మాస్టర్ ప్లాన్ వేసిన మారుతి.. 35 కిలోమీటర్ల మైలేజ్.. ఇక ప్రతి ఒక్కరూ ఈ ఫ్రాంక్స్ వైపే!
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న కార్లలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) ఒకటి. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ స్టైలిష్ డిజైన్, కాంపాక్ట్ సైజ్, అలాగే ఫీచర్ల పరంగా మంచి బ్యాలెన్స్ ఈ మూడు అంశాలు కలిపి ఈ కారును ప్రతి నెలా ఎక్కువగా అమ్ముడయ్యే మోడళ్లలో ఒకటిగా నిలబెట్టాయి. నగరాల్లో రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండటంతో పాటు, ఫ్యామిలీ యూజ్‌కు కూడా సరిపోయే విధంగా రూపొందించబడటం దీని ప్రధాన బలం. ముఖ్యంగా Maruti Suzuki బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కూడా ఫ్రాంక్స్ విజయానికి కారణమైంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, మంచి మైలేజ్, అలాగే రీసేల్ వ్యాల్యూ ఇవి వినియోగదారులను ఆకర్షించే అంశాలుగా నిలుస్తున్నాయి.
ఈ కారణాల వల్లే ఫ్రాంక్స్‌ను "వాల్యూ ఫర్ మనీ" కార్‌గా చాలామంది భావిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో మంచి స్థానం సంపాదించినప్పటికీ, కంపెనీ ఇక్కడే ఆగిపోవాలని భావించడం లేదు. పోటీ నేపథ్యంలో, దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చి అమ్మకాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఇప్పుడు ఫ్రాంక్స్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ అయిన తర్వాత, ఈ కారు మళ్లీ ఒకసారి మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారచ్చు.

ఈ కొత్త అప్‌డేటెడ్ మోడల్‌లో డిజైన్ పరంగా మరింత షార్ప్ లుక్, కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ లైటింగ్ సెటప్ వంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇంటీరియర్‌లో కూడా కొత్త ఫీచర్లు, మరింత అడ్వాన్స్ టెక్నాలజీ జోడించవచ్చని అంచనాలు ఉన్నాయి. వినియోగదారులకు మరింత ప్రీమియం ఫీల్ ఇవ్వడం, అలాగే యువతను ఆకర్షించడం ఈ అప్‌డేట్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
భారత మార్కెట్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్న మోడల్. ముఖ్యంగా దీని ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర కేవలం రూ. 6.85 లక్షలతో ప్రారంభమవడం వల్ల, బడ్జెట్‌లో స్టైలిష్ కార్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారింది. 2023 ఏప్రిల్‌లో లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారు పెద్దగా అప్‌డేట్లు లేకుండా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది.

పెరుగుతున్న పోటీ, అలాగే వినియోగదారుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని Maruti Suzuki ఈ కారును పూర్తిగా రిఫ్రెష్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈసారి ఫేస్‌లిఫ్ట్ రూపంలో కేవలం చిన్న మార్పులు కాకుండా, ఫీచర్ల పరంగా కూడా గణనీయమైన అప్‌గ్రేడ్స్ ఇవ్వాలని కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా సేఫ్టీ విషయంలో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. లెవెల్ 2 ADAS(అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ప్యాకేజీని ఇందులో జోడించవచ్చని టాక్ వినిపిస్తోంది.
ఇది వస్తే, ఈ సెగ్మెంట్‌లో ఫ్రాంక్స్‌కు ఒక పెద్ద అడ్వాంటేజ్ లభిస్తుంది. అదనంగా వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులోకి రావచ్చు. పర్ఫార్మెన్స్ విషయంలో ప్రస్తుతం ఉన్న 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లను ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్లు ఇప్పటికే మైలేజ్, పనితీరు పరంగా మంచి బ్యాలెన్స్‌ను అందిస్తున్నాయి కాబట్టి, వాటిని మార్చకపోవచ్చు.

ప్రస్తుత నివేదికల ప్రకారం, ఈ కారులో కొత్తగా 1.2-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ను అందించే అవకాశముంది. ఈ కొత్త హైబ్రిడ్ ఇంజన్‌తో ఫ్రాంక్స్ మైలేజ్ విషయంలో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం, లీటరుకు దాదాపు 35 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదని చెబుతున్నారు. ఇది నిజమైతే, ఈ సెగ్మెంట్‌లోనే కాదు, మొత్తం పెట్రోల్ కార్లలో అత్యుత్తమ మైలేజ్ ఇచ్చే మోడళ్లలో ఒకటిగా నిలవొచ్చు.


Click it and Unblock the Notifications