కేవలం మూడున్నర లక్షలకే కొత్త కారు! ఇది చాలా ఫేమస్.. అందరూ ఇదే కావాలంటున్నారు!

భారతీయ కార్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కార్లలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso) ఒకటి. బడ్జెట్ ధర, ఎత్తైన స్టాన్స్, మారుతి బ్రాండ్ నమ్మకం వంటి కారణాలతో ఈ కారు ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే వారిలో మంచి ఆదరణ పొందింది. అయితే ఇటీవలి కాలంలో ఈ మోడల్ అమ్మకాలు కొంత మందగించిన మాట వాస్తవమే. అయినప్పటికీ, డిసెంబర్ 2025లో మాత్రం ఎస్-ప్రెస్సో అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గణాంకాలను గమనిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. డిసెంబర్ 2025లో భారత మార్కెట్లో మొత్తం 3,396 మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కార్లు అమ్ముడయ్యాయి. అదే దీనికి ముందు నెల అయిన నవంబర్ 2025లో కేవలం 1,747 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి.

అంటే ఒక్క నెల వ్యవధిలోనే 1,649 అదనపు కార్లు అమ్ముడయ్యాయన్న మాట. ఈ సంఖ్యలను లెక్కిస్తే, నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో 48.56 శాతం అమ్మకాల వృద్ధి నమోదు కావడం గమనార్హం. సాధారణంగా చూస్తే, మారుతి ఎస్-ప్రెస్సో అమ్మకాలు గత కొన్ని నెలలుగా అంతగా ఆశాజనకంగా లేవు. మార్కెట్లో కొత్త మోడళ్లు, ఎక్కువ ఫీచర్లతో వచ్చే కార్లు రావడం, అలాగే కస్టమర్ల అభిరుచులు మారడం వల్ల ఎస్-ప్రెస్సో కొంత వెనకబడినట్టు అనిపించింది.

Maruti Suzuki S-Presso December 2025 Sales Recorded 48 56 Percent Growth Details

కానీ డిసెంబర్ నెలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి సంవత్సరం చివరి అమ్మకాల ట్రెండ్. సాధారణంగా ప్రతి ఏడాది చివర్లో కార్ తయారీదారులు ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్లు అందిస్తారు. కొత్త ఏడాదిలోకి ప్రవేశించే ముందు స్టాక్ క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో ఆఫర్లు ఉంటాయి. ఈ సమయంలో చాలా మంది వినియోగదారులు ఇప్పుడు కొంటే లాభం అన్న ఆలోచనతో కారు కొనుగోలుకు ముందుకు వస్తారు.

డిసెంబర్ 2025లో ఎస్-ప్రెస్సో అమ్మకాలు పెరగడానికి ఇదే ముఖ్యమైన కారణం. అదే విధంగా, ఎస్-ప్రెస్సో ఇప్పటికీ తక్కువ ధరలో లభించే మారుతి కార్లలో ఒకటి కావడం కూడా ప్లస్ అయింది. పెరుగుతున్న కారు ధరల మధ్య, బడ్జెట్‌లో కారు కావాలనుకునే మిడిల్ క్లాస్, చిన్న కుటుంబాలు, గ్రామీణ ప్రాంత వినియోగదారులు ఈ మోడల్ వైపు మరలారు. మారుతి సర్వీస్ నెట్‌వర్క్, తక్కువ మెయింటెనెన్స్ అంశాలు కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి.

Maruti Suzuki S-Presso December 2025 Sales Recorded 48 56 Percent Growth Details

ప్రస్తుతం ఈ కారు ఎంట్రీ-లెవల్ వేరియంట్ కేవలం రూ. 3.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తోంది. ఈ ధర రేంజ్‌లో బ్రాండ్ నమ్మకం, నమ్మకమైన ఇంజిన్, తక్కువ నిర్వహణ ఖర్చుతో వచ్చే కారు చాలా అరుదు. అదే సమయంలో, ఎస్-ప్రెస్సో టాప్ వేరియంట్ ధర కూడా రూ. 5.25 లక్షలకే పరిమితం కావడం వల్ల, బడ్జెట్‌లో కారు కొనాలని భావించే మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారింది.

ఇందులోని 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 66 PS హార్స్‌పవర్, 89 Nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగర ప్రయాణాలకు, రోజువారీ వినియోగానికి సరిపడా శక్తిని అందిస్తుంది. ఇంధన ఖర్చును మరింత తగ్గించుకోవాలనుకునే వినియోగదారుల కోసం 1.0-లీటర్ CNG ఇంజిన్ ఎంపికను కూడా మారుతి అందిస్తోంది. ఈ ఇంజిన్ 56 PS హార్స్‌పవర్, 82 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

Maruti Suzuki S-Presso December 2025 Sales Recorded 48 56 Percent Growth Details

ట్రాన్స్‌మిషన్ పరంగా కూడా ఎస్-ప్రెస్సో వినియోగదారులకు సౌలభ్యాన్ని అందిస్తుంది. వేరియంట్‌ను బట్టి ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ (AMT) గేర్‌బాక్స్‌తో వస్తుంది. ముఖ్యంగా నగర ట్రాఫిక్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ డ్రైవింగ్‌ను మరింత సులభంగా మార్చుతుంది. మైలేజీ విషయంలో ఎస్-ప్రెస్సో తన సెగ్మెంట్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ కారు ఇంధన రకం, వేరియంట్ ఆధారంగా 24 నుంచి 33 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 15, 2026, 14:21 [IST]
English summary
Maruti suzuki s presso december 2025 sales recorded 48 56 percent growth details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+