దేశంలో అందరూ కొంటున్న బెస్ట్ 7 సీటర్ కారు ఇదే.. ఒక్కసారి కొంటే కొన్నేళ్లు వాడొచ్చు!
భారతదేశంలో 7-సీటర్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కుటుంబ అవసరాలకు పూర్తిగా సరిపోయేలా రూపొందించిన ఈ MPV, అందుబాటు ధర, విశాలమైన అంతర్గత స్థలం, మంచి మైలేజ్ వంటి ముఖ్యమైన అంశాలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. పెద్ద కుటుంబాలకు సరిపోయే సౌకర్యవంతమైన సీటింగ్, లాంగ్ డ్రైవ్స్‌లో కూడా కంఫర్ట్‌ను అందించే సస్పెన్షన్, అలాగే తక్కువ నిర్వహణ ఖర్చులు కలిపి ఎర్టిగాను చాలా మంది ఫ్యామిలీల మొదటి ఎంపికగా మార్చాయి. నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ సమానంగా డిమాండ్ ఉండటం దీని విజయానికి ప్రధాన కారణం. తాజాగా ఈ కారుకు సంబంధించిన అమ్మకాలు విడుదలయ్యాయి. ఆ వివరాలు ఈ కథణంలో చూద్దాం.
భారతదేశంలో 7-సీటర్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఎర్టిగా అగ్రస్థానాన్ని బలంగా కాపాడుకుంటూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రతి నెలా ఈ సెగ్మెంట్‌లో టాప్‌లో నిలుస్తూ వస్తున్న ఈ కారు, FY26లో కూడా అదే జోరును కొనసాగించింది. ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 గల కాలంలో ఎర్టిగా మొత్తం 1,98,855 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం విశేషం. అంటే 2 లక్షల మార్క్‌కు కేవలం 1,145 యూనిట్ల దూరంలో నిలిచింది.

ఈ గణాంకాలు చూస్తే, ఈ కారుకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్ ఎంత బలంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్యామిలీ యూజ్‌కు సరిపోయే విశాలమైన సీటింగ్, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు వంటివి కలిసి ఎర్టిగాను వినియోగదారుల ఫేవరెట్‌గా మార్చాయి. ముఖ్యంగా పెద్ద కుటుంబాలకు నమ్మకమైన ఎంపికగా మారింది. పోటీ ఎంత పెరిగినా, తన స్థానం మాత్రం తగ్గకుండా, ప్రతి ఏడాది అగ్రస్థానాన్ని కాపాడుకోవడం ఈ కారుకు ఉన్న ప్రత్యేకత.
ఇదిలా ఉంటే, దేశంలో విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎర్టిగా 14 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడవడం, ఈ కార్ విజయాన్ని అంచనా వేయడానికి పెద్ద నిదర్శనంగా నిలుస్తోంది. సంవత్సరాలుగా వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకుంటూ వచ్చిన ఎర్టిగా, ఫ్యామిలీ కార్‌గా తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరుచుకుంది. ధర విషయానికి వస్తే, ఈ MPV రూ. 8.80 లక్షల నుంచి రూ. 12.94 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.

ఇంజిన్ పరంగా చూస్తే, ఎర్టిగాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇవ్వబడింది. ఇది 103 PS పవర్, 137 Nm టార్క్ ఉత్పత్తి చేస్తూ, సిటీ డ్రైవింగ్‌కైనా, హైవే ప్రయాణాలకైనా సరిపోయే సమతౌల్య పనితీరును అందిస్తుంది. అదనంగా, CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉండటం వల్ల, ఇంధన ఖర్చులను తగ్గించాలనుకునే వారికి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
మైలేజ్ విషయంలో కూడా ఎర్టిగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. పెట్రోల్ వేరియంట్ సుమారు 20.51 kmpl మైలేజీ ఇవ్వగా, CNG వేరియంట్ 26.11 km/kg వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో, ఈ స్థాయి మైలేజ్ వినియోగదారులకు గణనీయమైన ఆదా కలిగిస్తుంది. ఏడు సీట్లు కలిగిన ఈ వాహనంలో ఒకేసారి ఎక్కువ మంది కలిసి ప్రయాణించవచ్చు.

ఎర్టిగాలోలో ఇప్పుడు పాత 7-అంగుళాల స్క్రీన్‌కు బదులుగా పెద్ద 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఇందులో సుజుకి స్మార్ట్‌ప్లే ప్రో టెక్నాలజీ ఉండటం వల్ల వాయిస్ కమాండ్స్‌తో పాటు కనెక్టెడ్ కార్ ఫీచర్లు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ కనెక్టెడ్ ఫీచర్లలో వెహికల్ ట్రాకింగ్, టో-అవే అలర్ట్‌లు, జియో-ఫెన్సింగ్, ఓవర్ స్పీడ్ అలర్ట్‌లు, అలాగే కొన్ని ఫంక్షన్లు రిమోట్‌గా కంట్రోల్ చేసే అవకాశం ఉన్నాయి.


Click it and Unblock the Notifications








