దేశంలోనే ఛీపెస్ట్ 7 సీటర్ కారు.. మైలేజ్ ఏకంగా 27కిమీ.. ఒక్క నెలలో 13 వేల మంది కొనేశారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో వ్యాన్ (Van) సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) తిరుగులేని రారాజుగా దూసుకుపోతోంది. సామాన్యుడి బడ్జెట్‌కు సరిపోయేలా, ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉండే ఈ కారు.. అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ముగిసిన మే 2026 నెలలో ఈకో వ్యాన్ ఏకంగా 13,240 యూనిట్ల అమ్మకాలతో దుమ్మురేపింది. దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ కారుగా పేరొందిన మారుతి ఈకో ఫీచర్లు, మైలేజ్, ధరల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అమ్మకాల్లో సరికొత్త రికార్డు
మారుతి సుజుకి ఈకో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 10 లక్షల (1 మిలియన్) కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడైన ఏకైక వ్యాన్‌గా రికార్డు సృష్టించింది. మే 2026 లో ఈ కారు 13,240 యూనిట్లు అమ్ముడవ్వగా.. గతేడాది మే 2025 లో ఈ సంఖ్య 12,327 యూనిట్లుగా ఉండేది. అంటే ఏడాది కాలంలో ఈకో అమ్మకాలు మరింత పుంజుకున్నాయి.

Maruti Suzuki Eeco Dominates Van Segment with 13 240 Units Sold in May 2026

మార్కెట్లో తిరుగులేని 90 శాతం వాటా
వ్యాన్ సెగ్మెంట్‌లో మారుతి ఈకో పాపులారిటీ ఎంతలా ఉందంటే.. ఈ కేటగిరీలో దాదాపు 90 శాతం మార్కెట్ వాటా కేవలం ఈ ఒక్క కారు సొంతమే. జనవరి 2025 నాటికి ఈ కారు ఏకంగా 12 లక్షల మైలురాయిని దాటేసింది. ఒక్క 2025 సంవత్సరంలోనే సుమారు 1.45 లక్షల ఈకో కార్లు అమ్ముడయ్యాయి. ఇక 2026 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలోనే దాదాపు 50,000 యూనిట్లు విక్రయించబడ్డాయి. మొత్తంగా ఇప్పటివరకు ఈకో కారుకు సంబంధించి దాదాపు 14 లక్షల యూనిట్ల సేల్స్ జరిగాయి.

సింపుల్ అండ్ బాక్సీ స్టైల్ లుక్
డిజైన్ పరంగా చూస్తే మారుతి ఈకో చాలా సింపుల్ అండ్ బాక్సీ లుక్‌ను కలిగి ఉంటుంది. పెద్ద సైడ్ గ్లాసులు, స్లైడింగ్ డోర్లు, హై-రూఫ్ (ఎక్కువ ఎత్తు) వంటి ఫీచర్లు దీని సొంతం. దీనివల్ల ఈ కారు రోజువారీ ప్రయాణాలకు మాత్రమే కాకుండా, లోడింగ్ అవసరాలకు, వ్యాపారాల కోసం వాడుకోవడానికి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. దీని క్యాబిన్ లోపల ఎక్కువ సీటింగ్ స్పేస్, లగేజ్ పెట్టుకోవడానికి కార్గో కెపాసిటీపై కంపెనీ ఎక్కువ ఫోకస్ పెట్టింది.

Maruti Suzuki Eeco Dominates Van Segment with 13 240 Units Sold in May 2026

6-ఎయిర్‌బ్యాగ్‌లతో సూపర్ సేఫ్టీ
తక్కువ ధర కారు అయినప్పటికీ సేఫ్టీ విషయంలో మారుతి ఎక్కడా రాజీ పడలేదు. ఈ కొత్త ఈకో మోడల్‌లో ప్రమాదాల నుంచి రక్షణ కల్పించేందుకు స్టాండర్డ్‌గా 6-ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. వీటితో పాటు డ్రైవింగ్‌ను సులభం చేసే పవర్ స్టీరింగ్, ఏసీ విత్ హీటర్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఇంజన్ ఇమ్మొబిలైజర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సీట్‌బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి బేసిక్ కానీ చాలా ముఖ్యమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

లీటరుకు 27 కిలోమీటర్ల మైలేజ్
మారుతి ఈకోలో 1.2 లీటర్ పవర్‌ఫుల్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 80bhp పవర్‌ను, 104.4Nm టాస్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ (CNG) వేరియంట్‌లో కూడా లభిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే.. పెట్రోల్ వేరియంట్ లీటరుకు సుమారు 19.7 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, సీఎన్‌జీ వేరియంట్ మాత్రం కేజీకి ఏకంగా 26.8 కిలోమీటర్ల (దాదాపు 27 కిమీ) మైండ్ బ్లోయింగ్ మైలేజ్‌ను అందిస్తుంది.

Maruti Suzuki Eeco Dominates Van Segment with 13 240 Units Sold in May 2026

ఈకో వ్యాన్ ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి ఈకో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 5.20 లక్షల నుంచి మొదలవుతుంది. దీని టాప్ వేరియంట్ ధర రూ. 6.36 లక్షల వరకు ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మంది ప్రయాణించేందుకు, మైలేజ్ పరంగా జేబుకు చిల్లు పడకుండా చూసుకోవడానికి మధ్యతరగతి ప్రజలకు ఇదొక బెస్ట్ ఆప్షన్.

Article Published On: Monday, June 1, 2026, 17:57 [IST]
English summary
Maruti suzuki eeco dominates van segment with 13 240 units sold in may 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+