దేశంలోనే అత్యధికంగా మైలేజ్ ఇచ్చే కారు.. రూ.5.79 లక్షలు, కుటుంబాలకు ఫస్ట్ ఛాయిస్ ఇదే!

భారతదేశంలో హ్యాచ్‌బ్యాక్ కార్ల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) ఒకటి. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత రోడ్లపై తనదైన ముద్ర వేసిన ఈ కారు, యువత నుంచి కుటుంబాల వరకు ప్రతి వర్గం వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, చురుకైన పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చులు, అద్భుతమైన మైలేజ్ కారణంగా స్విఫ్ట్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. మార్కెట్లోకి ఎన్నో కొత్త కార్లు వచ్చినా, SUVల హవా పెరిగినా, స్విఫ్ట్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రతి నెలా వేల సంఖ్యలో అమ్ముడవుతూ ఈ కారు తనకు ఉన్న డిమాండ్‌ను మరోసారి నిరూపిస్తూనే ఉంది. తాజా అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

2026 మే నెలలో మారుతి సుజుకి స్విఫ్ట్ మొత్తం 17,519 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 14,135 యూనిట్లు మాత్రమే. అంటే కేవలం ఒకే ఏడాదిలో స్విఫ్ట్ అమ్మకాలు 24 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. ప్రస్తుతం మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, ఈ స్థాయి వృద్ధిని సాధించడం స్విఫ్ట్‌కు ఉన్న ఆదరణకు నిదర్శనంగా చెప్పవచ్చు.

Maruti Suzuki Hatchback Swift May 2026 Sales Recorded 24 Percent Growth

ఒకవైపు స్పోర్టీ లుక్‌ను అందిస్తూనే, మరోవైపు కుటుంబ అవసరాలకు కూడా బాగా సరిపోతుంది. నగర రోడ్లపై సులభంగా డ్రైవ్ చేయగలగడం, ట్రాఫిక్‌లో చురుకుగా కదలగలగడం, అలాగే దేశంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో ఒకటిగా ఉండటం వల్ల ఇది అన్ని వర్గాల వినియోగదారులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా మారుతి సుజుకికి దేశవ్యాప్తంగా ఉన్న విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ కూడా స్విఫ్ట్ అమ్మకాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

డిజైన్ గురించి చూసినట్లయితే చాలా ఆకట్టుకుంటుంది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికి కొత్త తరం కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని మరింత ఆధునికంగా, స్పోర్టీ స్టైలింగ్‌తో రూపొందించారు. ఎక్స్‌టీరియర్‌లో స్టైలిష్ LED DRLలు, ప్రీమియం LED హెడ్‌ల్యాంప్‌లు కారుకు ఒక ప్రత్యేకతను తీసుకొస్తాయి. ముఖ్యంగా ఈ కారు రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఈ లైటింగ్ సిగ్నేచర్ వెంటనే గుర్తుపడేలా ఉంటుంది. ప్రక్కనుంచి చూసినట్లయితే 5-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారుకు మరింత స్పోర్టీ స్టాన్స్‌ను ఇస్తాయి.

Maruti Suzuki Hatchback Swift May 2026 Sales Recorded 24 Percent Growth

వెనుక భాగంలో LED టెయిల్‌లైట్లు డైనమిక్ లుక్‌ను అందిస్తూ, మొత్తం డిజైన్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. పాత తరం వారి నుంచి మొదలుకున కొత్త తరం యువత వరకు యూత్‌ఫుల్, ఎనర్జిటిక్ ఫీల్‌ను స్విఫ్ట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంటీరియర్‌లోకి అడుగుపెడితే టెక్నాలజీ, కంఫర్ట్ రెండు కూడా సమానంగా అనిపిస్తాయి. దీని ధర కూడా ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులోనే ఉంటుంది.

ప్రస్తుతం ఈ కారు రూ. 5.79 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉండగా, టాప్ వేరియంట్ రూ. 8.65 లక్షల పరిధిలోనే ఉండటం విశేషం. LXi, VXi, ZXi, ZXi+ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో అందిస్తున్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 82 PS పవర్, 112 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ నగర రోడ్లపై చురుకైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. అంతేకాకుండా, 1.2-లీటర్ CNG వేరియంట్ అందుబాటులో ఉంది.

Maruti Suzuki Hatchback Swift May 2026 Sales Recorded 24 Percent Growth

ఈ వెర్షన్ 70 PS పవర్, 102 Nm టార్క్‌ను అందిస్తూ పనితీరు, ఎకానమీ మధ్య మంచి సమతుల్యతను కల్పిస్తోంది. డ్రైవింగ్ సౌకర్యాన్ని మరింత పెంచేందుకు మారుతి సుజుకి ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (AMT) ఎంపికలను అందిస్తోంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో ఆటోమేటిక్ వేరియంట్ వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.

మైలేజ్ విషయానికి వస్తే, స్విఫ్ట్ తన సెగ్మెంట్‌లో అత్యుత్తమ కార్లలో ఒకటిగా నిలుస్తోంది. పెట్రోల్ వేరియంట్లు 24.80 నుంచి 25.75 కిలోమీటర్లు/లీటర్ వరకు మైలేజ్ అందిస్తే, CNG వేరియంట్ 32.85 కిలోమీటర్లు/కిలో వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఈ స్థాయి మైలేజ్ వినియోగదారులకు భారీ ఆదాను అందిస్తుంది.

Article Published On: Saturday, June 6, 2026, 13:58 [IST]
English summary
Maruti suzuki hatchback swift may 2026 sales recorded 24 percent growth
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+