జనాల దృష్టి అంతా ఈ కొత్త కారుపైనే.. చూసినవాళ్లంతా ఓకే అంటున్నారు! తొలి నెలలో 2,205 యూనిట్లు

భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన మారుతి సుజుకి (Maruti Suzuki), ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే పరిశ్రమలో ఒక కొత్త చర్చకు దారి తీసింది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వాహనాలతో మార్కెట్‌ను ఏలిన ఈ సంస్థ, ఇప్పుడు భవిష్యత్తు మొబిలిటీ వైపు తన దృష్టిని మళ్లిస్తూ, ఎలక్ట్రిక్ వాహనాల యుగంలోకి ప్రవేశించింది. ఈ మార్పుకు ప్రతీకగా నిలిచింది సంస్థ తీసుకొచ్చిన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మారుతి సుజుకి ఇ-విటారా (Maruti Suzuki e Vitara). ఎంతోకాలంగా వినియోగదారులు ఎదురుచూస్తున్న ఈ మోడల్, మొదట గత సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో ప్రపంచానికి పరిచయం చేయబడింది. అప్పుడే దీని డిజైన్, టెక్నాలజీ, ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ ఆటోప్రియులను ఆకట్టుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశించిన కొద్ది నెలల తర్వాత, 2026 ఫిబ్రవరిలో ఇది భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ కావడం, మారుతి సుజుకి ఎలక్ట్రిక్ ప్లాన్‌కు ఒక కీలకమైన అడుగుగా నిలిచింది. లాంచ్ అనంతరం డెలివరీలు ప్రారంభమైన వెంటనే ఈ ఎస్‌యూవీపై వినియోగదారుల స్పందన ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. దానికి సమాధానంగా, మార్చి 2026 అంటే అమ్మకాలు ప్రారంభమైన మొదటి నెలలోనే ఇ-విటారా 2,205 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం.

Maruti Suzuki E Vitara Records 2205 Sales Initial Month More Details Inside

ఇది ఒక కొత్త ఎలక్ట్రిక్ మోడల్‌కు వచ్చిన ప్రారంభ స్పందనగా చూస్తే, మంచి స్థాయిలో ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో పోటీ పెరుగుతున్న సమయంలో, మారుతి వంటి పెద్ద బ్రాండ్ మొదటి ప్రయత్నంలోనే ఇలాంటి ఫలితాలు సాధించడం విశేషం. ఈ విజయానికి ప్రధాన కారణం, మారుతి సుజుకి బ్రాండ్‌పై ఉన్న నమ్మకం. దేశవ్యాప్తంగా విస్తరించిన డీలర్ నెట్‌వర్క్, సరసమైన నిర్వహణ ఖర్చులు.

ధరల విషయానికి వస్తే, మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ-విటారాను విభిన్న ధరలలో అందుబాటులోకి తీసుకువచ్చింది. బేస్ వేరియంట్ డెల్టా ధర రూ. 15.99 లక్షలుగా నిర్ణయించగా, మధ్యస్థ వేరియంట్ జీటా రూ. 17.49 లక్షలకు, టాప్ ఎండ్ ఆల్ఫా వేరియంట్ రూ. 20.01 లక్షలకు అందిస్తోంది. ధరలతో చూస్తే, ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో పోటీకి తగిన విధంగా మారుతి తన ప్రొడక్ట్‌ను ప్లేస్ చేసినట్టు తెలుస్తోంది.

Maruti Suzuki E Vitara Records 2205 Sales Initial Month More Details Inside

బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్(BaaS) ద్వారా డెల్టా వేరియంట్‌ను కేవలం రూ. 10.99 లక్షలకు, జీటా వేరియంట్‌ను రూ. 11.99 లక్షలకు, అలాగే టాప్ ఎండ్ ఆల్ఫా వేరియంట్‌ను రూ. 14.51 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. అయితే, దీనికి ప్రతిగా వినియోగదారులు ప్రతి కిలోమీటరుకు రూ. 3.99 చొప్పున బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్‌ను నెలవారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం, ప్రారంభంలో పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయలేని వినియోగదారులకు ఒక మంచి ఆప్షన్‌గా మారుతోంది.

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ SUV రెండు బ్యాటరీ ఆప్షన్‌లలో 49 kWh, 61 kWhలలో అందుబాటులో ఉంది. చిన్నదైన 49 kWh బ్యాటరీ ప్యాక్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 440 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఇక ఎక్కువ రేంజ్ కోరుకునే వారికి 61 kWh బ్యాటరీతో వచ్చే వేరియంట్ అందుబాటులో ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంటోంది.

Maruti Suzuki E Vitara Records 2205 Sales Initial Month More Details Inside

ఇ-విటారా డ్రైవింగ్‌ను సులభంగా, కంఫర్ట్‌గా చేసేందుకు నార్మల్, ఎకో, స్పోర్ట్స్ వంటి మూడు డ్రైవ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, డ్యూయల్-టోన్ డిజైన్‌తో పాటు సాఫ్ట్-టచ్ ఫినిషింగ్ మంచి ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.1 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 2-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ మొదలగునవి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, April 3, 2026, 14:51 [IST]
English summary
Maruti suzuki e vitara records 2205 sales initial month more details inside
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+