జాతర్లు, ఫంక్షన్‌కు రెండు కార్లు ఎందుకు? ఈ ఒక్కటి చాలు.. బంధువులందరినీ ఒకేసారి తీసుకెళ్లే కారు!
మారుతి సుజుకి (Maruti Suzuki) ప్రీమియం 7 సీటర్ ఎంపీవీగా గుర్తింపు పొందిన ఇన్విక్టో (Invicto) మార్కెట్లో నెమ్మదిగా కానీ నిలకడగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. పెద్ద సంఖ్యలో అమ్మకాలు నమోదు చేసే మోడల్ కాకపోయినా, పనీతీరు, టెక్నాలజీ, మారుతి బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కారణంగా ఈ కారును కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే ఇన్విక్టో అమ్మకాల ప్రయాణాన్ని తాబేలు నడకతో పోల్చవచ్చు. వేగంగా దూసుకెళ్లకపోయినా, ప్రతి నెలా స్థిరమైన విక్రయాలతో తన ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి.
గత నెలలో మారుతి సుజుకి ఇన్విక్టో 349 యూనిట్లు అమ్మగలిగింది. గత ఏడాది ఇదే నెలలో ఈ మోడల్ 264 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి దాదాపు 35 శాతం వార్షిక వృద్ధి నమోదు చేయడం విశేషం. ఈ గణంకాలు పెద్దగా కనిపించకపోయినా, ప్రీమియం ఎంపీవీ విభాగంలో ఇది మంచి సంకేతంగా చెప్పవచ్చు. సౌకర్యవంతమైన లాంగ్ డ్రైవ్‌లు, హైబ్రిడ్ టెక్నాలజీ, తక్కువ ఫ్యూయల్ ఖర్చు కావాలనుకునే వారు దీనిని ఎంచుకుంటున్నారు.

మార్కెట్లో ఇన్విక్టో ధర రూ. 25.51 లక్షల నుంచి రూ. 29.22 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఎంచుకునే వేరియంట్, సీటింగ్ ఆధారంగా ధరలో మార్పులు ఉంటాయి. హైదరాబాద్‌లో ఈ ఎంపీవీ ఆన్‌రోడ్ ధర సుమారు రూ. 31.72 లక్షల నుంచి రూ. 36.21 లక్షల వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్, ఇన్యూరెన్స్, ఇతర స్థానిక ఛార్జీల కారణంగా నగరాన్ని బట్టి ఆన్-రోడ్ ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది.
ఇంజిన్ విషయానికి వస్తే, మారుతి సుజుకి ఇన్విక్టోలో అత్యాధునిక 2.0 లీటర్, నాలుగు సిలిండర్ల స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఏర్పాటు చేయడం విశేషం. దీనికి శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ జోడించారు. దీంతో ఈ ఎంపీవీ మెరుగైన పనితీరు, తక్కువ ఫ్యూయల్ వాడకం రెండింటినీ ఒకేసారి అందిస్తుంది. ఈ హైబ్రిడ్ సిస్టమ్‌ను e-CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. సిటీల్లో, హైవే రోడ్లపై కూడా ఇది స్మూత్ డ్రైవింగ్ ఇస్తుంది.

హైబ్రిడ్ టెక్నాలజీ అందిస్తున్న కార్లలో సాధారణంగా మైలేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఎంపీవీ కూడా కస్టమర్లు కోరుకున్న సానుకూల మైలజ్‌ను అందించడంలో ముందు ఉంటుంది. కంపెనీ వెల్లడించిన దాని ప్రకారం చూసినట్లయితే, ఈ ఎంపీవీ లీటరుకు 23.24 కిలోమీటర్ల వరకు మైలేజీ అందిస్తుంది. ప్రీమియం 7 సీటర్ విభాగంలో ఈ రేంజ్‌లో మైలేజ్ ఇవ్వడం ఇన్విక్టోను మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ఇంజిన్ పనితీరు అని ఒక్కటే కాదు, ఫీచర్లు కూడా ఈ కారులో డజన్ల కొద్ది ఉన్నాయి. ఇవన్నీ లోపల కూర్చున్న ప్రయాణికులకు ప్రయాణ సమయంలో కంఫర్ట్ అనుభూతిని అందిస్తాయి. ఫీచర్ల పరంగా ఈ కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్‌తో కూడిన పనోరమిక్ సన్‌రూఫ్, 50కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, కారులో నుంచే చూట్టు చూడటానికి 360-డిగ్రీ కెమెరా మొదలగుని ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

ఇంకా, లోపల వాతావరణం కంట్రోల్ చేయడానికి డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సీటింగ్‌లో మెరుగైన అనుభుతి కోసం పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, గాలి లోపలికి వచ్చేలా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. అలాగే సేఫ్టీ కోసం కూడా కంపెనీ ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి పలు అత్యాధునికి సేఫ్టీ అంశాలు అందించింది.


Click it and Unblock the Notifications