మారుతి తొలి ఎలక్ట్రిక్ కారుకు అదిరిపోయే రెస్పాన్స్.. వచ్చిన కొద్ది కాలంలోనే జనాలు ఇదే కావాలంటున్నారు!

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki), ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే మరో కీలక మైలురాయిని అందుకుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కంపెనీ తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ SUV ఇ-విటారా (e Vitara) మార్కెట్లోకి వచ్చిన తర్వాత అంచనాలకు మించి ఆదరణ పొందుతోంది. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఈ ఎలక్ట్రిక్ SUVకు మంచి స్పందన లభిస్తుండటంతో, మారుతి సుజుకి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణానికి ఇది బలమైన ఆరంభంగా మారింది. 2026 సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే భారతీయ మార్కెట్లో ఇ-విటారా మొత్తం 7,097 యూనిట్లు విక్రయించి కొత్త రికార్డు సృష్టించింది. తొలి ఎలక్ట్రిక్ మోడల్‌కే ఈ స్థాయి అమ్మకాలు నమోదు కావడం విశేషం.

ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, ఇ-విటారా తన ఆధునిక డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లు, విశ్వసనీయ బ్రాండ్ ఇమేజ్ కారణంగా కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. దేశీయ మార్కెట్‌లోనే కాకుండా విదేశీ మార్కెట్లలోనూ ఈ మోడల్‌కు మంచి డిమాండ్ కనిపిస్తుండటం విశేషం. దీంతో మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా బలమైన స్థానం సంపాదించే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Maruti Suzuki First Electric Car Sales Cross 7000 Units Details Inside

మారుతి సుజుకి ఇ-విటారా మార్కెట్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే అంచనాలకు మించిన స్పందనను అందుకుంటోంది. దేశీయ మార్కెట్లో డిమాండ్ వేగంగా పెరుగుతుండటంతో పాటు, విదేశీ మార్కెట్ల నుంచి కూడా భారీ స్థాయిలో ఆర్డర్లు రావడం కంపెనీకి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇ-విటారా విక్రయాలు నెలనెలా కొత్త రికార్డులను నమోదు చేస్తూ మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలుస్తోంది.

2026 మే నెలలో మాత్రమే మారుతి సుజుకి దేశవ్యాప్తంగా ఉన్న తన డీలర్‌షిప్‌లు, షోరూమ్‌లకు విక్రయాల కోసం మొత్తం 1,439 ఇ-విటారా యూనిట్లను పంపించింది. ఇది మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. జనవరి నుంచి మే వరకు కంపెనీ మొత్తం 8,79,879 ప్యాసింజర్ వాహనాలను విక్రయించగా, వాటిలో ఇ-విటారా వాటా 0.80 శాతంగా నమోదైంది. తొలి ఎలక్ట్రిక్ మోడల్‌కే ఈ స్థాయి వాటా రావడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Maruti Suzuki First Electric Car Sales Cross 7000 Units Details Inside

షోరూమ్‌ల నుంచి నేరుగా వినియోగదారులకు చేరే రిటైల్ అమ్మకాల పరంగా కూడా ఇ-విటారా బలమైన వృద్ధిని నమోదు చేసింది. జనవరి నెలలో కేవలం 224 యూనిట్లతో ప్రారంభమైన రిటైల్ విక్రయాలు, ప్రతి నెలా క్రమంగా పెరుగుతూ మే నెల నాటికి 1,658 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ గణాంకాలు వినియోగదారుల్లో ఇ-విటారాపై ఆసక్తి ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

ఇక అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ ఎలక్ట్రిక్ SUVకు విశేష ఆదరణ లభిస్తోంది. యూరప్‌తో పాటు పలు విదేశీ దేశాల నుంచి భారీ సంఖ్యలో ఆర్డర్లు వస్తుండటంతో, ప్రస్తుతం తయారవుతున్న ఇ-విటారా వాహనాల్లో గణనీయమైన భాగాన్ని ఎగుమతులకే కేటాయిస్తోంది. దీంతో దేశీయ మార్కెట్లో డెలివరీ కోసం కొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అవసరాలను తీర్చేందుకు ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి ఉత్పత్తిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Maruti Suzuki First Electric Car Sales Cross 7000 Units Details Inside

ప్రస్తుతం భారత మార్కెట్లో ఇ-విటారా మూడు వేరియంట్లలో లభిస్తుంది. వాటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 15.99 లక్షల నుండి రూ. 19.79 లక్షల వరకు ఉన్నాయి. దీనిలొ అమర్చిన 49 kWh బ్యాటరీ (డెల్టా వేరియంట్) ఒక్క ఛార్జ్‌తో 440 కి.మీ. రేంజ్‌ను అందిస్తుందని పేర్కొనబడింది. అలాగే, 61 kWh బ్యాటరీ (జెటా & ఆల్ఫా వేరియంట్లు సింగిల్ ఛార్జ్‌తో దాదాపుగా 543 కి.మీ రేంజ్‌ని అందిస్తుంది.

Article Published On: Friday, June 26, 2026, 12:38 [IST]
English summary
Maruti suzuki first electric car sales cross 7000 units details inside
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+