సామాన్యుడికి మారుతి బంపర్ ఆఫర్.. ఆ 5 మోడళ్లపై మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచలేదు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) తన వివిధ మోడళ్ల కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మే నెలలోనే కంపెనీ ఈ ధరల పెంపునకు సంబంధించిన సంకేతాలను ఇచ్చింది. ఈ సరికొత్త ప్రైస్ హైక్ ప్రభావం కంపెనీకి చెందిన బడ్జెట్ సెగ్మెంట్ ఎరీనా, ప్రీమియం సెగ్మెంట్ నెక్సా డీలర్ షిప్స్ ద్వారా విక్రయించే కార్లపై పడింది. అయితే, కొన్ని మోడళ్ల ధరలను పెంచిన మారుతి సంస్థ, మరికొన్ని మోడళ్ల ధరలను తగ్గించింది. అదే సమయంలో సామాన్యులకు అందుబాటులో ఉండే 5 కార్ల ధరలను మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచకుండా అలాగే ఉంచింది.

పాత ధరలకే లభించనున్న టాప్-5 మోడళ్లు
మారుతి సుజుకి ధరలను పెంచని ఆ 5 కార్ల జాబితాలో కంపెనీ ఎంట్రీ లెవల్ బడ్జెట్ మోడళ్లతో పాటు దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే కార్లు ఉన్నాయి. అవి మారుతి ఎస్-ప్రెస్సో (S-Presso), ఆల్టో K10 (Alto K10), సెలెరియో (Celerio), డిజైర్ (Dzire), బ్రెజ్జా (Brezza).

Maruti Suzuki Keeps Prices Unchanged for 5 Popular Cars Despite Price Hike on Other Models

ఈ కార్ల ప్రస్తుత పాత ధరలే ఇకపైనా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. త్వరలోనే మార్కెట్లోకి సరికొత్త అప్‌డేటెడ్ బ్రెజ్జా మోడల్ రాబోతున్నందున, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి.

ఏ కార్ల ధరలు ఎంత ఉన్నాయంటే?
ధరల పెంపు లేని మారుతి కార్ల తాజా ప్రైస్ లిస్ట్ ఈ విధంగా ఉంది. దేశంలోనే అత్యంత చౌకైన కార్లలో ఒకటిగా పేరొందిన మారుతి ఎస్-ప్రెస్సో ప్రారంభ ధర ఎప్పటిలాగే రూ.3,49,900 గానే ఉంటుంది. అలాగే అందరి ఫేవరెట్ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ మారుతి ఆల్టో K10 ధర కూడా రూ.3,69,900 వద్ద స్థిరంగా ఉంది.

మరో పాపులర్ కారు సెలెరియోను కూడా కస్టమర్లు రూ.4,69,900 ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు బెస్ట్ సెల్లింగ్ సెడాన్ మారుతి డిజైర్ ధర రూ.6,25,600 వద్ద, కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతి బ్రెజ్జా ధర రూ.8,25,900 వద్దే కొనసాగుతున్నాయి.

Maruti Suzuki Keeps Prices Unchanged for 5 Popular Cars Despite Price Hike on Other Models

మారుతి ఎస్-ప్రెస్సో ఫీచర్లు, మైలేజ్
మారుతి ఎస్-ప్రెస్సో కారులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఇది 68 పీఎస్ పవర్, 89 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. ఈ కారు సిఎన్‌జి (CNG) వేరియంట్‌లో కూడా లభిస్తుంది.

మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24 కిమీ, ఆటోమేటిక్ వేరియంట్ 24.76 కిమీ, సిఎన్‌జి వేరియంట్ ఏకంగా 32.73 కిమీ/కేజీ మైలేజీని ఇస్తాయి. ఇందులో 7-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు గడిచిన ఏప్రిల్ నెలలో ఏకంగా 617 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.

మారుతి ఆల్టో K10 సేఫ్టీ అప్‌డేట్స్
మారుతి సుజుకి ఆల్టో K10 కారును కంపెనీ అప్‌డేటెడ్ హార్టెక్ట్ (Heartect) ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేశారు. ఇందులో సరికొత్త నెక్స్ట్ జనరేషన్ K-సిరీస్ 1.0-లీటర్ డ్యూయల్ జెట్ ఇంజన్ ఉంటుంది. ఇది 66.62 పీఎస్ పవర్ ను ఇస్తుంది. దీని ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 24.90 కిమీ, మాన్యువల్ వేరియంట్ 24.39 కిమీ, సిఎన్‌జి వేరియంట్ 33.85 కిమీ/లీటర్ మైలేజీని అందిస్తాయి.

ఈ కారులో కూడా 7 ఇంచుల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. కస్టమర్ల భద్రత కోసం మారుతి సంస్థ ఇప్పుడు ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను (6 Airbags) స్టాండర్డ్ ఫీచర్‌గా అప్‌డేట్ చేసింది. దీనితో పాటు ఏబీఎస్, ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.

Article Published On: Friday, June 26, 2026, 11:22 [IST]
English summary
Maruti suzuki keeps prices unchanged for 5 popular cars despite price hike on other models
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+