7 సీటర్ కార్లలో ఇండియాలో బెస్ట్‌ ఇదే.. తక్కువలో పెద్ద ఫ్యామిలీలకు మంచి ఛాయిస్, 26.11 కిమీ మైలేజీ!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కుటుంబ అవసరాలకు సరిపోయే 7-సీటర్ కార్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటి విభాగంలో ఎన్నో ఏళ్లుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మోడల్ Maruti Suzuki Ertiga (మారుతి సుజుకి ఎర్టిగా). తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణికులకు సౌకర్యం, మంచి మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం వంటి కారణాలతో ఈ MPV దేశవ్యాప్తంగా కుటుంబాల మొదటి ఎంపికగా నిలుస్తోంది. తాజాగా విడుదలైన ఏప్రిల్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని మరోసారి నిరూపించాయి. మారుతి సుజుకి ఎర్టిగా అమ్మకాలు ఈసారి గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.

గత ఏడాది ఏప్రిల్ 2025లో 15,780 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి ఏప్రిల్ 2026లో అమ్మకాలు భారీగా పెరిగి 19,063 యూనిట్లకు చేరుకున్నాయి. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే 3,283 కార్లు అదనంగా విక్రయమయ్యాయి. శాతం పరంగా చూస్తే ఇది 20.80 శాతం వృద్ధి కావడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో SUVల హవా కొనసాగుతున్నప్పటికీ, ఎర్టిగా లాంటి MPVకి ఇంతటి స్థాయిలో డిమాండ్ రావడం సాధారణ విషయం కాదు.

Maruti Suzuki Ertiga Sales Boom In April 2026 With 19063 Units Details

ఈ సక్సెస్‌కు ప్రధాన కారణం ఎర్టిగా అందించే ప్రాక్టికాలిటీ అని చెప్పాలి. పెద్ద కుటుంబాలకు సరిపడే విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన సీట్లు, దూర ప్రయాణాల్లో అలసట రానీయని డ్రైవింగ్ అనుభవం వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా మారుతి సుజుకి అందించే విశ్వసనీయత, దేశవ్యాప్తంగా విస్తరించిన సర్వీస్ నెట్‌వర్క్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా కొనుగోలుదారులను ఎర్టిగా వైపు మళ్లిస్తున్నాయి. దీన్ని బట్టి ఎర్టిగా మధ్యతరగతి కుటుంబాల ఫేవరెట్ 7-సీటర్‌గా కొనసాగుతోందని స్పష్టమవుతోంది

ఈ అమ్మకాలతో ఏప్రిల్ 2026లో దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో ఈ MPV 3వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ జాబితాలో మొదటి రెండు స్థానాలను మారుతి సుజుకి డిజైర్, టాటా పంచ్ ఆక్రమించగా, ఎర్టిగా మాత్రం కుటుంబాల ఫస్ట్ ఛాయిస్‌గా తన స్థిరమైన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం ఈ MPV ధర రూ. 8.80 లక్షల నుంచి రూ. 12.94 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంది.

Maruti Suzuki Ertiga Sales Boom In April 2026 With 19063 Units Details

ఎర్టిగా విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి దీని ఇంజిన్ పనితీరు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇవ్వబడింది. ఈ ఇంజిన్ 103 PS పవర్, 137 Nm టార్క్ ఉత్పత్తి చేస్తూ నగర రోడ్లపై స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందించడమే కాకుండా, హైవేలపై స్థిరమైన పనితీరును అందిస్తుంది. మరోవైపు CNG ఆప్షన్ కూడా ఉండటం వల్ల పెరుగుతున్న ఇంధన ధరల కాలంలో ఇది మరింత ప్రయోజనకరమైన ఎంపికగా మారింది.

మైలేజ్ విషయంలో కూడా ఎర్టిగా తన సెగ్మెంట్‌లో బలమైన పోటీని ఇస్తోంది. పెట్రోల్ వేరియంట్ సుమారు 20.51 kmpl మైలేజీ ఇవ్వగా, CNG వేరియంట్ 26.11 km/kg వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ఇంధన ఖర్చులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇంత మంచి మైలేజ్ వినియోగదారులకు గణనీయమైన ఆదాను అందిస్తోంది. ముఖ్యంగా ఎక్కువగా ప్రయాణించే కుటుంబాలు, క్యాబ్ ఆపరేటర్లు, కమర్షియల్ వినియోగదారులకు ఈ MPV మరింత అనుకూలంగా మారింది.

Maruti Suzuki Ertiga Sales Boom In April 2026 With 19063 Units Details

ఫీచర్ల పరంగా కూడా ఎర్టిగా ఇప్పుడు మరింత ఆధునికంగా మారింది. పాత 7-అంగుళాల స్క్రీన్ స్థానంలో ఇప్పుడు పెద్ద 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఇందులో సుజుకి స్మార్ట్‌ప్లే ప్రో టెక్నాలజీ ఇవ్వడం వల్ల వినియోగదారులు వాయిస్ కమాండ్స్‌తో పాటు అనేక కనెక్టెడ్ కార్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. వెహికల్ ట్రాకింగ్, టో-అవే అలర్ట్స్, జియో-ఫెన్సింగ్, ఓవర్ స్పీడ్ అలర్ట్స్ వంటి ఆధునిక సౌకర్యాలు ఇప్పుడు ఎర్టిగాలో అందుబాటులో ఉన్నాయి.

Article Published On: Friday, May 8, 2026, 9:12 [IST]
English summary
Maruti suzuki ertiga sales boom in april 2026 with 19063 units details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+