ఈ ఒక్క కారు కొంటే 10 ఏళ్లు హాయిగా వాడొచ్చు.. 32.85 కిమీ మైలేజ్, రూ. 5.79 లక్షల ధర
భారత ఆటోమొబైల్ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా నమ్మే కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) పేరు ముందువరుసలో నిలుస్తుంది. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన పనితీరు, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు వంటి కారణాలతో ఈ కారు చాలా సంవత్సరాలుగా వినియోగదారుల మనసులు గెలుచుకుంటోంది. కాలం మారుతున్నా, కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నా స్విఫ్ట్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. బంగారానికి డిమాండ్ పెరిగినట్లు దీనికి డిమాండ్ పెరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ కార్ల విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో స్విఫ్ట్ అగ్రస్థానంలో నిలవడం దీని ప్రజాదరణకు నిదర్శనం.
యువత నుంచి కుటుంబాల వరకు అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే ఈ కారు, మరోసారి అమ్మకాల పరంగా తన సత్తా చాటింది. తాజాగా విడుదలైన ఏప్రిల్ 2026 అమ్మకాల గణాంకాలు చూస్తే మార్కెట్లో స్విఫ్ట్‌కు ఉన్న డిమాండ్ ఇంకా ఎంత బలంగా కొనసాగుతుందో స్పష్టంగా అర్థమవుతోంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 2026లో మొత్తం 17,829 మారుతి సుజుకి స్విఫ్ట్ కార్లు అమ్ముడయ్యాయి.

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 22.18 శాతం వృద్ధి. పెరుగుతున్న పోటీ, SUVల హవా ఉన్నప్పటికీ స్విఫ్ట్ అమ్మకాలు ఈ స్థాయిలో పెరగడం విశేషంగా చెప్పుకోవాలి. ఇది కేవలం ఒక కారుగా కాకుండా భారత కుటుంబాల నమ్మకంగా మారిందని ఈ సంఖ్యలు సూచిస్తున్నాయి. ఇక ఏప్రిల్ 2026లో దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో స్విఫ్ట్ 8వ స్థానాన్ని దక్కించుకోవడం మరో పెద్ద విజయం.
చిన్న కార్ల సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, ప్రతి నెలా భారీ అమ్మకాలతో ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. మంచి మైలేజ్‌తో పాటు సిటీ డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉండటం, కొత్త తరం డిజైన్ యువతను ఆకర్షించడం, విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ ఉండటం ప్రజాదరణ పొందేలా చేస్తున్నాయి. భారత మార్కెట్లో ఎన్నో కొత్త మోడళ్లు ప్రవేశిస్తున్నప్పటికీ, "నమ్మకం ఉన్న కారు ఏది?" అని అడిగితే చాలామంది ఇప్పటికీ స్విఫ్ట్‌నే ఎంచుకుంటున్నారు.

స్విఫ్ట్ డిజైన్ విషయానికి వస్తే, ఈ కారు యువతను ఆకట్టుకునే స్పోర్టీ లుక్‌తో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ముందు భాగంలో కొత్త స్టైలిష్ గ్రిల్, షార్ప్ LED హెడ్‌ల్యాంప్స్, ఆకర్షణీయమైన బంపర్ డిజైన్ దీనికి ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్, స్మూత్ బాడీ లైన్స్ కారును మరింత స్టైలిష్‌గా చూపిస్తాయి. వెనుక భాగంలో ఉన్న LED టెయిల్ ల్యాంప్స్ కూడా మోడ్రన్ టచ్‌ను అందిస్తాయి.
ఇంటీరియర్‌లో, కొత్త తరం స్విఫ్ట్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, రియర్ AC వెంట్స్ వంటి సౌకర్యాలు డ్రైవింగ్‌ను మరింత కంఫర్ట్‌గా మారుస్తాయి. అలాగే భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర రూ. 5.79 లక్షల నుంచి, టాప్ వేరియంట్ రూ. 8.65 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ఉంటుంది. పనితీరు చూస్తే, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 82 PS శక్తి, 112 Nm టార్క్‌ను అందిస్తుంది. 1.2-లీటర్ CNG ఇంజన్ 70 PS పవర్, 102 Nm టార్క్‌ను అందిస్తుంది. మైలేజ్, పెట్రోల్ వేరియంట్లు 24.80 నుంచి 25.75 కి.మీ./లీటర్, CNG 32.85 కి.మీ./కిలో వరకు అందిస్తాయి.


Click it and Unblock the Notifications