సీట్ల ఎర్టిగా కూడా డిజైర్‌ను అందుకోలేకపోయింది. ఎర్టిగా 19 వేల యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఫ్రాంక్స్, వాగన్‌ఆర్, బలెనో, స్విఫ్ట్ వంటి కార్లు కూడా డిజైర్ క్రేజ్ ముందు తలవంచాల్సి వచ్చింది.

డిజైర్ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది దాని మైలేజీ. సీఎన్‌జీ వెర్షన్‌లో ఈ కారు దాదాపు 33 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తోంది. పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరుగుతున్న ఈ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయాలనుకునే వారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

maruti suzuki dzire sales record april 2026 updates telugu

అదే సమయంలో నగరాల్లో ఉద్యోగాలకు వెళ్లేవారు, చిన్న కుటుంబాలు, టాక్సీ డ్రైవర్లు కూడా ఇప్పుడు డిజైర్‌నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు కూడా దీనికి అదనపు బలం. ముందు చిన్న కార్లంటే భద్రత తక్కువ అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు డిజైర్ ఆ ఆలోచననే మార్చేసింది.

ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, బలమైన బాడీ నిర్మాణం, ఆధునిక భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. అంతేకాదు, ఐదు స్టార్ భద్రతా రేటింగ్ కూడా సాధించడం దీనికి పెద్ద ప్లస్ అయింది. కుటుంబంతో ప్రయాణించే వారికి భద్రత చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు చాలా మంది పెద్ద ఎస్‌యూవీల కంటే డిజైర్ వంటి సెడాన్ కార్లను ఎంచుకుంటున్నారు.

maruti suzuki dzire sales record april 2026 updates telugu

డిజైర్ తర్వాత 7-సీటర్ విభాగంలో ఎర్టిగా (Ertiga) తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఏప్రిల్‌లో 19,063 ఎర్టిగా యూనిట్లు విక్రయించబడ్డాయి, ఇది గతేడాది కంటే 20.8 శాతం ఎక్కువ. ఆ తర్వాత వరుసలో ఫ్రాంక్స్ (Fronx) 18,829 యూనిట్లతో మూడవ స్థానంలో నిలిచింది.

ఫ్రాంక్స్ ఏకంగా 31.26 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. వ్యాగన్ ఆర్ 18,648 యూనిట్లు, బలెనో 18,306 యూనిట్లు, స్విఫ్ట్ 17,829 యూనిట్ల అమ్మకాలతో వరుస స్థానాల్లో నిలిచాయి. ఇవన్నీ కూడా 20 శాతానికి పైగా వార్షిక వృద్ధిని సాధించడం విశేషం.

ఈ అమ్మకాల గణాంకాల్లో అందరినీ ఆశ్చర్యపరిచింది ఆల్టో కె10 (Alto K10). గతేడాది కేవలం 5,606 యూనిట్లు అమ్ముడైన ఈ మోడల్, ఇప్పుడు ఏకంగా 10,856 యూనిట్లు అమ్ముడై 93.65 శాతం వృద్ధిని చూసింది. మరోవైపు, ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న బ్రెజ్జా (Brezza) అమ్మకాలు మాత్రం 16.78 శాతం మేర పడిపోయాయి.

విక్టోరిస్ 13,701 యూనిట్లు, ఈకో 13,087 యూనిట్లతో మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. గ్రాండ్ విటారా, ఎస్-ప్రెస్సో కూడా తమ వంతు వాటాను అందించాయి. మొత్తం మీద మారుతి సుజుకి తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.

Article Published On: Friday, May 15, 2026, 16:15 [IST]
English summary
Maruti suzuki dzire sales record april 2026 updates telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+