7 సీటర్ కార్లలో దేశంలోనే బెస్ట్.. అతి తక్కువలో పెద్ద ఫ్యామిలీలకు మంచి ఛాయిస్, 26.11 కిమీ మైలేజీ!
మారుతి సుజుకి ఎర్టిగా (maruti suzuki ertiga) భారత మార్కెట్‌లో ఒక నమ్మకమైన కుటుంబ MPVగా ఇంటి పేరుగా నిలిచింది. సంవత్సరాలు గడిచినా ఈ కారుపై వినియోగదారుల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. రోజురోజుకూ డిమాండ్ పెరుగుతూనే ఉండగా, అమ్మకాల పరంగా కూడా ఎర్టిగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. గత నెల డిసెంబర్ 2025లో మాత్రమే ఈ MPVను 16,300 యూనిట్ల వరకు కొనుగోలుదారులకు విజయవంతంగా డెలివరీ చేయడం జరిగింది. ఇది ఎర్టిగాపై ఉన్న క్రేజ్‌కు స్పష్టమైన నిదర్శనం. ఇంతకుముందు నెలల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే కూడా ఎర్టిగా ఎంత స్థిరంగా మార్కెట్‌లో ముందుకు సాగుతోందో అర్థమవుతుంది. నవంబర్ 2025లో 16,197 యూనిట్లు, అక్టోబర్‌లో 20,087 యూనిట్లు, సెప్టెంబర్‌లో 12,115 యూనిట్లు, అలాగే ఆగస్టులో 18,445 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఈ ఐదు నెలల డేటాను సగటు లెక్కన చూసుకుంటే, ప్రతి నెలా సుమారు 16,628 యూనిట్ల ఎర్టిగా MPVలు దేశవ్యాప్తంగా అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఎర్టిగా అమ్మకాలు ఇంతగా పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వచ్చిన GST సవరణ. ఈ మార్పు కారణంగా ఎర్టిగా ధరలో కొంత తగ్గుదల కనిపించడంతో, కొత్త కారు కొనాలనుకున్న మధ్యతరగతి కుటుంబాలకు ఇది మరింత ఆకర్షణీయంగా మారింది.

తక్కువ ధరలో ఎక్కువ విలువ లభిస్తున్న భావన వినియోగదారుల్లో బలంగా ఏర్పడింది. అదే సమయంలో, ఎర్టిగా ఒక పూర్తి స్థాయి MPV కావడం, అలాగే విస్తృత సీటింగ్ ఎంపికలు ఉండటం కూడా దీనికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. పెద్ద కుటుంబాలు, లాంగ్ ట్రిప్స్ చేసే వారు, రోజువారీ అవసరాలకు ఒకే వాహనం కావాలనుకునే వారు - అందరి అవసరాలకు సరిపడేలా ఈ కారు రూపొందించబడింది.
విస్తృత క్యాబిన్ స్పేస్, సౌకర్యవంతమైన సీట్లు, నమ్మకమైన ఇంజిన్ పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు కలిసి ఎర్టిగాను కుటుంబాల ఫస్ట్ చాయిస్‌గా మార్చాయి. ఎర్టిగా భారత మార్కెట్‌లో సరసమైన ధరకు లభించే అత్యంత ప్రాక్టికల్ 7-సీటర్ కార్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ MPV ధర రూ. 8.80 లక్షల నుంచి రూ. 12.94 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉండటంతో, మధ్యతరగతి, వాణిజ్య వినియోగదారులకు కూడా ఇది సులభంగా అందుబాటులోకి వస్తోంది.

వ్యక్తిగత ఫ్యామిలీ కారు కావాలన్నా, టాక్సీ లేదా ఇతర కమర్షియల్ అవసరాల కోసం కావాలన్నా రెండు రకాల వినియోగానికి సరిపడేలా ఎర్టిగాను డిజైన్ చేశారు. వేరియంట్ల విషయానికి వస్తే, ఈ కారు LXi, VXi, ZXi, ZXi ప్లస్ అనే విభిన్న ఆప్షన్లలో లభిస్తుంది. అవసరాన్ని బట్టి బేసిక్ మోడల్ నుంచి ఫుల్ ఫీచర్లతో కూడిన టాప్ వేరియంట్ వరకు ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులకు లభిస్తుంది.
ముఖ్యంగా 7 సీట్ల లేఅవుట్ ఉండటంతో, పెద్ద కుటుంబాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కలిసి ప్రయాణించగలుగుతారు. సీటింగ్ కంఫర్ట్, లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ సరిపడా ఉండటంతో, దూర ప్రయాణాల్లో హాయిగా కూర్చుని ప్రయాణించవచ్చు. పనితీరు పరంగా ఎర్టిగా తన ధరకు తగ్గట్టుగానే శక్తివంతమైన, నమ్మకమైన పవర్‌ట్రెయిన్‌ను అందిస్తుంది. ఇందులో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 102 bhp హార్స్‌పవర్‌తో పాటు 139 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అదే సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం కోరుకునే వారి కోసం 1.5-లీటర్ CNG ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 87 bhp హార్స్‌పవర్, 121 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, మంచి మైలేజీతో జేబుకు తక్కువ భారం పడేలా చేస్తుంది. ఈ MPV లీటరుకు సుమారు 20.30 నుంచి 26.11 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదు.


Click it and Unblock the Notifications








