ఇక రేట్లు పెరిగినా నో టెన్షన్.. చిన్న కారు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి బంపర్ ఆఫర్

సొంతంగా ఒక చిన్న కారు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) ఒక అద్భుతమైన వార్త చెప్పింది. ప్రస్తుతం పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల కారణంగా జూన్ నెల నుండి తమ కార్ల ధరలను సుమారు రూ.30,000 వరకు పెంచుతున్నట్లు కంపెనీ గత నెలలోనే ప్రకటించింది. అయితే ఈ ధరల పెంపు వల్ల మొదటిసారి కారు కొనే సామాన్య కస్టమర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మారుతి సుజుకి ఒక ప్రత్యేకమైన ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్ (Price Protection Scheme)ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో కారు కొనాలనుకునే వారిలో ఉన్న అతిపెద్ద టెన్షన్ దూరమైంది.

జూన్ 14 వరకు పాత ధరలకే కార్లు
కంపెనీ తీసుకొచ్చిన ఈ సరికొత్త ప్రైస్ ప్రొటెక్షన్ విండో ప్రకారం.. ఈ నెల 14వ తేదీ (జూన్ 14, 2026) లోపు కారు బుక్ చేసుకునే కస్టమర్లకు పెరిగిన ధరలు వర్తించవు. అంటే, జూన్ నెలలో ధరలు పెరిగినప్పటికీ, ఈ డెడ్‌లైన్ లోపు బుకింగ్ చేసుకున్న వారికి పాత ధరలకే కారును డెలివరీ చేస్తారు. దీనివల్ల కస్టమర్లకు వేలాది రూపాయల ఆదా అవుతుంది. కంపెనీకి చెందిన డీలర్ నెట్‌వర్క్ ఇచ్చిన కీలక సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ స్పష్టం చేశారు. కారు కొనడానికి ధైర్యం చేసే మధ్యతరగతి వారు ధరల పెంపు వల్ల వెనకడుగు వేయకూడదనేదే తమ తాపత్రయమని ఆయన పేర్కొన్నారు.

maruti suzuki price protection suhana safar scheme alto wagonr celerio offers telugu

ఈ చిన్న కార్లకే ఆఫర్ వర్తిస్తుంది
మారుతి సుజుకి తెచ్చిన ఈ ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్ కేవలం ఎంట్రీ లెవెల్ (చిన్న కార్లు) మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే చిన్న కార్లయిన ఆల్టో కే10 (Alto K10), ఎస్-ప్రెస్సో (S-Presso), సెలెరియో (Celerio), వ్యాగన్ఆర్ (WagonR) మోడళ్లను కొనుగోలు చేసే కస్టమర్లు ఈ స్కీమ్ ద్వారా నేరుగా లాభం పొందవచ్చు. మొదటిసారి కారు కొనేవారిని ప్రోత్సహించడానికి, దేశంలో కార్ల అమ్మకాలను మరింత పెంచడానికి కంపెనీ ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.

డౌన్ పేమెంట్ కోసం సుహానా సఫర్ స్కీమ్
ధరల రక్షణతో పాటు, కారు కొనేటప్పుడు ఒకేసారి డౌన్ పేమెంట్ కట్టడానికి లేదా ప్రతీ నెల ఈఎంఐ (EMI) సర్దుబాటు చేయడానికి ఇబ్బంది పడే వారి కోసం మారుతి సుజుకి సుహానా సఫర్ (Suhana Safar) అనే సరికొత్త ఆటో లోన్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. ఇది పూర్తిగా రికరింగ్ డిపాజిట్ (RD) ఆధారిత లోన్ స్కీమ్. ఈ పథకం కూడా ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ఆర్ వంటి చిన్న కార్లకే అందుబాటులో ఉంటుంది.

maruti suzuki price protection suhana safar scheme alto wagonr celerio offers telugu

నగల సేవింగ్స్ తరహాలోనే సరికొత్త ప్లాన్
సాధారణంగా మహిళలు ప్రతీ నెల కొంత డబ్బులు దాచుకుని జ్యువెలరీ షాపుల్లో బంగారం కొనే సేవింగ్స్ స్కీమ్స్ తరహాలోనే ఈ సుహానా సఫర్ ప్లాన్‌ను డిజైన్ చేశారు. ఈ స్కీమ్ కింద కస్టమర్లు ప్రతీ నెల తమకు వీలైనంత చిన్న మొత్తాన్ని లేదా కారు ఈఎంఐకి సమానమైన డబ్బును ఒక ఆర్‌డీ (RD) అకౌంట్‌లో జమ చేయాలి. ఇలా మూడు నుంచి ఆరు నెలల పాటు క్రమబద్ధంగా డబ్బులు దాచుకున్న తర్వాత, ఆ మొత్తాన్ని అదే బ్యాంక్ నుంచి కార్ లోన్ తీసుకునే సమయంలో డౌన్ పేమెంట్‎గా వాడుకోవచ్చు. దీనివల్ల ఒకేసారి పెద్ద మొత్తం చేతిలో లేకపోయినా సులభంగా కారు సొంతం చేసుకోవచ్చు.

కస్టమర్ల నుండి అదిరిపోయే రెస్పాన్స్
మారుతి సుజుకి ప్రవేశపెట్టిన ఈ సరికొత్త పథకాలకు మార్కెట్లో కస్టమర్ల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. పీటీఐ (PTI) నివేదిక ప్రకారం.. సుహానా సఫర్ స్కీమ్ గురించి తెలుసుకోవడానికి ఇప్పటివరకు దాదాపు 8,000 మందికి పైగా కస్టమర్లు ఆరా తీశారు. అంతేకాకుండా, ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే 1,700కి పైగా కార్ల బుకింగ్స్ కూడా పూర్తయ్యాయి. కారు కొనాలనే గట్టి నమ్మకంతో ఉన్న సాధారణ ప్రజలకు ఈ రెండు పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారుతాయని, అలాగే రాబోయే రోజుల్లో చిన్న కార్ల సేల్స్ మరింత పుంజుకుంటాయని మారుతి సుజుకి యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది.

Article Published On: Wednesday, June 10, 2026, 11:25 [IST]
English summary
Maruti suzuki price protection suhana safar scheme alto wagonr celerio offers telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+