బైక్ ధరకే మార్కెట్లో లభిస్తున్న కారు.. పైగా 32.73 కిమీ మైలేజ్! పేదోడికి బెంజ్ లాగా.. సేల్స్‌కు కాస్త బ్రేక్

ఎస్‌యూవీలకు, ఎంపీవీలకు డిమాండ్ బాగా పెరుగుతున్న కాలంలో చిన్న కార్లు అయినటువంటి హ్యాచ్‌బ్యాక్‌లకు డిమాండ్ చాలా వరకు తగ్గిపోతుంది. ఒకప్పుడు ఎంట్రీ లెవల్ కార్లకు లభించిన ఆదరణ చాలా ఎక్కువగా ఉండేది. కానీ మారుతున్న వినియోగదారుల అభిరుచుల కారణంగా చిన్న కార్లను కొనేవారు మెల్లగా తగ్గిపోతున్నారు. తాజాగా మారుతి సుజుకికి చెందిన ప్రసిద్ద కారు ఎస్-ప్రెస్సో‌ (S-Presso)కు సంబంధించి గత నెల అమ్మకాలు విడుదల అయ్యాయి. దీనిని చూస్తే, మార్కెట్ పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయో అర్థం అవుతుంది. సేల్స్ నివేదిక ప్రకారం, దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతి సుజుకికి చెందిన ఎస్-ప్రెస్సో 2026 జూన్ నెలలో 1,028 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

దేశంలోనే అత్యంత చౌకైన కారుగా నిలిచిన ఎస్-ప్రెస్సో 2025 జూన్ నెలలో 1,369 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ లెక్కన ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఈ సారి అమ్మకాలు దాదాపుగా 25 శాతం తగ్గిపోయాయి. ఒకప్పుడు మార్కెట్లో మంచి ఆదరణ పొందిన ఈ మోడల్‌కు ఇటీవల నెలల్లో డిమాండ్ కాస్త తగ్గినట్లు అమ్మకాల గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, రానున్న పండగల కాలంలో దీని అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.

Maruti Suzuki Spresso June 2026 Sales Recorded 25 Percent Down

ఈ కారు సైజు పరంగా కాంపాక్ట్‌గా ఉండటంతో పాటు, ఎత్తైన సీటింగ్ పొజిషన్‌ను కలిగి ఉంటుంది. దీంతో రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లలో కూడా డ్రైవింగ్ చాలా సులభంగా అనిపిస్తుంది. చిన్న కుటుంబాలకు, రోజూ ప్రయాణాలు చేసే వారు నమ్మకమైన మంచి కారును కోరుకునే వారికి దీనిని ఎంచుకోవచ్చు. ఈ కారు మీ డబ్బుకు మంచి విలువను అందించే మోడల్‌గా నిలస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ కారులో ఐదు మంది కూర్చోని సులభంగా ప్రయాణించగలరు. చిన్న కుటుంబాలకు ఇది సరిపోతుంది. ఫ్యామిలీ ఫంక్షన్ల టైంలో బస్సులు, రైళ్లు, ఆటోల్లో కాకుండా ఈ కారులో అందరూ కలిసి హాయిగా ప్రయాణించడానికి వీలవుతుంది. లోపల క్యాబిన్ చాలా వరకు విశాలంగా ఉంటుంది. బయట నుంచి చూస్తే కాంపాక్ట్‌గా కనిపించినా, లోపలికి వెళ్లిన తర్వాత ఎస్-ప్రెస్సో అందించే స్పేస్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Maruti Suzuki Spresso June 2026 Sales Recorded 25 Percent Down

ధరలు గురించి చూసినట్లయితే, భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో రూ.3.49 లక్షల నుంచి రూ. 5.24 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధర మధ్యలో కొనుగోలు చేయానికి లభిస్తుంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ కారును మారుతి సుజుకి హార్టెక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ధి చేయడం విశేషం. బాక్సీ స్టైలింగ్‌తో చిన్న కారు అయినప్పటికీ SUV తరహా ఎత్తైన స్టాన్స్‌తో రోడ్డుపై ఆకట్టుకునేలా కనిపించడం దీని ప్రధాన ప్రత్యేకత.

దీని ఇంజిన్ పనితీరు గురించి చూసినట్లయితే, 1.0 లీటర్, మూడు సిలిండర్ల K10C పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT, అలాగే ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతికతలను కూడా ఈ కారులో అందించారు. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌‌తో జోడించారు. ఇది తక్కువ బరువు, స్మూత్ ఇంజన్ పనితీరుతో సిటీల్లో, హైవేపైనా డ్రైవింగ్ సౌకర్యవంతంగా అనిపిస్తుంది.

Maruti Suzuki Spresso June 2026 Sales Recorded 25 Percent Down

ఈ కారు పెట్రోల్‌తో పాటు CNG వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉండటం మరో పెద్ద ప్లస్ పాయింట్. CNG మోడ్‌లో పెట్రోల్‌తో పోలిస్తే పవర్ కొద్దిగా తగ్గినా, ఫ్యూయల్ ఖర్చు మాత్రం భారీగానే తగ్గుతుంది. కంపెనీ ప్రకారం, CNG వెర్షన్ కిలోకు 32.73 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. అలాగే, పెట్రోల్ మాన్యువల్ 24.76 కి.మీ/లీటర్, AMT వేరియంట్ 25.30 కి.మీ/లీటర్ వరకు మైలేజీ అందిస్తుంది.

Article Published On: Tuesday, July 14, 2026, 9:09 [IST]
English summary
Maruti suzuki spresso june 2026 sales recorded 25 percent down
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+