ఇది కారు కాదు భయ్యా.. ఒక చిన్న రాకెట్..స్విఫ్ట్ కు స్వస్తి చెప్పి దీన్నే కొంటున్న జనం

మారుతి సుజుకి ఈ పేరు వింటేనే సామాన్యులకు కొండంత నమ్మకం. బడ్జట్ ధరలో కార్లను అందించడంలో మారుతి సుజుకి కంపెనీకి సాటి లేదు. అయితే మారుతి లైనప్‎లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న కారు మారుతి సుజుకి ఇగ్నిస్ (Maruti Suzuki Ignis). ఒకప్పుడు స్విఫ్ట్‌తో పోటీ పడిన రిట్జ్ కారును గుర్తు చేసే విధంగా ఉండే ఇగ్నిస్, ప్రస్తుతం భారతీయ రోడ్ల మీద మళ్లీ తన సత్తాను చాటుతోంది. ముఖ్యంగా కొత్త స్విఫ్ట్ 3-సిలిండర్ ఇంజిన్‌కు మారిన తర్వాత, పవర్‌ఫుల్ 4-సిలిండర్ ఇంజిన్ కోరుకునే వారంత ఇగ్నిస్ వైపు క్యూ కడుతున్నారు.

మారుతి సుజుకి ఇగ్నిస్ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. యూరప్ మార్కెట్ కోసం సుజుకి డిజైన్ చేసిన ఈ మోడల్, ఇండియాలో మొదట్లో అంతగా ఆకట్టుకోలేదు. కానీ కాలక్రమేణాకానీ, కాలక్రమేణా దీని బాక్సీ లుక్, హై-రైడ్ డిజైన్ కస్టమర్లను బాగా ఆకర్షించాయి.

Maruti Suzuki Ignis Sales Surge 155 Why Buyers Are Choosing It Over the New Swift

తాజాగా 2025 డిసెంబర్ నెల సేల్స్ లెక్కలు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. గతేడాది ఇదే సమయంలో (డిసెంబర్ 2024) కేవలం 749 యూనిట్లు అమ్ముడవగా ప్రస్తుతం 1910 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే ఏకంగా 155.01 శాతం వృద్ధిని నమోదు చేసి సెగ్మెంట్లోనే దుమ్ము లేపుతోంది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొత్త మారుతి స్విఫ్ట్ 3-సిలిండర్ ఇంజిన్‌తో వస్తోంది. కానీ పాత తరం స్మూత్ డ్రైవింగ్, పవర్ ఇష్టపడే వారు 1.2 లీటర్ ఫోర్-సిలిండర్ (4-Cylinder) పెట్రోల్ ఇంజిన్‌ను కోరుకుంటున్నారు. ఇగ్నిస్లో ఈ పెప్పీ ఇంజిన్ ఉండడమే దీని సక్సెస్‎కు ప్రధాన కారణం.

Maruti Suzuki Ignis Sales Surge 155 Why Buyers Are Choosing It Over the New Swift

ఇది 83 bhp పవర్, 113 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది నడపడానికి చాలా స్మూతుగా ఉండడమే కాకుండా సిటీ ట్రాఫిక్‌లో రాకెట్‌లా దూసుకుపోతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్లలో వస్తుంది.

ఇగ్నిస్ లోపలి భాగం మారుతి ఇతర బడ్జెట్ కార్ల కంటే భిన్నంగా, చాలా మోడ్రన్‌గా ఉంటుంది. ఇందులో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కీ-లెస్ ఎంట్రీ, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, సీటు కింద మంచి లెగ్ రూమ్, ఐదుగురు ప్రయాణించడానికి వీలుగా ఉండే 5-సీటర్ లేఅవుట్ ఉంటుంది.

Maruti Suzuki Ignis Sales Surge 155 Why Buyers Are Choosing It Over the New Swift

మారుతి ఇగ్నిస్ తన తక్కువ బరువు కలిగిన హార్టెక్ట్ (Heartect) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. దీనివల్ల మంచి స్టెబిలటీని ఇవ్వడమే కాకుండా లీటరుకు 20.89 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. సిటీల్లో తిరిగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది చాలా పొదుపైన కారు. ఈ కారు పొడవు 3.7 మీటర్లు ఉండటం వల్ల ఇరుకైన సందుల్లో కూడా పార్కింగ్ చేయడం చాలా ఈజీ.

ఇగ్నిస్‎లో ప్రస్తుతం 6 ఎయిర్‌బ్యాగ్‌లు లేనప్పటికీ అవసరమైన అన్ని సేఫ్టీ ప్రమాణాలను ఇది పాటిస్తోంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (ABS) విత్ ఈబీడీ (EBD), రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ అలారమ్, హై-స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ యాంకరేజ్ వంటి ఫీచర్లు ఇందులో స్టాండర్డ్‌గా వస్తాయి. నెక్సా (NEXA) డీలర్‌షిప్ ద్వారా విక్రయించబడే అత్యంత చౌకైన కారు ఇదే కావడం విశేషం.

మొత్తానికి, పవర్‌ఫుల్ ఫోర్-సిలిండర్ ఇంజిన్, అదిరిపోయే మైలేజీ, ప్రీమియం నెక్సా అనుభూతిని కోరుకునే వారికి ఇగ్నిస్ ఒక బెస్ట్ ఆప్షన్. అందుకే ప్స్త ఈ కారుకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

More from DriveSpark

Article Published On: Sunday, January 25, 2026, 7:40 [IST]
English summary
Maruti suzuki ignis sales surge 155 why buyers are choosing it over the new swift
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+