పేదోళ్లు సైతం కొనేంత తక్కువ ధరకే మంచి కారు.. పైగా 32.73 Km మైలేజ్, జనాలు భారీగా కొంటున్నారు

భారతీయ చిన్న కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, తొలిసారి కారు కొనుగోలు చేసే వినియోగదారులు, అలాగే నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీ తీసుకొచ్చిన మోడళ్లలో ఎస్ ప్రెస్సో (S-Presso) ఒకటి. చిన్న సైజులో ఉండి కూడా SUV తరహా స్టైలింగ్‌ను అందిస్తుంది. రద్దీగా ఉండే నగర వీధుల్లో పెద్ద కార్లను నడపడం చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తుంటే, ఎస్-ప్రెస్సో మాత్రం తన కాంపాక్ట్ డిజైన్‌తో ట్రాఫిక్ మధ్య ఎంతో ఈజీగా దూసుకుపోతుంది. చిన్న గల్లీలు, ఇరుకైన పార్కింగ్ ప్రదేశాలు, భారీ ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి పరిస్థితుల్లో కూడా ఈ కారును చాలా సులభంగా నియంత్రించవచ్చు.

అందుకే ఇది రోజువారీ సిటీ డ్రైవింగ్‌కు సరైన ఎంపికగా నిలిచింది. అంతేకాదు, కారులో ఇచ్చిన ఎత్తైన సీటింగ్ పొజిషన్ డ్రైవర్‌కు రోడ్డుపై మంచి విజిబిలిటీని అందిస్తుంది. దీంతో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారు కూడా ధైర్యంగా కారును నడపగలుగుతున్నారు. మైలేజ్ విషయంలో కూడా ఎస్-ప్రెస్సో వినియోగదారులను నిరాశపరచదు. పెరుగుతున్న పెట్రోల్ ధరల సమయంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లకే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండగా, ఈ మోడల్ ఆ అంచనాలను అందుకుంటోంది.

Maruti Suzuki S presso April 2026 Sales Recorded 5210 Units Full Details Inside

తక్కువ నిర్వహణ ఖర్చులు, అందుబాటులో ఉండే స్పేర్ పార్ట్స్, దేశవ్యాప్తంగా విస్తరించిన సర్వీస్ నెట్‌వర్క్ కూడా ఈ కారుకు మరింత ప్లస్ పాయింట్లుగా మారాయి. అందుకే చిన్న కుటుంబాలు, ఉద్యోగులు, కాలేజ్ యువత వంటి వర్గాల్లో ఈ కారు మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పుడు విడుదలైన తాజా అమ్మకాల గణాంకాలు చూస్తే, మార్కెట్లో ఎస్-ప్రెస్సోకు ఉన్న డిమాండ్ ఎంతగా పెరిగిందో స్పష్టంగా అర్థమవుతోంది.

2026 ఏప్రిల్ నెలలో ఈ కారు మొత్తం 5,210 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 726 యూనిట్లు మాత్రమే విక్రయాలు నమోదవగా, ఇప్పుడు అమ్మకాలు భారీగా ఎగబాకాయి. అంటే ఏడాది వ్యవధిలో దాదాపు 618 శాతం వృద్ధిని నమోదు చేయడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. చిన్న కార్ల సెగ్మెంట్‌లో ఈ స్థాయి గ్రోత్ సాధించడం ద్వారా ఎస్-ప్రెస్సో మరోసారి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.

Maruti Suzuki S presso April 2026 Sales Recorded 5210 Units Full Details Inside

ప్రస్తుతం పెరుగుతున్న ట్రాఫిక్, పెట్రోల్ ఖర్చులు, పార్కింగ్ సమస్యలు వంటి పరిస్థితుల్లో పెద్ద కార్ల కంటే చిన్న మరియు ప్రాక్టికల్ కార్ల వైపు ప్రజలు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి సమయంలో Maruti Suzuki S-Presso లాంటి మోడళ్లకు మార్కెట్లో మంచి ఆదరణ లభించడం సహజమే. స్టైల్, మైలేజ్, సౌకర్యం, తక్కువ ఖర్చు అన్నీ ఒకే కారులో కావాలనుకునే వారికి ఈ కారు సరైన ఎంపికగా నిలుస్తోంది.

ధర పరంగా కూడా S-Presso సామాన్య కుటుంబాలకు అందుబాటులో ఉండే కార్లలో ఒకటిగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.50 లక్షల నుండి రూ. 5.25 లక్షల మధ్య ఉండటంతో, తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు, మైలేజ్ కోరుకునే వారికి ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. పర్ఫార్మెన్స్ విషయంలో ఇందులో కంపెనీ 1.0-లీటర్, మూడు సిలిండర్ల కె10సి పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తోంది.

Maruti Suzuki S presso April 2026 Sales Recorded 5210 Units Full Details Inside

డ్యూయల్ జెట్, డ్యూయల్ వివిటి టెక్నాలజీలతో పాటు ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌ను జోడించడం వల్ల ఇంధన వినియోగం తగ్గి మెరుగైన సామర్థ్యం లభిస్తోంది. ఈ ఇంజన్ 66 bhp పవర్, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కారును 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో కూడా అందిస్తోంది. క్లచ్, గేర్ మార్పుల తలనొప్పి లేకుండా డ్రైవింగ్ చేయాలనుకునే వారికి AMT వెర్షన్ మంచి ఎంపిక.

మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లు లీటరుకు 24.76 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలవు. ఇక AMT ఆటోమేటిక్ వెర్షన్లు అయితే 25.3 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి. అంతేకాదు, ఎక్కువ మైలేజ్ కోసం చూస్తున్న వినియోగదారుల కోసం కంపెనీ CNG వేరియంట్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఈ మోడల్ ఒక కిలో CNGకి 32.73 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు.

Article Published On: Friday, May 15, 2026, 11:13 [IST]
English summary
Maruti suzuki s presso april 2026 sales recorded 5210 units full details inside
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+