ఈ కారుతో ఊర్లోకి వెళ్తే వెంటనే దిష్టి తీసుకోండి.. రోడ్డుపై కనిపిస్తే లుక్‌తో అందరిని కట్టిపడేస్తుంది!
భారతదేశంలో మిడ్-సైజ్ SUV విభాగంలో పోటీ రోజురోజుకూ తీవ్రమవుతున్నప్పటికీ, మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ (Maruti Suzuki Grand Vitara SUV) తన మార్కెట్ బలాన్ని మరోసారి నిరూపించుకుంది. క్రెటా, సెల్టోస్, ఎలివేట్ వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ, గ్రాండ్ విటారా జూన్ 2026లో కూడా ఆకట్టుకునే అమ్మకాలతో మంచి ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ విడుదల చేసిన తాజా విక్రయ గణాంకాల ప్రకారం, జూన్ 2026లో గ్రాండ్ విటారా మొత్తం 9,092 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 6,828 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది దాదాపుగా 33 శాతం వార్షిక వృద్ధి.
కేవలం ఏడాది వ్యవధిలోనే రెండు వేలకుపైగా అదనపు యూనిట్లు అమ్ముడవడం ఈ SUVపై వినియోగదారుల నమ్మకం ఎంతగా పెరిగిందో తెలియజేస్తోంది. అయితే నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించింది. మే 2026లో 9,366 యూనిట్లు విక్రయించగా, జూన్‌లో ఆ సంఖ్య 9,092 యూనిట్లకు చేరింది. అంటే నెలవారీగా చూస్తే సుమారు 3 శాతం తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ ఈ తగ్గుదల పెద్దగా ఆందోళన కలిగించే స్థాయిలో కాకపోవడం గమనార్హం.

మొత్తం మీద వార్షికంగా నమోదైన బలమైన వృద్ధి గ్రాండ్ విటారా మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని స్పష్టం చేస్తోంది. హైబ్రిడ్ టెక్నాలజీ, మంచి మైలేజ్, ప్రీమియం ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, మారుతి సుజుకి అందిస్తున్న సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలు గ్రాండ్ విటారా అమ్మకాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ కారణంగానే మిడ్-సైజ్ SUV కొనుగోలుదారుల తొలి ఎంపికల్లో ఈ మోడల్ ఒకటిగా కొనసాగుతోంది.
గ్రాండ్ విటారా ప్రస్తుతం ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.77 లక్షల నుంచి రూ. 19.72 లక్షల వరకు ఉండగా, సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జీటా వంటి పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. డిజైన్ పరంగా గ్రాండ్ విటారా ఆధునిక స్టైలింగ్‌తో ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో స్లీక్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, వెనుక ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్స్, 17 అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

పనితీరు పరంగా గ్రాండ్ విటారా మూడు ఇంజన్లతో లభిస్తుంది. 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్, ఫ్యూయల్ ఖర్చు తక్కువా ఉండాలనుకునే వారు 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) వేరియంట్ అందుబాటులో ఉంది. ఇక సీఎన్‌జీ కావాలనుకునే వినియోగదారుల కోసం 1.5 లీటర్ సీఎన్‌జీ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. ఇది పెర్ఫామెన్స్ పరంగా 88 bhp పవర్, 121 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మైలేజ్ పరంగా కూడా గ్రాండ్ విటారా తన సెగ్మెంట్‌లో కీలక మోడళ్లలో ఒకటిగా నిలుస్తోంది. ఎంచుకునే పవర్‌ట్రెయిన్‌ను బట్టి 21.11 kmpl నుంచి గరిష్టంగా 27.97 kmpl వరకు మైలేజ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. మంచి మైలేజ్, హైబ్రిడ్ టెక్నాలజీ, అధునాతన ఫీచర్లు, నమ్మకమైన పనితీరు వంటి అంశాలతో గ్రాండ్ విటారా భారతీయ కుటుంబాలకు ఆకర్షణీయమైన మిడ్-సైజ్ SUVగా నిలుస్తోంది. ఈ కారులో 5 సీటింగ్ ఆప్షన్ ఉంటుంది.

ఫీచర్ల గురించి చూస్తే, డజన్ల కొద్ది దీనిలో ఉన్నయి. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ చేయడానికి వైర్‌లెస్ ఛార్జింగ్, , డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ప్రమాద సమయంలో ప్రయాణికుల సేఫ్టీ కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరాలు మొదలగునవి ఉన్నాయి.


Click it and Unblock the Notifications