బైక్ లాగా మైలేజ్ ఇచ్చే కారు.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దీని వైపే చూస్తున్నారు! రూ. 6.85 లక్షలు
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వినియోగదారుల అభిరుచులు కూడా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా యువత ఇప్పుడు స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్, ఆధునిక టెక్నాలజీ కలిగిన కార్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ విభాగంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) ప్రస్తుతం ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ మార్కెట్లో దూసుకుపోతోంది. ప్రీమియం లుక్, SUV స్టైల్ డిజైన్, అద్భుతమైన ఫీచర్లు, మారుతి బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కలిసి ఈ కారును కొనుగోలుదారుల ఫస్ట్ ఛాయిస్‌గా మారుస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో కాంపాక్ట్ SUVలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ పోటీలో ఫ్రాంక్స్ తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడమే కాకుండా, అమ్మకాల పరంగా కూడా అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది.
ఏప్రిల్ 2026 నెలలో ఫ్రాంక్స్ మొత్తం 18,829 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి మరోసారి మార్కెట్లో తన బలాన్ని చాటుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఈ కారు 14,345 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది. ఈసారి వేల సంఖ్యలో అదనపు యూనిట్లు అమ్ముడవ్వడంతో దీనిపై ఆసక్తి ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టంగా తెలుస్తోంది. దీనిని పరిశీలిస్తే, ఫ్రాంక్స్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన దాదాపు 31 శాతం వృద్ధి.

ఇక మారుతి సుజుకి భవిష్యత్ ప్రణాళికలు కూడా ఫ్రాంక్స్ చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం పర్యావరణహిత వాహనాలపై ప్రపంచవ్యాప్తంగా దృష్టి పెరుగుతున్న నేపథ్యంలో, కంపెనీ త్వరలో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో కూడిన కొత్త కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ టెక్నాలజీని మొదటగా ఫ్రాంక్స్‌లోనే తీసుకురావాలని మారుతి భావిస్తున్నట్లు సమాచారం. ఇది నిజమైతే, ఫ్రాంక్స్ భారతదేశంలో మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది.
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు పెట్రోల్‌తో పాటు ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని కూడా ఉపయోగించగలగడం వల్ల భవిష్యత్తులో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన ఖర్చులను నియంత్రించడం వంటి ప్రయోజనాల కారణంగా ఈ టెక్నాలజీపై ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. అలాంటి టెక్నాలజీని ఫ్రాంక్స్‌లో అందిస్తే, ఇప్పటికే మంచి అమ్మకాలు సాధిస్తున్న ఈ కారు మార్కెట్లో మరింత బలమైన స్థానాన్ని సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం భారత మార్కెట్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధరలు రూ.6.85 లక్షల నుంచి రూ.11.98 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. బడ్జెట్‌కు అనుగుణంగా వినియోగదారులు ఎంపిక చేసుకునేలా ఈ కారు సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జీటా, ఆల్ఫా అనే ఐదు ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రతి వేరియంట్‌లోనూ మారుతి ఆధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, మంచి కంఫర్ట్‌ను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
ఇంజిన్ ఎంపికల విషయంలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 99 bhp పవర్, 148 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ డ్రైవింగ్ సమయంలో మంచి పికప్, పవర్‌ఫుల్ ఫీలింగ్‌ను అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది. అంతేకాదు, పవర్‌ఫుల్ పనితీరుతో పాటు 20.1 నుంచి 21.5 kmpl వరకు మంచి మైలేజీ ఇవ్వడం కూడా దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఇక రోజువారీ సిటీ డ్రైవింగ్‌కు అనువైన ఎంపికగా 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ 89 bhp పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వచ్చే ఈ ఇంజిన్ 21.79 నుంచి 22.89 kmpl వరకు ఆకట్టుకునే మైలేజీని అందిస్తుంది.
మారుతి ఫ్రాంక్స్‌లో 1.2 లీటర్ CNG వేరియంట్‌ను కూడా అందిస్తోంది. ఈ వేరియంట్ 76 bhp పవర్, 99 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ముఖ్యంగా మైలేజీ విషయంలో ఈ మోడల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. లీటర్‌కు 28.51 kmpl వరకు మైలేజీ అందిస్తుంది. ఇది ప్రధానంగా ప్రస్తుతం మార్కెట్లో కొన్ని ప్రీమియం బకులు ఇస్తున్న మైలేజ్‌తో సమానం.


Click it and Unblock the Notifications