పేదల బడ్జెట్‌లోనే 6 సీటర్ కారు.. 26 కి.మీ మైలేజ్ కూడా ఇస్తోంది! 16 ఏళ్ల నుంచి క్రేజ్ తగ్గలేదు!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కొన్ని మోడళ్లు కాలంతో పాటు మారిపోతుంటే, మరికొన్ని మాత్రం సంవత్సరాలు గడిచినా తమ ప్రాధాన్యతను కోల్పోవు. అలాంటి అరుదైన మోడళ్లలో మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) ఒకటి. 2010లో మార్కెట్లోకి వచ్చిన ఈ వాహనం, దాదాపు 16 సంవత్సరాలు గడిచినా ఇంకా వినియోగదారుల ఆదరణను అదే స్థాయిలో కొనసాగించడమే దీని ప్రత్యేకత. ప్రతి నెలా స్థిరంగా అమ్ముడవుతూ వస్తున్న ఈ మోడల్, 2026 ఏప్రిల్ నెలలో కూడా తన దూకుడును కొనసాగించింది. ఆ నెలలో మొత్తం 13,087 యూనిట్లు విక్రయించబడగా, గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 11,438 యూనిట్లతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల కనిపించింది.

అంటే కేవలం ఒక సంవత్సరంలోనే 1,649 యూనిట్ల అదనపు అమ్మకాలను నమోదు చేయడం, ఈ వాహనానికి ఉన్న డిమాండ్ ఇంకా తగ్గలేదని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ విజయానికి వెనుక ఉన్న ముఖ్య కారణాల్లో ఒకటి, దీన్ని వినియోగదారులు ఒక ప్రాక్టికల్, నమ్మదగిన ఎంపికగా భావించడం. ముఖ్యంగా పాతకాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఓమ్నీకి ఇది సరైన ప్రత్యామ్నాయంగా నిలిచింది. దానికి కొనసాగింపుగా ఈకో బాగా డిమాండ్ పొందడంలో సక్సెస్ అయింది.

Maruti Suzuki Eeco Continues Strong Run In April 2026 Sales 13087 Units

కుటుంబ అవసరాలు, చిన్న వ్యాపారాల అవసరాలు, ట్రాన్స్‌పోర్ట్ వంటి ఉపయోగాల కోసం ఈకోను ఎంచుకోవడం కనిపిస్తోంది. తక్కువ ధర, మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గడం, సరిపడే స్పేస్ కలిసి దీన్ని ఒక ఆల్‌రౌండ్ యూజ్ వాహనంగా నిలబెట్టాయి. గ్రామీణ ప్రాంతాల నుండి నగరాల వరకు విస్తృతంగా ఉపయోగపడే విధంగా ఉండటం కూడా వాహనానికి పెద్ద ప్లస్ పాయింట్. ఏ పని అయినా సులభంగా చేసుకునేలా ఉండే ఈ మోడల్ సెట్ అవుద్ది.

భారతీయ మార్కెట్లో Maruti Suzuki Eeco అందుబాటు ధరలతోనే వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వాహనం ప్రారంభ ధర కేవలం రూ. 5.21 లక్షలతో మొదలవుతుంది. అంతేకాదు, టాప్ వేరియంట్ కూడా రూ. 6.36 లక్షల వరకు మాత్రమే ఉండటం వల్ల, కొంచెం ఆదాయం ఎక్కువ గల పేదలు, మధ్యతరగతి ప్రజల వారి అవసరాలకు కొనుగోలు చేయచ్చు. ఈ ధరలు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఎక్స్-షోరూమ్ ధరలేనని గమనించాలి.

Maruti Suzuki Eeco Continues Strong Run In April 2026 Sales 13087 Units

ఇది కేవలం ప్యాసింజర్ వాహనంగా మాత్రమే కాకుండా, ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా అంబులెన్స్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెండు వేరియంట్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 6.37 లక్షలు మరియు రూ. 8.02 లక్షలుగా ఉండటం, ఈ వాహనం విభిన్న వినియోగాలకు ఎంతగా సరిపోతుందో చూపిస్తుంది.

సీటింగ్ పరంగా కూడా ఈకో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎంపికలు అందిస్తోంది. రెగ్యులర్ వేరియంట్లు 5-సీటర్, 6-సీటర్ ఆప్షన్‌లలో లభించడం వల్ల, చిన్న కుటుంబాల నుండి చిన్న వ్యాపారాల వరకు విభిన్న వర్గాల వారు దీన్ని సులభంగా ఎంచుకోగలుగుతున్నారు. పనితీరు విషయానికి వస్తే, మారుతి ఈకో సింపుల్ కానీ ఉపయోగకరమైన పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది.

Maruti Suzuki Eeco Continues Strong Run In April 2026 Sales 13087 Units

ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉండగా, ఇది సుమారు 80 bhp పవర్, 104.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్‌ను హై-పర్ఫార్మెన్స్ కోసం కాకుండా, డైలీ యూజ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ట్యూన్ చేశారు. ఇక తక్కువ ఖర్చుతో ప్రయాణం కోరుకునే వారి కోసం CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉండటం ఈకోకు మరో ప్లస్ పాయింట్.

పెట్రోల్ ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, CNG వేరియంట్ వినియోగదారులకు గణనీయమైన సేవింగ్స్ అందించే అవకాశం ఉంది. పెట్రోల్ వేరియంట్ సుమారు 19.7 కి.మీ/లీ ఇంధన సామర్థ్యాన్ని ఇస్తుండగా, CNG వేరియంట్ మరింత ఎకానమిక్‌గా 26.8 కి.మీ/కేజీ వరకు మైలేజ్ అందిస్తుంది. అంటే, దీర్ఘకాలికంగా వాహనం వినియోగించే సమయంలో ఇంధన ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

Article Published On: Tuesday, May 5, 2026, 16:33 [IST]
English summary
Maruti suzuki eeco continues strong run in april 2026 sales 13087 units
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+