అందరి ఇంటి పేరుగా మారిపోయిన కారు! బైక్‌తో పాటు సమానంగా 33 కి.మీ మైలేజ్.. ప్రతిరోజూ 574 అమ్మకాలు!
మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) భారత మార్కెట్లో ఎన్నేళ్లుగా ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన పనితీరు, మంచి మైలేజ్ వంటి అంశాలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అందుకే కాలం మారినా, కొత్త కార్లు వచ్చినా స్విఫ్ట్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ ఈ కారుకు డిమాండ్ పెరుగుతుండటం దీనికి స్పష్టమైన నిదర్శనం. వినియోగదారులు స్విఫ్ట్‌ను ఎంతో ఆనందంగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత, చిన్న కుటుంబాలు, అలాగే డైలీ కమ్యూట్ కోసం కారును ఉపయోగించే వారు ఈ హ్యాచ్‌బ్యాక్‌ను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. డ్రైవ్ చేయడానికి సులభం, నగర రోడ్లకు అనుకూలంగా ఉండటం, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం వంటి కారణాలు స్విఫ్ట్‌ను బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ఎప్పటికప్పుడు నిలబెడుతున్నాయి.
ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా స్విఫ్ట్ పాపులారిటీని మరోసారి నిరూపించాయి. జనవరి 2026 నెలలో స్విఫ్ట్ మొత్తం 17,806 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే ఒక్క నెలలోనే దాదాపు 18 వేల మంది ఈ కారును ఎంచుకున్నారు. ఈ సంఖ్య చూస్తేనే స్విఫ్ట్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ప్రత్యేకించి పోటీతో నిండిన హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఇలాంటి అమ్మకాల రికార్డు సాధించడం సాధారణ విషయం కాదు.

గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే మారుతి సుజుకి స్విఫ్ట్ అమ్మకాలు స్పష్టమైన వృద్ధిని నమోదు చేశాయి. 2025 జనవరి నెలలో స్విఫ్ట్ మొత్తం 17,081 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అయితే, 2026 జనవరిలో ఈ సంఖ్య 17,806 యూనిట్లకు చేరుకుంది. ఈ రెండు గణాంకాలను పోల్చి చూసినప్పుడు, స్విఫ్ట్ అమ్మకాల పరిమాణం సంవత్సరానికి 4.24 శాతం వృద్ధి సాధించినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ పెరుగుదల చిన్నదిగా అనిపించినా, పోటీతో నిండిన హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో బలమైన స్థానం ఉన్న మోడల్‌కు కూడా ఇలా స్థిరమైన వృద్ధి రావడం అంటే, వినియోగదారుల నమ్మకం ఇంకా కొనసాగుతుందన్న అర్థం. ఈ గణాంకాలను రోజువారీ స్థాయిలో చూసుకుంటే, ప్రతిరోజూ సగటున 574 స్విఫ్ట్ కార్లు అమ్ముడయ్యాయి. అంటే రోజుకు వందల సంఖ్యలో వినియోగదారులు స్విఫ్ట్‌ను కొత్త కారుగా ఎంచుకుంటున్నారు.

దీని ధర రూ. 5.79 లక్షల నుండి రూ. 8.80 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 5-సీట్ల సీటింగ్‌ను కలిగి ఉంది, ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ తన ధరకు తగినట్టుగా పనితీరు, మైలేజ్ ను అందించే రెండు శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది పెట్రోల్‌తో పాటు CNG వేరియంట్‌ను కూడా మారుతి అందించడం విశేషం.
ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ప్రధానంగా 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 82 bhp పవర్‌తో పాటు 112 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వినియోగదారుల కోసం 1.2 లీటర్ CNG ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇంజన్ 70 bhp పవర్, 102 Nm టార్క్‌ను అందిస్తూ, డైలీ యూజ్‌కు సరిపడే పనితీరును ఇస్తుంది.

వేరియంట్‌ను బట్టి కొత్త స్విఫ్ట్‌లో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లు లభిస్తాయి. దీంతో డ్రైవింగ్ సౌలభ్యాన్ని కోరుకునే వారు, అలాగే డ్రైవింగ్‌లో కంట్రోల్ ఇష్టపడే వారు ఇద్దరికీ సరైన ఎంపికలు ఉన్నాయి. మైలేజ్ విషయంలోనూ ఈ కారు ఆకట్టుకుంటుంది. ఇంధన రకం, వేరియంట్‌ను బట్టి లీటరుకు సుమారు 24 నుంచి 33 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించగలదని కంపెనీ పేర్కొంటోంది.


Click it and Unblock the Notifications








